గణతంత్ర దినోత్సవాన్ని దేశరాజధాని ఢిల్లిలోనూ, అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ ఘనంగా జరుపుకుని భారత్ సర్వసత్తాక ప్రతిపత్తిని చాటుకున్నాం. రాజ్యాంగా న్ని ఆమోదించిన రోజుగా గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది. ఎవరి సాయం అవసరం లేకుండా మనకు మనం రక్షించుకోగలమనీ, పాలించుకోగలమని రుజువు చేసేందుకే గణతంత్ర దినోత్సవాన్ని ఏడాదికో సారి జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు ఆయుధ ప్రదర్శన జరపడం ఒక ప్రత్యేకత. ఢిల్లిలో రాజ్‌పథ్‌లో ఏటా సైనికుల కవాతుతో పాటు ఆయుధాల ప్రదర్శన, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేకతలను తెలిపే ప్రదర్శికల శకటాల ర్యాలీ జరిగేది. తొలిసారి ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యే అరుదైన అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పిం చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చారిత్రాత్మకమైన ఎర్రకోటపై జాతీయ పతాకం ఆవిష్కర ణ జరిగిన మహోజ్వల ఘట్టం ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఆవిష్కృతమైంది. వార్తా ప్రసార సాధనాల్లో ప్రత్య క్ష ప్రసారాల ద్వారా ఈ మహత్తర దృశ్యాన్ని దేశంలో యావన్మంది ప్రజలే కాకుండా, ప్రపంచం నలుమూల లా ప్రవాసులుగా నివసిస్తున్న భారతీయులు తిలకించి మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని పొందారు. మాతృ దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న త్రివర్ణ పతాకం రెపరెపల ను ప్రసార మాధ్యమాల్లో తిలకించి ఆనందంతో ఉప్పొం గిపోయారు.
అన్ని దేశాలకూ జాతీయ జెండా ఉంటుం ది. కానీ మన జాతీయ జెండా ప్రత్యేకత దేనికీ రాదు. జాతి పిత మహాత్మాగాంధీ ఆకాంక్షించిన శాంతి, సత్యాహింస లకు చిహ్నంగా మన తెలుగువాడైన పింగళి వెంకయ్య తీర్చిదిద్దిన మువ్వెన్నల పతాకమే యావత్ దేశంలో రెపరెపలాడినందుకు తెలుగువారంతా గర్విస్తున్నారు. జాతీయ జెండాలో ధర్మచక్రం భారత దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిన అశోకుని పాలనను నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. బ్రిటిష్‌వారి కాలం నుంచి రాజ్‌పథ్‌గా కొనసాగుతున్న ప్రాంతానికి ప్రధానమంత్రి కర్తవ్యపథ్‌గా నామకరణం చేయడం ఎంతో సముచితం గా ఉంది. అంటే అది కర్తవ్యాన్ని ప్రబోధిస్తోందన్న మాట. మన దేశానికి కావల్సిన కర్తవ్యాన్ని అది ప్రబోధి స్తోంది. ఈ కర్తవ్యపథ్‌లో గణతంత్ర దినోత్సవ వైభవా న్ని గుర్తు చేసే యుద్ధ ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు, బ్రహ్మోస్ రెజిమెంట్, క్విక్ రియాక్షన్ పోరాట వాహనా లు, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొదలైన ఆత్మనిర్భర శకటాలు సగర్వంగా సాగాయి. వీటిలో చాలా మటుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద స్వదేశంలో తయా రైనవే. ఏటా గణతంత్ర పరేడ్‌కి విదేశీ అధినేతను ముఖ్య అతిధిగా ఆహ్వానించడం ఆనవాయితీ. ఈసారి ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాఅల్ సిసి ముఖ్యఅతిధిగా హాజర య్యారు. ఆయనతో పాటు ఈజిప్టుకు చెందిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం ఈ కవాతులో పాల్గొన డం ఈ ఏడాది ప్రత్యేకత.
అంతేకాక, ఈ పరేడ్ ఎన్నో విధాల ప్రత్యేకతను సంతరించుకుంది. ఒక దేశ సర్వసత్తాక ప్రతిపత్తికి నిదర్శనం ఆదేశం కలిగి ఉన్న ఆయుధ సంపత్తి. మన దేశం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలపైనే ఎక్కువ ఆధారపడుతూ వస్తోంది. ఇప్పుడు ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద తయారవుతు న్న ట్యాంకులు, క్షిపణులు భారత ఆయుధ పరిజ్ఞాన, ప్రజ్ఞాపాటవాలను తెలియజేస్తున్నాయి. విదేశీ ప్రముఖు లను గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి ఆహ్వానించడం పరి పాటే. అయితే గడిచిన రెండేళ్ళనుంచి కరోనా కారణంగా విదేశీ నేతలను ఆహ్వానించలేదు. అమెరికా మాజీ అధ్యక్షు డు బరాక్ ఒబామా, దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుక ర్నో వంటి ప్రముఖులు హాజరయ్యారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన సుకర్నో, తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి అలీన ఉద్యమాన్ని స్థాపించారు. అగ్రరాజ్యాల మధ్య హోరా హోరీగా ప్రచ్ఛన్నయుద్ధం సాగిన వేళ అలీన ఉద్యమం భారత దేశ శాంతికాముకత్వాన్ని ప్రపంచానికి చాటింది.
ఈ ఉద్యమ సారథిగా మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ద్వారా అమూ ల్యమైన, అపూర్వమైన ప్రశంసలు అందుకున్నారు. దేశ సర్వసత్తాక ప్రతిపత్తిని చాటిన బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా ఆమె ధీరవనితగా పేరొందింది. 1974లో పోఖ్రా న్‌లో అణు పరీక్షలకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీకా రం చుట్టగా, ఆ తర్వాత 1998లో నాటి ప్రధాని వాజ్‌పే యి రెండోసారి అణు పరీక్షలు నిర్వహించారు. ఆ విధం గా ప్రపంచ దేశాల్లో అణ్వస్త్ర దేశంగా భారత్‌కి కీర్తి లభిం చింది. ఆయుధాలు కలిగి ఉన్నా, స్వీయ భద్రతకోసమే తప్ప ఇతరులపై ప్రయోగించడానికి కాదని మన దేశం సందర్భం వచ్చినప్పుడల్లా స్పష్టం చేస్తోంది. అణ్వస్త్రాల కన్నా అన్నవస్త్రాలే ప్రధానమన్న మౌలిక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మన దేశం సర్వసత్తాక ప్రతిపత్తిని కాపాడు కోవడానికే ఆయుధ సంపత్తిని కలిగి ఉంది.