Tuesday, November 26, 2024

ఎడిటోరియ‌ల్ – ఆధిప‌త్య పోరుతో అశాంతి…

ఆఫ్రికాలో సహజ వనరులకు ప్రసిద్ధమైన సూడాన్‌ లో మూడు దశాబ్దాల పాటు పాలన సాగించిన మాజీ మిలటరీ అధికారి ఒమర్‌ అల్‌ బషీర్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత కారణంగా నాల్గేళ్ళ క్రితం సరిగ్గా ఇదే నెలలో అధికారాన్ని కోల్పోయారు.ఆయన గద్దె దిగిన రెండు సంవత్సరాలకే సైనికులు ఆధిపత్యాన్ని చేజిక్కించుకు న్నారు. ఆర్మీ జనరల్‌కీ, పారామిలటరీ జనరల్‌కీ మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు ప్రస్తుతం సూ డాన్‌లో ఘర్షణలకు కారణం.ఈ ఘర్షణల్లో వందల కొద్దీ జనం ప్రాణాలు విడుస్తున్నారు.వీరిలో పౌరులు ఎక్కువ మంది ఉన్నారు. 1800 మందిపైగా గాయ పడ్డారు.ఫిరంగులు,కాల్పుల మోతలతో దేశంలోని ప్రధాన నగరాలు,పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. సూ డాన్‌లో 33 మంది కర్నాటక వాసులతో సహా పలు వురు భారతీయులు చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది.

ప్రభుత్వ అభ్యర్థన మేరకు 24 గంటల కాల్పుల విరమణను అక్కడి వర్గాలు ప్రకటించాయి. ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యం పోరాటానికి వేలాది మంది గాయప డుతున్నారు. దశంలో సహజవనరులు అపారంగా ఉన్నా,ప్రజలకు నిత్యావసరాలను అందిం చడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.అసలు దేశంలో ప్రభు త్వం అనేది లేదన్నది దేశ రాజధాని ఖర్టూమ్‌ లోనూ, ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నా యి..ఈ ఘర్షణల్లో ఒక భారతీయుడు కూడా మరణించాడు.అతడు కేరళకి చెందిన అహ్మద్‌గా పేర్కొ న్నారు అక్కడ రాపిడ్‌ సపోర్టు ఫోర్స్‌ (ఆర్‌ ఎస్‌ఎఫ్‌ ) చాలా శక్తివంతమైంది.ఆర్మీతో ఘర్షణ పడుతున్నది ఈ దళాలే.ఈ ఫోర్సుకు లెఫ్టినెంట్‌ జనరల్‌ హమ్‌దాన్‌ దగాలోనేతృత్వం వహిస్తున్నాడు.

అతడికి రష్యాలోని వాగ్నర్‌ ప్రైవేటు మిలటరీతో సంబంధాలున్నాయి. సౌదీఅరేబియాతో కూడా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్ష భవనాన్ని తన అధీనంలోకి తీసుకుని అతడు జనరల్‌ బుర్హాన్‌ని తిరిగి అధికారంలోకి తీసుకుని వచ్చేం దుకు ప్రతిన చేశాడు. అయితే, సైనికులు ఈ ప్రక టనలను తోసిపుచ్చింది.ఆర్‌ఎస్‌ఎఫ్‌ స్థావరాలపై వైమా నిక దాడులు జరపనున్నట్టు ప్రకటించింది.ఈ దాడుల్లో ఖర్తూన్‌లోనూ, వివిధ నగరాల్లోనూ ఆస్పత్రులు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని మరో చోటుకి తరలించే ఏర్పాటు చేశారు. సూడాన్‌లో ఈ మాదిరి ఘర్షణలు ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతు న్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనడంతో సూడాన్‌లో పరిస్థితి గందరగోళంగా తయారైంది. స్వదేశాలకు వెళ్ళేందుకు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

రెండేళ్ళ క్రితం పౌర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఈ ఇద్దరు జనరల్స్‌ చేతులు కలిపారు.ప్రజాస్వామ్య పాల న పునరుద్ధరణ జరిగేందుకు వీలుగా చర్యలు తీసుకుంటా మంటూ ప్రగల్భాలు పలికారు,అయితే, వీరి ప్రకటనలు అమలు జరగకపోగా, దేశంలో అంతర్యుద్ధానికి దారి తీశాయి. అబ్దుల్‌ ఫతే బుర్హాన్‌, పారాదళాల అధిపతి హందన్‌ డగ్లోల మధ్య ఆధిపత్య పోరాటమే ఈ ఘర్ష ణలకు కారణం వదిలేసి ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి వీరు ప్రయత్నించారు. సూడాన్‌లో ఘర్షణలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయనీ, పౌరుల ప్రాణ,ఆస్తి నష్టాలకు కారణం అవుతున్నాయని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది.ఘర్షణలను విరమించమని సమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ చేసిన విజ్ఞప్తిని ఇరువర్గాలూ పట్టిం చుకోకపోవడంవల్లనే పరిస్థితి విష మించింది.

- Advertisement -

సూడాన్‌లో ఘర్షణలకు బాహ్య శక్తుల జోక్యం ఉంది.డగ్లో నేతృత్వాన్ని రష్యా సమర్థస్తుం డగా,ఆవలి వర్గాన్ని రష్యా వ్యతిరే కులు సమర్థి స్తున్నారు.దేశంలో ఉన్న సహజ సంపదపై కన్నుపడటం వల్లనే బాహ్యశక్తులు సూడాన్‌లో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతు న్నాయి. అంతేకాక, సూడాన్‌లో అనేక విదేశీ సంస్థలు పెట్టు బడులు పెట్టి వాణిజ్య, పారి శ్రామిక రంగాల్లో రాణిస్తున్నాయి. ప్రజల్లో దేశభక్తి,జాతీయ భావం ఉన్నప్పటికీ, బాహ్య శక్తుల ప్రమేయం వల్ల చిన్న చిన్న విషయాలకే ఘర్షణలు జరుగుతున్నాయి. సూడా న్‌లో సంపదపైన బాహ్య శక్తుల కన్నుపడటం వల్లనే ఘర్షణలను అవి ప్రేరేపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, రష్యాలు తమ సహజ ధోరణిలో చెరో వర్గాన్నీ సమర్థిస్తూ దేశంలో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. దేశంలో లభించే ప్రకృతి సహజసిద్ధమైన సంపదను దోచుకుని పోవాలన్న ధ్యాస తప్ప ప్రజల గోడు పట్టిం చుకోవడం లేదు. ఈ ఘర్షణల వల్ల సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టమై మరుభూములుగా తయారయ్యాయి. రాజకీయ అస్థిరత, పేదరికం, అంత ర్యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోసూడాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలు ఆందోళన చెందు తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement