Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – సాంకేతికంగా ద‌గ్గ‌ర‌వుతున్న తైవాన్

తయారీ రంగంలో తెలంగాణ ప్రేరణ తమకు స్ఫూర్తి అని తైవాన్‌కి చెందిన ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కి లేఖ రాయ డం గర్వకారణం. తెలంగాణ ఆవిర్భావం నాటినుంచి వ్యవసాయికంగా,పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేందుకు కేసీఆర్‌ చేస్తున్న కృషిని ఇప్పటికే చాలా మంది ప్రశంసించారు. తైవాన్‌ సూపర్‌ కండ క్టర్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న తైవాన్‌ ఇప్పుడు మన దేశం వైపు చూస్తోంది.తైవాన్‌ చైనాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపం.నిత్యం చైనా నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న తైవాన్‌ ఈనాడు సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచంలోని అన్ని దేశాలకూ ప్రేరణగా ఉంది.అటువంటి తైవాన్‌కి చెందిన ఫాక్స్‌కాన్‌ తెలుగు రాష్ట్రం తెలంగాణను పొగడటం నిస్సందేహంగా విశేషం. సెమీకండక్టర్ల తయారీలోనే కాకుండా తైవాన్‌ ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోంది. తైవాన్‌ అభివృద్ధిని చూసి చైనా గింజుకుంటోంది. లోలోన గుర్రుమంటోంది. తైవాన్‌ని తమ దేశంలో కలుపుకునేం దుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తోంది.తమ దేశంలో అంత ర్భాగమని వాదిస్తోంది. కానీ, తాము స్వతంత్ర దేశంగానే ఉంటామని తైవానీయులు స్పష్టం చేస్తున్నారు.ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌ లియూ ఢిల్లిdలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలుసుకున్నారు.భారత్‌లో పెట్టుబడులకు అవకాశాలను మెరుగు పర్చినందుకు ప్రధానిని ఆయన అభినందించారు. తైవాన్‌తో భారత్‌ సంబంధాలు ప్రస్తు తం బాగానే ఉన్నాయి. అన్నింటికీ చైనా అడ్డు పుల్ల వేయడం వల్ల కొంత మందగించిన మాట నిజమే. తైవాన్‌ జనాభా 20 మిలియన్లు .అయినప్పటికీ వారు ఎంతో దృఢ దీక్షతో తమ సంపదను పెంచుకుంటున్నారు. తైవాన్‌లో ఇనుము, తగరం, వంటి అమూల్యమైన ఖనిజాలు ఉన్నా యి. వాటిని ఉపయోగించుకుని పారిశ్రామిక,సాంకేతిక రంగాల్లో అభివృద్దిని సాధించడంలో తైవాన్‌ ఇప్పటికే ముందడుగు వేసింది. ఈ రంగాల్లో తమ దేశాన్ని తైవాన్‌ దాటుకుని పోతోందన్న దుగ్ధతోనే తైవాన్‌ని చైనా అడ్డుకుం టోంది. చైనా ఎన్ని ఎత్తులు వేస్తున్నా,తైవానీయుల దేశ భక్తి, జాతీయ భావం ముందు అవి ఓడిపోతున్నాయి. ఉక్రె యిన్‌పై రష్యా దాడి జరపడానికి ముందే ఉక్రెయిన్‌కి సాంకే తిక పరంగా తైవాన్‌ ఎంతో సాయపడింది.అది కూడా తైవాన్‌పై చైనా కంటగింపునకు కారణం .గత సంవత్సరం ఉక్రెయిన్‌కి తైవాన్‌ మందులు, నిత్యావసర వస్తువులను పంపింది.

రష్యాపై ఆంక్షల విధింపులో పాశ్చాత్య దేశాలతో చేతులు కలిపింది. ఇది కూడా చైనాకు కడుపు మంట అయింది. తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర రంగాల్లో అగ్రస్థానంలోఉంది.మెషనరీ టూల్స్‌, ఇతర ఉత్పత్తులను తైవాన్‌ ఎగుమతి చేస్తోంది .తౖౖెవాన్‌తో మన వాణిజ్యం 2006లో రెండు బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది.2020 నాటికి అది5.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అంటే 14 సంవత్సరాల్లో 157శాతం పెరిగింది. 5-జి.కృత్రిమ మేథ, తదితర రంగాల్లో భారత్‌తో సాంకేతి క పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు తైవాన్‌ సంసిద్దంగా ఉందని భారత్‌లో తైవాన్‌ ప్రతినిధి తెలిపారు. మన దేశాని కి అవసరమైన సాంకేతిక తోడ్పాటును అందించడానికి తైవాన్‌ నిరంతరం సిద్ధంగాఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తైవాన్‌ ద్వీప దేశమైనా పెద్ద దేశాలను ఢీకొటేందు కు సిద్దమవుతోంది. తైవాన్‌ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేసింది. వియత్నాం, ఇండోనేషి యా, తదితర దేశాల మాదిరిగానే తైవాన్‌ని చైనా తరచూ బెదిరింపులకు గురి చేస్తోంది.అయినా తైవాన్‌ప్రజలు స్వయంకృషితో వృద్ధిని సాధిస్తున్నారు. తైవాన్‌లో సెమీ కండక్టర్‌పరిశ్రమ 1980లో ప్రారంభమైంది. అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహంతో సాంకేతిక పరిశోధన,అభివృద్ధి సంస్థ ఈ పరిశ్రమకు అండగా నిలిచింది.ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోంది.దీని ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి బాగా పెరిగింది. ప్రజల్లో సాంకేతిక విద్య పట్ల ఆసక్తి పెరిగింది. తైవాన్‌లో అతి ప్రాచీనమైన సెమీకండక్టర్‌ తయారీ సంస్థ యునైటెడ్‌ మైక్రో ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ తయారు చేసే సెమీకండక్టర్లు అమెరికా, జపాన్‌ తదితర దేశాలకు ఎగుమ తి అవుతున్నాయి.

ఈ సంస్థ శాఖలు అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా,సింగపూర్‌ తదితర దేశాల్లో ఏర్పాటు అయ్యాయి.తైవాన్‌లోని పరిశ్రమల్లో ఫాక్స్‌ కాన్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అతి పెద్ద సంస్థగా పేరొందిం ది. స్మార్ట్‌ ఫోన్లు, వీడియోగేమ్‌ పరికరాల ఉత్పత్తిలోఈ సంస్థ పేరొందింది. ఇప్పుడు ఇదే సంస్థ మన దేశంలో ముఖ్యంగా తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ముదావహం. ఈ సంస్థ పెట్టుబడుల తో తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సాంకేతికంగా సెమీకండక్టర్లు తదితర పరికరాలు దిగుమ తి చేసుకునే అవసరం తప్పుతుంది. ఇప్పటికే మన దేశం సాఫ్ట్‌వేర్‌ రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ రం గంలో ఉద్యోగావకాశాలు పెరగవచ్చు. భవిష్యత్‌లో సెమీ కండక్టర్లను మన దేశం కూడా ఎగుమతి చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement