పెట్రోల్,డీజిల్ ధరలను రాష్ట్రాలు అంగీకరిస్తే, వసు ,సేవా పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెచ్చేందుకు తె చ్చేందు కు కేంద్రం సిద్ధమేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి ఈ విషయమై ఎంతోకాలంగా కొనసాగుతున్న సందిగ్ధత కు తెరదించారు. నిత్యావసర వస్తువుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తేవాలని చాలా కాలంగా కోరుతున్నా కేంద్రం స్పం దించడం లేదని రాష్ట్రాలుఅంటున్నాయి. కేంద్రం మీద రాష్ట్రాలూ, రాష్ట్రాల మీద కేంద్రమూ నెపాన్ని నెట్టుకుంటూ పెట్రోలి యం ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు పెంచ ుకుంటూ పోతున్నాయి. చమురు ఉత్పత్తి దేశాల్లో ముడిచమురు ధర బాగా పడిపోయినా మన దేశంలో ఈ రెండింటి ధరలు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సవాలుగా మారుతున్నాయి.పెట్రోల్,డీజిల్‌లపై కేంద్రం విధిస్తున్న సుంకాన్ని తగ్గిస్తున్నప్పటికీ రాష్ట్రాలు వ్యాట్,తదితర స్థానిక పన్నులను విధించి వినియోగదారునల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. నిజానికి ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు ధర బాగా పెరగవచ్చ నుకు న్నారు.కానీ,రష్యా మన దేశంతో చిరకాల బంధాన్ని పురస్కరించుకుని వీలైనంత ఎక్కువగా ముడి చము రును తక్కువ ధరకు సరఫరా చేయడానికి సంసిద్ధత ప్రకటించగా,కేంద్రం గరిష్టప్రమాణంలో ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.అయినప్పటికీ,చమురు కంపెనీ లు నష్టా లకు గురి అవుతున్నాయంటూ ఎప్పటికప్పుడు చమురు,డీజిల్ ధరలను పెంచడంఎంత వరకు సబబు అని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి.
చమురు రాజకీయం ప్రజలకు విసుగు తెప్పిస్తున్నది.కేంద్రమూ,రాష్ట్రాలూ కలిసి ఆడుతున్న నాటకంగా ప్రజలు అనుకుంటున్నారు. దేశంలో పెట్రోల్,డీజిల్ వినియోగం గతంలోకన్నా ఎక్కువ పెరిగింది.వాహనాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది.నగరాలు,మహానగరాల్లో వాహనాల రద్దీతో పాటు కాలుష్యాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాలు ష్యం వల్ల శ్వాస కోస వ్యాధులకు గురి అవుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలను పురస్కరించుకుని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)ను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.2025నాటికల్లా భారత్‌లో పూర్తిగా ఈవీలనే విక్రయిస్తామని ప్రముఖ కా ర్ల ఉత్పత్తి సంస్థ వోల్వో ప్రకటించింది.ఎలక్ట్రిక్ స్కూ టర్లు,కార్లు, ఇతర వాహనాలు ఇప్పటికే అందు బాటులోకి వచ్చాయి.ఇవి పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయ గలవని సంబర పడుతున్న తరుణంలోనే ఇవి తరచుగా ప్రమా దాలకు గురి అవుతున్నట్టు వస్తున్న వార్తలు ఆం దోళన కలిగిస్తున్నాయి.అయితే, పెట్రోలియం ఉత్పత్తు లపై నడిచే వాహనాలైనా, ఇతర ఇంధనాలపై నడిచే వాహ నాలై నా పరిమితికి మించి వినియోగిస్తే ప్రమాదమేనని జరుగు తున్నఘటనలు రుజువు చేస్తున్నాయి. వాహనాల సంఖ్య పెరిగిపోవడం ఆధునిక నాగరికతకు చిహ్నంగా పరిణిస్తు న్నారు.కానీ,ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని సర్వేలు తెలియ జేస్తు న్నాయి. వాహనాల లైసెన్సుల మంజూరులో అవినీతి, ఆశ్రీత పక్షపాతం చోటు చేసుకోవడం వల్ల వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. రోడ్లపై నడిచే వాహ నాల్లో కాలం చెల్లిన వాహనాల సంఖ్య కూడా పెరిగి పోతోంది. పెట్రోల్,డీజిల్ వాడకం గరిష్టంగా పెరగడానికి కాలంచెల్లిన వాహనాల వినియోగం కూడా ఒక కార ణంగా పేర్కొనవచ్చు.ఇలాంటి వాహనాల వల్లనే ప్రమా దాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్‌పై సుంకాన్ని మరోసారి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటిం చింది. ఎన్నికల సంవత్సరం కారణంగా ప్రజాభిమానాన్ని పొం ద డానికి కేంద్రమూ, రాష్ట్రాలూ పోటాపోటీగా పన్నులు, సుంకాలు,సెస్‌లు తగ్గిస్తే ప్రజలకు మేలు చేసి నట్టే. ఆరు రా ష్ట్రాలలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ ప్రక టన చేసినట్టుగాకనిపిస్తోంది.ఈ క్రమంలో పెట్రొ ల్,డీజిల్ ధరలు తగ్గకపోతే ఆ బాధ్యత రాష్ట్రాలదేనని ప్రజలు ఆరోపించే పరిస్థితి సంభవించినా ఆశ్చర్యం లేదు. కనుక, ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు రా ష్ట్రాలు అంగీకరించడమే ఉత్తమ మార్గం.అయితే, జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం రాష్ట్రాలకు సక్ర మంగా పంపిణీ చేయడం లేదన్న ఆరోపణలు ఇప్ప టికే వస్తున్నాయి. వీటిని సరిచేసుకోవల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.