మొన్నటిదాకా కాశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు ది కేరళ స్టోరీ. మొదటి సినిమా కిందటేడాది మార్చి 11న విడుదలైంది. అది సృష్టించిన ప్రకంపనలు అంతాఇంతా కావు. అదే సినిమాను మళ్లి జనవరి 19న విడుదల చేశారు. ఇప్పుడు అది ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అప్పట్లో ఆ వివాదం దేశ సమగ్రతనే ప్రశ్నించే పతాక స్ధాయికి చేరిం ది. అందులోని కథాంశం అలాంటిది. సమాజంలోని భిన్న వర్గాలు భావోద్వేగాలకు గురైన సందర్భమది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమా మీద వివాదాల రచ్చ ఎంతకాలం సాగుతుందోచూడాలి. సినిమాలకు, రాజకీయాలకు లింకులు కొత్తేమీ కాదు. అందుకే ఈ వివాదాలూ కొత్త కాదు. కాకపోతే ఇవి మతంతో ముడిపడిన వివాదాలు కావడమే విషాదం. చరిత్రను చరిత్రగా చూడాలి. సినిమాను సినిమాగా చూడాలి. ఇది ఏ రాజనీతి శాస్త్రంలోనూ కనిపించదు గాని ఇదొక అప్ర కటిత నైతిక ధర్మసూత్రం. కాని వాస్తవంగా జరుగు తున్నదేమిటి? దేశంలోని వ్యవస్ధలన్నీ కలగాపుల గమై పోయి స్వీయ బాధ్యతలు మరిచి ఇతర వ్యవస్ధల్లోకి దూ రి స్వీయ నిర్వచనాలు చెప్పే కుహనా సంస్కృతి మొద లైంది. ఉన్న వ్యవస్ధల్ని దేని పని దానిని చేయనిస్తే సజా వుగానే ఉంటుంది. అంతా న్యాయబద్దమే అవుతుంది. కాని అలా జరగనివ్వడం లేదు. వివిధ కలుషిత శక్తుల ప్రమేయాలతో వ్యవస్థðలు నిర్వీర్యమయ్యాయి. ఒక సినిమాలోని మంచి చెడులను సెన్సార్ బోర్డు నిర్ణయి స్తుంది. ఆ సినిమాలోని ఏ దృశ్యాలు, ఏయే సంభా షణలు దేశ ప్రజలకు చేరొచ్చు..చేరాలి..అన్నది అది చూడాలి. అందులో నిష్పాక్షికత ఉండాలి. దేశశ్రేయస్సే ప్రధానం కావాలి. ఆ బోర్డు సర్వసత్తాక సమగ్రతలకు సాక్షీభూతంగా ఉండాలి. నిర్ణీత ప్రమాణాల కొలమా నాల ప్రకారం సెన్సార్ బోర్డు చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాని సెన్సార్ బోర్డే సర్వజ్ఞాని అనుకోనక్కర్లేదు. నిర్దేశిత ప్రమాణాల పరిధిలో వ్యవహరించినా కొన్నిసా ర్లు అది లోపభూయిష్టంగా ఉండొచ్చు. అందులోనూ ఉండేది మానవమాత్రులే కాబట్టి అది చేసే నిర్ణయాలు అటోఇటో బెసిగే ప్రమాదం ఉందనుకుందాం. న్యాయ వ్యవస్థð ఉంది. అంతిమంగా అది చెప్పే తీర్పుకి అందరూ కట్టుబడి ఉండాలి.
చివరకు జరిగేది ఇదే గాని ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ నష్టం ఏ రూపం లోనైనా ఉండొచ్చు. సినిమా అనేది ఒక మాధ్యమం. వినో దం, విజ్ఞానం, కొండొకొచో సందేశం పంచే ఒక శక్తి మం తమైన మాధ్యమం. సామాజికాంశాలతో పాటు చరిత్ర ను ప్రతిబింబించే ఇతివృత్తాలతో సినిమాలు వస్తాయి. సామాజికాంశాల్లోనూ విభేదించే మలుపులు ఉంటా యి. అలాగే చరిత్ర కూడా. ఆదినుంచీ చరిత్ర తటస్థ ðభరితమై ఉండాలన్న నియమమేమీ లేదు. అలా ఉండ దు కూడా. కాని చరిత్రను వక్రీకరించడం గాని, చరిత్రలో ఒక పార్శ్వం లేదా కొన్ని పార్శ్వాల మీద వివక్ష చూపడం గాని చేయతగదు. ఇవి నిర్ణయించడానికి వ్యవస్థðలున్నా యి. వాటిపని వాటిని చేయనివ్వాలి. కాని దురదృష్ట వశాత్తు ఆ వ్యవస్ధలు వాటి పని అవి చేసే స్థితిలో లేవు. ఇదే అన్ని అనర్ధాలకు మూలం. ది కేరళ స్టోరీ సినిమా ఈనెల అయిదున విడుదలైంది. అంతకుముందు నుంచే వివా దం మొదలైంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లాం స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాలో చేరారన్నది ప్రధానాంశం.
ఒకవైపు రాజకీ య రగడ..మరోవైపు ధియేటర్లలో సినిమా..దేనికది బాగానే నడుస్తున్నాయి. బాక్సాఫీసు కలెక్షన్లు బాగున్నా యని నిర్వాహకులే చెబుతున్నారు. కాకుంటే కాశ్మీర్ ఫైల్స్ సృష్టించినంత వేవ్ లేకున్నా ఇతర తాజా హిందీ సినిమాలతో పోలిస్తే బాగా ఆడుతున్నదని వార్తలు వసు ్తన్నాయి. రానురాను రాజకీయ రగడ వేడెక్కింది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలం అయింది. ముందుగా నిరసన వ్యక్తం చేసింది కేరళ ముఖ్యమంత్రి పిన రయి విజయనే. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ నిషేధ బాణం వదిలారు. దేశవ్యా ప్తంగా నిషేధం విధించాలని ఆమె ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే కేరళ స్టోరీ సినిమా కూడా జాతీయ సమగ్రతకు ప్రమాదకరం అని ఆమె అనడంతో కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు ఆమెకు లీగల్ నోటీస్ పంపించారు. మున్ముందు ఇంకా ఇలాంటి వివాదాలు తీవ్రతరం అయినా ఆశ్చర్యం లేదు.
ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ సినిమాకు ప్రభుత్వాల ఆదరణ లభించింది. పన్నుల నుంచి మినహా యింపు ఇచ్చారు. బెంగాల్, కేరళ ప్రభుత్వాల నిరసనలకు, యుపి, ఎంపీ ప్రభుత్వాల ఆదరణకు మధ్య ఉత్తర దక్షిణ ధృవాలంతటి తేడా ఎందుకొచ్చిందో ప్రత్యే కంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను రాజకీయం తలకెత్తు కుంది. అందుకే దేశం భిన్నధృవాలై స్పందిస్తున్నది. అక్కడికీ నిర్మాతలు మొదట్లోనే వెల్లువెత్తిన నిరసనలకు తలొగ్గి టీజర్‌లో ఒకింత తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. కాని అదేమీ ప్రభావం చూపలేదు. కేరళలోని వాస్తవ పరిస్తితిని ప్రామా ణికంగా తీసుకుని సినిమా తీశామని నిర్మాత, దర్శకుడు చెబుతున్నారు. కర్నాటకలో అసెంబ్లి ఎన్నికల తరుణం లో ఈ సినిమా రావడం ఒక విచిత్రమైతే. అది వివా దం కావడం మరొక వైచిత్రి. ఎన్నికల్లో రాజకీయ పార్టీల, నేతల భవితవ్యాన్ని ఓటర్లు ఎలా నిర్దేశించి నిర్ణయించి, తీర్పు ఇస్తారో ఒక సినిమా విషయంలోనూ అదే ప్రజలు తీర్పిస్తారు. సినిమా అయినా మరే మాధ్యమం అయినా ప్రేక్షకుల అభిరుచుల ఆధారంగానే బతికి బట్టకడతాయి. ఈ మౌలిక ప్రామాణికతను మరిచి మరెవ్వరు వివాదాల మంటలు రేపినా అది తాత్కాలిక ప్రయోజనాలకు ఉపకరించ వచ్చేమో గాని సహజ న్యాయం మాత్రం కాబోదు! వీటన్నింటికీ మించి దేశ సమగ్రత, శాంతి భద్రతలు అత్యంత ప్రధానం!