Saturday, November 23, 2024

Editorial – అమాన‌వీయ చ‌ర్య‌…

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి 18 మాసాలు కావస్తోంది. ఈ దాడుల్లో రష్యా, ఉక్రెయిన్‌లలో ఆస్తి నష్టాన్ని వెలకట్టలేం. అలాగే, ప్రాణనష్టాన్ని కూడా అంచనా వేయలేం. ఇరుదేశాల్లో వేలాది మంది మర ణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకు నేందుకు ఉక్రెయిన్‌కి ఎంత కాలం పట్టవచ్చన్న దానిపై భిన్న కథనాలు వినవస్తున్నా యి.ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలో ఉన్న కఖోవ్కా ఆనకట్ట పేల్చివేతతో వేలాది మంది నిర్వాసితు లయ్యారు. 2వేల ఇళ్లు జలమయమ య్యాయి. 10 వేల హెక్టార్ల పంట నీట మ ునిగింది. ఉక్రెయిన్‌ పరిథిలోని 100 గ్రామాలు తీవ్రంగా నష్ట పోయాయి. రష్యా ఆధీనంలోని ఖేర్సన్‌ సహా ఉక్రెయిన్‌ వ్యవసాయ రంగానికి నీటివనరులు లేనట్టే. డ్యామ్‌లో నీళ్లన్నీ వృధా అయ్యాయి. ఇంతవరకూ భవనాలు, కట్టడాలపై దాడులు జరుపుకుంటున్న ఈ రెండు దేశాల సైనికులు ఇప్పుడు ఆనకట్టల జోలికి వెళ్ళడం పరస్పర విధ్వంసానికి పాల్పడుతున్నాయనిపిస్తోంది.

ఈ ఆనకట్ట ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని పేల్చివేయ డం వల్ల రెండు దేశాలకూ నష్టమే. పైగా యూరప్‌లో అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం జాఫోరిజరి&ుయా కు నీటి సరఫరా ఆగిపోతుం దని ఆందోళన చెందుతున్నారు. ఈ విద్యుత్‌ కేంద్రం నుంచి యూరప్‌లోని పెక్కు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. అలాగే, ఈ డ్యాం పేల్చివేతతో ఖేర్సన్‌లో వేలాది ప్రజలు నీటి మధ్యలో జీవనం సాగిం చాల్సి వస్తోంది.ఈ డ్యాం పేేల్చి వేతకు కారణం మీరంటే మీరని రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం ఆరోపించుకుంటు న్నాయి. ఈ ఆనకట్ట పేల్చి వేతతో నీరు ఊళ్ళ మీద పడటం ప్రారంభమైంది. దాంతో వేలాది మంది నిరాశ్ర యులయ్యారు. వారిని సైనికాధికారులు సెకన్ల వ్యవధి లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, కొత్త ప్రదేశాల్లో తిండి లేక వారంతా అవస్థ లు పడుతున్నారు. ఈ ఆనకట్ట కూల్చివేత నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఎమర్జెన్సీని ప్రకటిం చింది.

తమ దేశానికి చెందిన వారు ఎంతోమంది గల్లంతు అయ్యారని రష్యా ప్రకటించింది. ఈ విపత్తునుంచి ప్రజలు తేరుకోవడం అంత సులువు కాదని ఐక్యరాజ్య సమితి మానవీయ విభాగం అధిపతి మార్టిన్‌ అభిప్రాయ పడ్డా రు. ఈ ఆనకట్టకూల్చివేత వల్ల రెండు దేశాలకూ నష్టమే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఎక్కువగా నష్టానికి గురైంది ఖేర్సన్‌. ఇప్పుడు ఈ నగరంలో చాలా ప్రాంతా లు జలమయం కావడంతో ఆత్మరక్షణ కోసం స్థానికులు ఇళ్ళ పైకప్పులపైకి ఎక్కారు. ఉక్రెయిన్‌ ప్రాంతీయ రక్షణ కేంద్రాన్ని కూడా రష్యన్‌ సైనికులు గత సంవత్సరం ఆక్రమించుకున్నారనీ, రష్యా దురాక్రమణ వల్ల ఖేర్సన్‌ ఎక్కు వగా నష్టపోయిందని స్థానికులు చెబుతున్నారు. 2014లో రష్యా ఆక్రమించు కున్న క్రిమియాకు ఈ ఆనకట్ట ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఆనకట్ట కూల్చివేతకు రష్యాదే బాధ్యత అని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ ప్రతినిధి వాదనలు వినిపించారు.

- Advertisement -

రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌ లోని చాలా ప్రాంతాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ విధ్వంస కాండ వల్ల ఉక్రెయిన్‌ లోని ఖేర్సన్‌ తదితర ప్రాంతాలు మరింత నష్టానికి గురి అవుతు న్నాయి. ఈ సోవియట్‌ యూనియన్‌ హయాంలో నిర్మించారు. డిన్పోర్‌ నదిపై నిర్మించిన ఆరు డ్యామ్‌లలో ఇది ఒకటి. ఖేర్సన్‌ ప్రాంతం లో రష్యా దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. ఈ డ్యామ్‌లో నీరు అమెరికాలోని సాల్ట్‌ లేక్‌ నీటి పరి మాణం తో సమానం. ఈ నదిలోకి పారిశ్రామిక వ్యర్ధాలను వదలడం వల్ల ఇప్పటికే కాలుష్యమైంది. రష్యా ఈ నదిలోకి 150 టన్నుల పారిశ్రామిక వ్యర్ధాలను విడుదల చేసింది. ఈ డ్యామ్‌ కూల్చివేత ఒక్క రోజులో జరిగింది కాదనీ, ఈ నది నుంచి నీటిని దిగువ భాగానికి విడుదల చేయడానికి పథకం ప్రకారం దీనిని కూల్చివేశారని స్థానికులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ని ఆర్థికంగా దెబ్బ తీయడం కోసం రష్యాయే పథకం ప్రకారం ఈ నదిపై ఉన్న డ్యామ్‌ని ధ్వంసం చేసిందన్న ఆరోపణలు వచ్చా యి.

ఈ డ్యామ్‌ కూల్చివేత ఉగ్రవాద చర్య అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలిన్‌స్కీ ఆరోపించారు. రష్యాపై ఇకనైనా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆయన ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటన సందర్భంగా మోడీని కలుసుకుని తమ దేశానికి భారత్‌ నుంచి సాయాన్ని అర్థించారు. ఈ ఇరువురు నాయకులూ కలుసుకోవడం ఇదే ప్రథమం. యుద్ధాన్ని విరమించాలని రష్యా, ఉక్రెయిన్‌లకు భారత్‌ యుద్ధం ప్రారంభమైననాటి నుంచి హితవు చెబుతోంది. అయితే, రష్యాతో చిరకాల మైత్రి కారణంగా ఆ దేశంపై ఆంక్షలను సమర్ధించకుండా తటస్థ వైఖరిని అనుసరిస్తోం ది. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడికి కారణాలు ఏమి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌ని అన్ని విధాల దెబ్బ తీయడానికి రష్యా సాగిస్తున్న దాడులను యావత్‌ ప్రపం చం ఖండించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement