Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – పోరాట ప‌టిమ త‌గ్గ‌లేదు..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఏడాది పూర్తిఅయినా ఇంకా విరమించలేదేమని ప్రశ్నించుకుం టున్న జనం ఆకలిపై, అసమానతలపై అన్యాయాలపై ఎన్నాళ్ళు యుద్ధంసాగించాలో ఆలోచించడం లేదు, ప్రశ్నించుకోవడం లేదు. ఇలాంటి ప్రశ్నల వేస్తే పాలకుల కు ఆగ్రహం కలుగుతుంది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం గురించి ప్రశ్నలు వేసుకోవడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం ఉండదు.నిజానికి ఇది ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.యావత్‌ మానవాళిపై జరుగుతున్న యుద్ధం.మనిషిలో ఆధిప త్య ధోరణులు తొలగే వరకూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవ డం కోసం యుద్దాన్ని ప్రారంభించామని రష్యా అంటూండగా తమ ప్రాదేశిక సరిహద్దులను ర క్షించుకోవ డానికి యుద్ధం చేస్తున్నామనిమ ఉక్రెయిన్‌ చెబుతోంది. ఇందులో ఎవరి వాదన వారికి న్యాయంగా కనిపిస్తుంది. సామాన్యులకు ఇవేమీ అవసరం లేదు.సమస్యలు లేకుం డా తమ జీవితాలు సాఫీగా, సజావుగా జరగాలని వారు కోరుకుంటారు. అన్ని దేశాల్లో సామాన్యుల ఆలోచనలు, అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయి. జీవితం పరుగు పందెంలా తయారైనప్పుడు మనిషి తనకుటుంబ అవస రాలను సమకూర్చుకోవడం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇది కూడా ఒక యుద్ధమే.నిత్యావసర వస్తువు ల ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణ మని వినియోగ దారులంటూ ఉంటారు వినియోగదారులలో పొదుపు లేకపోవడం వల్ల,అవసరానికి మించి ఖర్చు చేయడం వల్ల,వృధా వల్ల ధరలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వా లు అంటూంటాయి.అదీ కరెక్టే,ఇదీ కరెక్టే.ఉక్రెయిన్‌ పై రష్యా దాడి వంటి విపరిణామాల వల్ల ధరలు పెరుగుతు న్నాయంటే అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిని నివారించలేమా? అంటే ఇందుకు రష్యాయే సమాధానం చెప్పాలి.మూడు దశాబ్దాల క్రితం కోల్పోయినతన భూభాగాలను తిరిగి దక్కించుకోవడం కోసం రష్యా ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభించడానికి పశ్చిమ దేశాల కవ్వింపు ధోరణులే కారణమని అంటోం ది. ఉక్రెయిన్‌ల స్వతంత్రతను దెబ్బతీయడానికి రష్యా ప్రయత్నిస్తున్నందు వల్లనే ఆ దేశానికి తాము సాయం అందిస్తున్నామని అమెరికా సహా పశ్చిమ దేశాలంటు న్నాయి. నిజానికి ఇది యుద్ధం వరకూ వెళ్ళాల్సిన సమస్యకాదు. సామరస్యంగా కూర్చుని చర్చించుకోవ ల్సిన సమస్య. ఈవిషయంలో అటు అమెరికా,ఇటు రష్యా మొండిగానూ, వితండంగానూ వాదిస్తున్నాయి. అప్పటికీ అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా,ఒక నాడు అగ్రరాజ్య ప్రాభవాన్ని అనుభవించిన రష్యా రెండూ కూడా సంఘర్షణ ధోరణులను విడనాడకపోవ డం వల్ల పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. వైరివర్గా లు సంఘర్షణకు దిగినప్పుడు వాటి మధ్య సామరస్యం కుదర్చాల్సిన సంస్థలు, లేదా వ్యక్తులు చేతగానితనంతో వ్యవహరిస్తున్నందువల్ల రావణ కాష్టంలా ఈ ఘర్షణలు కొనసాగుతూనేఉంటున్నాయి. ఐక్యరాజ్యసమితి తన ప్రాభవాన్నికోల్పోయింది. సమితి మాటేశిరోధార్యంగా పాటించే రోజులు పోయాయి. సమతిలో భద్రతా మండ లిలో వీటో హక్కును అమెరికా, చైనా, రష్యా తదితర దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్ని స్తున్నాయే తప్ప విశ్వశాంతి కోసం కృషి చేయడం లేదు.
ఆనాడు వియత్నాం యుద్ధం సమయంలోనూ, తర్వాత ఇరాన్‌, ఇరాక్‌ల మధ్య జరిగిన యుద్ధం సమయంలో నూ, అప్ఘనిస్తాన్‌ యుద్ధ సమయంలోనూ ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్రే వహించింది.ఇప్పుడు కూడా అదే పాత్రపోషిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి మొదలైన నాటి నుంచి తన వీటో హక్కును రష్యాకు అనుకూలంగా ఉప యోగిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు కొత్తగా రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారం భమై ఏడాది పూర్తి అయిన సందర్భంగా అమెరికా కొత్త గా ఆంక్షలు ప్రకటించింది.మరో వంక ఉక్రెయిన్‌ అధ్యక్షు డు జెలెన్‌స్కీ ఏడాది గడిచినా తమ పౌరుల్లో ఏమాత్రం చేవ తగ్గలేదనీ, మరింత సంకల్ప దీక్షతో పోరాటం సాగి స్తున్నారనీ, ఇదే దీక్షను కొనసాగిస్తారని ప్రసార మాధ్య మాల ద్వారా తెలియజేశారు. యుద్ధం ఆగలేదు. యుద్ధో న్మాదం ఆగలేదు.పోరాట పటిమ సన్నగిలలేదు.ల క్ష్యాల ను సాధించేవరకూ అవి కొనసాగుతూనే ఉంటాయి. ప్రపంచ దేశాలు ఆకలిపైనా, అన్యాయాలపైనా, అంటరా నితనంపై ఇదే స్ఫూర్తితో యుద్ధం (పోరాటం) సాగిస్తూ ఉంటే నవ సమాజం ఏనాడో ఆవిష్కృతమై ఉండేది. చైనా ఇప్పుడు శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇప్పటి వర కూ రష్యాకు ఆయుధ పరంగా బలగాల పరంగా సాయా న్ని అందించింది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయి న ఉక్రెయిన్‌ మాత్రం తమ పోరాట పటిమ ఇంకా తగ్గ లేదని చివరి వరకూ ఇదే తీరులో కొనసాగిస్తామని జలెనిస్కీ ప్రకటించారు. నిజానికి రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌ చాలా చిన్న దేశం. ఏడాది పాటు ఉక్రెయిన్‌ సైనికులు దేశభక్తితోనే పోరాటం సాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement