Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – రాహులే కాంగ్రెస్ ప్ర‌చార సారథి…

చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) ప్లీనరీ సమావేశాలు పార్టీ అగ్రనాయకులకు అనుకూల మైన రీతిలోనే సాగాయి.రాహుల్‌గాంధీ జరిపిన భారత జోడో యాత్ర ప్రభావం ఈ సమావేశాల్లో కనిపించింది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ ఈ యాత్రతో తన ఇన్నింగ్స్‌ ముగిసినట్టేనని ప్రకటించారు. అంటే, రాహుల్‌ నాయక త్వాన్ని దేశ వ్యాప్తంగా అందరూ ఏకీభవిస్తున్నారనీ, ఆయనకు ఇక అవరోధాలుండవన్నది ఆమె ఉద్దేశ్యం కావచ్చు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తలు పార్టీ నాయకులను, శ్రేణులను గందరగోళంలో పడవేశాయి. సోనియాగాంధీ శాశ్వతంగా రిటైర్‌అవుతున్నట్టు వచ్చిన వార్తలపై పార్టీ అధికార ప్రతినిధి అల్కా లంబా వివరణ ఇస్తూ సోనియా శాశ్వతంగా రిటైర్‌ కావడం లేదనీ,ఆమె ఆశీస్సులూ, మార్గదర్శకత్వమూ పార్టీకి ఎప్పుడూ ఉం టాయని వివరణ ఇచ్చారు. సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం, తరచూ చెకప్‌ల కోసం ఆస్పత్రిలో చేరడం.., ఇవన్నీ గమనించినవారికి ఆమె రిటైర్‌ అవుతున్నారేమోననిపించింది. రాహుల్‌ నాయక త్వాన్ని ఈ సమావేశాల్లో ఎవరూ ప్రశంసించకపోయి నా, వ్యతిరేకించలేదు. ఆ విషయాన్నే సోనియా ప్రస్తా వించారు. జోడో యాత్ర మరో పర్యాయం జరగవచ్చనీ, ఈసారి తూర్పు నుంచి ప శ్చిమం వైపు సాగుతుందని పార్టీ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాసీఘాట్‌ నుంచి గుజరాత్‌లో ని పోర్‌బందర్‌ వరకూ ఈసారి జోడో యాత్ర సాగవచ్చ ని ఆయన చెప్పారు. ఈ రెండుప్రదేశాలు కూడా ముఖ్య మైనవి. అరుణాచల్‌పై చైనా తరచూ వివాదాన్ని లేవనెత్త డం, కాంగ్రెస్‌పై బీజేపీ వర్గాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో అరుణాచల్‌లో ఈ యాత్ర ప్రారంభించడం వ్యూహాత్మకమే కావచ్చు. పోర్‌బందర్‌తో యాత్ర పూర్తి అయితే, ప్రధానిపై రాహుల్‌ విమర్శలు మరింత వాడిగా, వేడిగా చేసేందుకు అవకాశం ఉంటుంది. సోని యా లేక పోతే కాంగ్రెస్‌ లేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజకీయా లపై కనీస పరిజ్ఞానం ఉన్న వారు ఎవరైనా చెప్పగలరు. ఆనాడు ఎఐసిసి అధ్యక్షుడు దేవకాంత్‌ బారువా ఇందిర యే ఇండియా, ఇండియాయే ఇందిర అని అభివర్ణించిన ట్టు సోనియాగాంధీ క్రియా శీలంగా వ్యవహరించక పోయినా కాంగ్రెస్‌కు ఆమె నాయకురాలన్న సంగతి అందరికీ తెలుసు. జోడో యాత్ర వల్ల రాహుల్‌ పార్టీలో కొన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో అన్ని వర్గాలూ ఆయన ప ట్ల సుముఖంగా ఉన్న ట్టు కనిపించడం లేదు. రాహుల్‌ ఇప్పటికీ కొందరు నాయ కులనే వెంటబెట్టుకుని తిరుగుతున్నారనీ, ఆయనను కలుసుకోవడానికి అవకాశం లభించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.అయితే, జోడో యాత్ర జోష్‌ కారణంగా ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు తగ్గినప్పటికీ పూర్తిగా తొలగి పోలేదు. ఏఐసిసి ప్లీనరీలో సీనియర్లు నోరు మెదపకపోయినా, గతంలో మాదిరి విమర్శలు చేయలేదు.పార్టీ జాతీయాధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే పూర్తిగా గాంధీ కుటుంబం పట్ల విధేయునిగానే పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.వయోభారం కారణంగా అందరినీ ఆయన ఉత్సాహ పర్చలేకపోతు న్నారు. భావసారూప్యం గల పార్టీలతో పొత్తుకు ఏఐసిసి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.యూపీఏ ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి పథకాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన వైనాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరాన్ని ప్లీనరీ గుర్తు చేసింది. అంతే కాకుండా నెహ్రూ ప్రవేశపెట్టిన పథకాలు,నెలకొల్పిన రాజ్యాంగ సంస్థలను ప్రస్తుత ప్రభుత్వం బలహీనపర్చే యత్నాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమ్వికుండా, ఎదురు దాడి చేసిన తీరును ఏఐసిసి గర్హించింది.అదానీ వ్యవహారంపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ నాయకులు దేశమంతటా పర్యటనలు జరపాల ని పిలుపు ఇచ్చింది. వర్కింగ్‌ కమిటీకి ఎన్నికలు ఉండవ ని స్పష్టం చేయడం ద్వారా పార్టీలో వివిధ వర్గాల మధ్య ఘర్షణాత్మక ధోరణులు తలెత్తకుండా జాగ్రత్త పడింది. సంకీర్ణయత్నాలు లేకుంటే రాహులే ప్రచార సారథి అని స్పష్టం చేయడం ద్వారా ఆయన నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్తుందని ఏఐసిసి స్పష్టం చేసింది. రాయపూ ర్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో నాయకుల ప్రసంగాలు పెద్దగా ఆకర్షించలేకపోయినప్పటికీ, రాహుల్‌ గాంధీ జోడో యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. అయితే ఎన్నికల వరకు కార్యకర్తల ఉత్సాహాన్ని పరిరక్షిం చుకోవల్సిన బాధ్యత నాయకులపై ఉంది. నాయకులు పరస్పరం కీచులాడుకోకుండా ఐక్యంగా పనిచేస్తే కాంగ్రెస్‌కు తిరిగి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement