మన దేశంలో దాదాపు అన్ని రంగాల్లో మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో అన్నిచోట్లా మహిళలు వేధింపులకు గురికాని రంగమే లేదు. నిర్మాణ రంగంలో ఈ వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఈ రంగంలో పనిచేసే మహి ళలు నిరక్షరాస్యులు కావడం వల్ల పైకి చెప్పుకోలేక మౌనంగానే అవమానాలు భరిస్తున్నారు. అంతేకాదు. పురుషాధిక్యత మన సమాజంలో ఇంకా కొనసాగుతున్న కారణంగా ఎదిరిస్తే ఉపాధి పోతుందేమోనన్న బెదురు తో చాలామంది తలవంచుకుని తమ పనులు చేసుకుని పోతున్నారు. అట్టడుగు స్థాయిలోనే కాదు, అత్యున్నత స్థాయిలో కూడా మహిళలు, అవుతున్నారు. పని ప్రదేశా ల్లో విద్యావంతులైన మహిళలు సైతం వేధింపులకు గురి అవుతున్నారు. వీటిపై ఎన్నో కోర్టు తీర్పులు కూడా వెలు వడ్డాయి. అయితే, సమాజంలో కోర్టులన్నా భయం లేక పోవడంవల్ల బరితెగించిన రీతిలో మహిళల వేధింపు అడ్డులేకుండా సాగిపోతోంది. అఖిల భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్సింగ్పై మహిళా రెజ్ల ర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలంటూ రచ్చకెక్కారు.
ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఉన్నారు. బ్రిజ్ భూషణ్‌సింగ్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు కావడంతో మహిళా రెజ్లర్ల ఆందోళనను రాజకీయంగా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతోంది. బ్రిజ్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీ. అలనాడు బీజేపీ అగ్రనేత అద్వానీ రామజన్మభూమి కోసం జరిపిన ఉద్యమంలో పాల్గొన్నాడు. ఒక వంక మల్లయోధునిగా తర్ఫీదు పొందుతూనే, మరో వంక యువనేతగా బీజేపీ ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్రనాయకులతో సంబంధాలున్నవాడు. అతడి ఎదుగదలకు, రాజకీయం గా ఆయనకున్న పలుకుబడే కారణమని సన్నిహితులం టారు. అయితే, తాను చిన్నప్పటినుంచి స్వశక్తితో ఎదిగా నని ఆయన వాదిస్తాడు.
ఆరేడు సార్లు లోక్‌సభకు ఎన్నికై న ఆయన ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఉత్తరప్రదేశ్‌లో 50 పైగా విద్యా సంస్థలున్నా యి. ఆయనకు సొంతంగా రెజ్లింగ్ అకాడమీ ఉంది. ఎంత బీజేపీ అయితే మాత్రం రాష్ట్రంలో అత్యంత పలు కుబడి కలిగిన నాయకుణ్ణి దూరం చేసుకుంటుందా? అందుకే సరిపెట్టుకునిపోతోంది. అయితే ఆయనను తొలగించనిదే ఆందోళన విరమించే ప్రసక్తి లేదని రెజ్లర్లు పట్టుపడుతున్నారు. ఢిల్లిdలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్ల ప్రతినిధులు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సంగీతా ఫోగట్, సత్యవర్త మాలిక్, సరిత మోర్ తదితరులు గురువారం రోజంతా చర్చలు జరిపారు. అయినా ఫలించలేదు. బ్రిజ్భూషణ్సింగ్ని ఆ పదవి నుంచి తొలగించేవరకూ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రికి వారు స్పష్టంగా తెలియ జేశారు.తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదనీ,బ్రిజ్ భూషణ్ వైఖరినే వ్యతిరేకిస్తున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.
ఆయన ఆడ,మగ తేడా లేకుండా రెజ్లర్లను నోటికొచ్చినట్టు తిడుతున్నారనీ, ఈ అవమానాలను ఇక భరించలేమని స్పష్టం చేస్తున్నారు. బ్రిజ్‌భూషణ్ పది పదిహేను మంది మహిళా రెజ్లర్లను వేధించినట్టు వారు తనవద్ద గోడు వెళ్లబోసుకున్నారని వినేష్ ఫోగట్ ఆరో పించింది. ఈ మహిళా రె జ్లిర్లను రచ్చకెక్కవద్దని ప్రభు త్వం ప్రాధేయపడినా వారు వినిపించుకోవడం లేదు. క్రీడారంగంలో భారత్‌కి ఉన్న మంచిపేరు పోతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వినేష్ ఫోగట్‌ని చంపుతానని బ్రిజ్ భూషణ్ తరఫున ఎవరో బెదిరించార ట. అయితే, అతడి పేరును ఆమె వెల్లడించడం లేదు. ఆ పేరును బయటపెడితే ఆ వ్యక్తికి ప్రాణహాని ఉందని, అందుకే, తాను బయటపెట్ట డం లేదని ఆమె చెబుతోంది. క్రీడలకు సంబంధించి వివిధ విభాగాల్లో ఎందులోనూ లేని రాజకీయాలు రెజ్లర్ల సమాఖ్యలో ఉన్నాయి. బ్రిజ్ భూషణ్ రాజకీయవాది కావడం వల్లనే వివాదాలు ముసురుకుంటున్నాయన్న ఆరోపణల్లో అసత్యం లేదు. తనకు వ్యతిరేకంగా ఒక పారిశ్రామికవేత్త కుట్ర చేస్తున్నా రనీ, అతడి ప్రోద్బలంపైనే వీరంతా తనపై ధ్వజమెత్తుతు న్నారని బ్రిజ్‌భూషణ్ ఆరోపించారు. తాను ఎవరినీ దూషించలేదనీ, ముక్కు సూటిగా వ ్యవహరిస్తాననీ, అది నచ్చని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, మహిళ లంటే తనకు ఎంతో గౌరవమని ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క మహిళ అయినా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో మహిళా క్రీడాకారులను కోచ్‌లు వేధి స్తున్నట్టు ఆరోపణలు తరచూ వస్తుంటాయి. కేంద్ర మంత్రి అనురాగ్ఠాకూర్ నోటీసు పంపినా ఆయన పట్టించుకోలేదు. తాను నోరు విప్పితే సునామీ వస్తుందని బ్రిజ్‌భూషణ్ హెచ్చరించడం గమనార్హం.