రైలు ప్రయాణం అంటే ఒక జీవిత కాలం లేటు అని మహాకవి ఆరుద్ర వ్యంగ్యంగా రాసిన కాలానికి భిన్నంగా దేశంలో వాయు వేగంతో నడిచే రైళ్ళు వస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టా రు. ఇప్పుడు ఎంయుఎం సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్‌ని ప్రవేశపెట్టారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మేక్ ఇన్ ఇండియా కింద దీనిని నిర్మించారు. తెలుగురాష్ట్రాలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలుకు ప్రధాని మోడీ ఢిల్లిd నుంచి జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజానికి వందే భార త్ ఒక రైలు పేరైనా స్వాతంత్య్రోద్యమ కాలం నాటి వందే మాతరం నినాదం గుర్తుకొస్తుంది. ఆ స్ఫూర్తితోనే దేశాభి వృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలన్నది మోడీ ఆకాంక్ష. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు ఈఎంయూ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొం దించబడింది. ఈ రైలులో ప్రయాణం అంటే విమాన ప్రయాణం అనుభవం కలుగుతోందంటున్నారు ప్రయా ణికులు.
ఉత్తరాదిన మూడేళ్ల క్రితమే భారత రైల్వేలు ప్రవేశపెట్టిన ఈ రైలును సంక్రాంతిపండుగ నాడు సికింద్రాబాద్- విశాఖల మధ్య ప్రవేశ పెట్టారు. దీని నిర్మాణం 2018 నాటికి పూర్తి అయింది.అత్యంత వేగం గా నడిచే మూడు దశాబ్దాల కాలం నాటి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానే దీనిని ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించారు. ఇది 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సికిం ద్రాబాద్ నుంచి విశాఖకు ప్రవేశపెట్టిన వందే భారత్ అత్యంత వేగంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.ఈ రైలు స్టాపులు తక్కువ. అంతేకాకుండా ఈ రైలులో ప్రయాణం వల్ల చాలా సమయం మిగులుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉద్యగస్తులు, విద్యార్ధు లు, ఉపాధ్యాయులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంది. వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కి ప్రయాణ సమయం గంటన్నర కావడంతో ఎంతో మంది ఉద్యోగ స్తులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉందని చెబుతున్నా రు. ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల్లో విశాఖ నుం చి సికింద్రాబాద్‌కి చేరుకోవడం ఎంతో ఉత్తేజాన్ని కలిగి స్తోందని ఒక ప్రయాణికుడు చెప్పాడు. ఈ రైలులో సౌక ర్యవంతమైన, సుఖమైన ప్రయాణానికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికుల సౌకర్యాల కోసం ఇందులో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా, ప్రయాణికులు తమ వెంట తెచ్చుకునే సామగ్రిని దగ్గర ఉంచుకోవడా నికి సౌలభ్యంఉంది.
ప్రయాణికులకు వైఫై సేవలు. జీపీ ఎస్ సమాచార వ్యవస్థ కూడా ఇందులో లభిస్తాయి. సీసీ కెమెరాలు ఉంటాయి. దాని వల్ల ప్రయాణికులకు భద్రత విషయంలో సమస్య ఉండదు. 1,128 మంది కూర్చోవ డానికి సౌకర్యం ఉంటుంది. 24 అంగుళాల టెలివిజన్ సెట్‌లు ఉంటాయి. మూడు ఎసి కోచ్‌లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యంగా ఈ రైలును డిజైన్ చేయడం జరిగింది.ఈ రైలు ఢిల్లిd నుంచి వారణాసి. మాతా వైష్ణో దేవి ఆలయం (కాట్రా వందే భారత్), ముంబాయి సెంట్రల్ నుంచి గాంధీనగర్,ఎంజిఆర్ చెన్నై నుంచి మైసూర్, బిలాస్‌పూర్ జంక్షన్ నుంచి నాగపూర్ జంక్షన్, హౌరా, న్యూఢిల్లిd (న్యూజల్పాయి గురి) వందేభారత్ రైళ్ళను ఇప్పటికే నడుపుతున్నారు. వందేభారత్ రైలు భారతీయ విజ్ఞానానికి ప్రతీక.అలాగే, ప్రజలు కోరుకున్న రీతిలో దీని నమూనాను తయారు చేయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం మనది. మన రైలు బండ్లు బ్రిటిష్ వారి కాలం నాటి నమూనాల ప్రకారమే ఇంతవరకూ రూపుది ద్దుకుంటున్నాయి.
స్వాతంత్య్రానంతరం రైళ్ళలో,రైలు మార్గాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. మన దేశంలో బులెట్ రైళ్ళను ప్రవేశపెట్టేందుకు ప్రధానమంత్రి మోడీ యత్నాలు సాగిస్తున్నారు. అయితే,ఇప్పుడున్న రైళ్ళను సమర్ధవంతంగా నడపాలన్నది ప్రతిపక్షాల డిమాండ్. రైలు ప్రమాదాలు గతంలో పోలిస్తే ఈ మధ్య బాగా తగ్గా యి. అయితే, రైలు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా తీర్చి దిద్దేందుకు భారత రైల్వేలు నిరంతరం కృషి చేస్తున్నాయి. యూపీఏ హయాంలో రైల్వేలను లాభసాటిగా నడిపిస్తు న్నట్టు ఆనాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ తరచూ ప్రక టించేవారు. అయితే, ఆయన వైదొలగాక రైల్వేలకు నష్టా లొస్తున్నాయనే వార్తలు వచ్చాయి.ఈ తేడా ఎక్కడుందో తెలియదు. స్వాతంత్య్రం రాకముందు నుంచి రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్‌లు ఉండేవి.మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యేక బడ్జెట్ పద్దతిని తొలగించారు.ఏటా సాధారణ బడ్జెట్‌కి ముందు రైల్వే బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగేది. రైల్వేల ఆదాయాన్ని పెంచడానికి మోడీ ప్రభు త్వం ఎన్నో చర్యలు తీసుకుంది. దేశంలో చాలా ప్రాంతా ల్లో రైల్వేలకు చెందిన ఖాళీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు రాజకీయ నాయకుల మద్దతుతో కబ్జా చేసినట్టు ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌లో పలువురు పేర్కొన్నా రు. రైల్వేల ఆస్తులను కాపాడుకుని వాణిజ్య అవసరాలకు వాటిని వినియోగించుకుంటే కొత్తగా చార్జీలు పెంచన వసరం లేదన్నది సామాన్యుల అభిప్రాయం.