వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికలకు రిహార్సల్స్‌గా పరిగణించబడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధవంతంగా నిర్వహించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నిక ల సంఘం ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగలదని మరోసారి నిరూపించింది.ఎన్నికల పోలింగ్‌కి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఖమ్మం, చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లలో మాత్రం మావోయి స్టులు తమ ఉనికిని చాటుకోవడానికి మందుపాతరలను పేల్చడంతో సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారు. చెదురు మదురు సంఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతం గా పోలింగ్ జరిగింది. పోలింగ్ బహిష్కరణకు మావో యిస్టులు పిలుపు ఇచ్చినా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా,నిర్భీతిగా విని యోగించుకున్నారు. వారిలో ఆ రకమైన ధైర్యాన్ని ప్రోది చేయడంలో ఎన్నికల సంఘం జరిపిన కృషి సఫలీకృత మైంది. ఎన్నికల సంఘంపై కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిడు లు వచ్చినా, ఎన్నికల నిర్వహణలో పెద్దగా ఆరోపణలు రాలేదు. చత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లోనూ, మిగిలిన చోట్ల ఒక దశలోనూ పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గతంలో మాదిరి మైళ్ళ దూరంవెళ్ళాల్సిన అవసరం లేకుండా వారి ఆవా స ప్రాంతాలకు దగ్గరలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం.
ముఖ్యంగా, చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ఓటర్లు కొండలు, కోనలు దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు వారి నివాసాలకు చేరువలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగా నమోదు అయింది.రాజస్థాన్‌లో మొదట ప్రకటించిన నవంబర్ 23న కాకుండా 25వ తేదీకి పోలింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనపై మార్చారు. పెళ్ళిళ్ళ ముహూర్తాల కారణంగా ఈ మార్పు చేయడం ఎన్నికల నిర్వహణ చరిత్రలో ఇదే తొలిసారి.మధ్యప్రదేశ్‌లో ప్రతిసారి మాదిరిగా కాకుండా ఈసారి ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగలేదు. ఎన్నికల సంఘం పరిశీలకు లు ఈ ఐదు రాష్ట్రాల్లో వివిధ దశల్లో విస్తృతంగా పర్యటిం చి పార్టీల ఫిర్యాదులను ఎక్కడికక్కడ పరిష్కరించారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌ని నిర్వహించింది. నగదు, లిక్కర్, మాదకద్రవ్యాలు కలిపి మొత్తం 1760 కోట్ల రూపాయిల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. ముఖ్యంగా, నగదును ఈ ఎన్నికల్లో భారీగా స్వాధీ నం చేసుకున్నారు. అలాగే, అక్రమ మద్యాన్ని లీటర్ల కొద్దీ స్వాధీనం చేసుకున్నారు.తెలంగాణలో గత ఎన్నికల్లో కన్నా పెద్ద మొత్తంలో నగదుపట్టుబడినట్టు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ కార్లు, వాహనాలను అడ్డగించి భారీగా నగదును స్వాధీనం చెెసుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా 26 పార్టీలు కలిసి ఇండియా పేరిట ప్రత్యా మ్నాయకూటమిని ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతు న్న తొలి ఎన్నికలు కావడం వల్ల ఈ ఐదు రాష్ట్రాల అసెం బ్లిd ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయి తే, కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య మధ్యప్రదేశ్‌లో పొత్తు పొసగలేదు. కాంగ్రెస్ అనుసరించిన ఏకపక్ష ధోరణ ఇందుకు కారణ మని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఈ ఐదు రాష్ట్రా ల్లో కాంగ్రెస్ మిత్ర పక్ష ధర్మాన్ని పాటించలేదని కూటమి లోని ఇతర పార్టీలు ఆరోపించాయి. అందువల్ల వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ కూటమి యథాతథంగా నిలుస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి. మరో వంక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీ నాయకులు,కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దింపేందుకు ఆయన వికసి త భారత్ యాత్రను ఈవారంలో ప్రారంభించారు. గ్రామాల్లో పంచాయతీ స్థాయిల్లోనూ,నగరాలు, పట్టణా ల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ప్రత్యేక వాహనాల్లో ఈ యాత్రను నిర్వహిస్తారు.పార్లమెంటు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర రోడ్ మ్యాప్‌ని రూపొందించారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మోడీయే తిరిగి అధికారంలోకి వస్తారని హోం మంత్రి అమిత్ షా ధీమా గా ప్రకటించారు. కోల్‌కతాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హ్యాట్రిక్ సాధిం చాలని కార్యకర్తలను ఇందుకు సమా యత్తపరచాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేసి తీరుతామన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ మాదిరిగా కేంద్ర మంత్రులు వికసిత యాత్రలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.