ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి ఈనెల24వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది. రష్యా చర్యను అన్ని దేశాలూ ఖండించాయి. రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలను నిషేధించాయి.మన దేశం మొదటి నుంచి తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా మన దేశం ఇదే వైఖరిని అనుసరించింది. ఇప్పటికీ మన వైఖరిలో మార్పు రాలేదు.అయినప్పటికీ, రష్యాతో మన సంబం ధాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. రష్యాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నా, మన దేశం ఏమాత్రం మెత్తబడ లేదు. అమెరికాతో రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యా న్ని కొనసాగిస్తూనే, అటు రష్యాతో వాణిజ్య సం బంధాలు కొనసాగించడం మన దౌత్య నీతిలో తటస్థతకు నిదర్శ నం.
రష్యా మన దేశానికి చమురు ఎగుమతులను పెంచింది. ఉక్రెయిన్‌పై దాడికి ముందు మన దేశానికి క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఇప్పుడు 28 శాతానికి పెరిగింది. ఒక్కసారిగా ఇంత భారీ గా దిగుమతులు పెరగడానికి అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం,రష్యాపై వివిధ దేశాలు విధించిన ఆంక్షలు మరో కారణం. ఆంక్షల ప్రభావం నుంచి తప్పించుకునేం దుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు రష్యా అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన చైనా కూడా రష్యా నుంచి మన కన్నా ఎక్కువ చమురును దిగుమతి చేసుకుంటోంది. ఆదా యం కోసం రష్యా చమురును డిస్కౌంట్ ధరకే సరఫరా చేస్తోంది. అయితే, అవసరాలకు ఎగుమతులు పెంచుకో వడం కూడా వ్యాపార సూత్రమే. గత నెలలో మన దేశా నికి రష్యా నుంచి చమురు దిగుమతులు 28 శాతానికి పెరిగాయి. డిసెంబర్లో 26 శాతం మాత్రమే. చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ ఇంధన రంగంలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్ని స్తోంది. సాధారణంగా యుద్దాల సమయంలో ఇంధనం ధర ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. గతంలో ఇరాన్- ఇరాక్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు చమురు ధర బాగా పెరిగింది.
ఈసారి అటువంటి పరిస్థితి ఏర్పడ కుండా మన దేశం ముందు జాగ్రత్తతతో వ్యవహరిస్తోం ది. ఇరాక్ నుంచి 20 శాతం, సౌదీఅరేబియా నుంచి 17 శాతం, అమెరికా నుంచి 9 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ నుంచి 8 శాతం చమురును దిగుమతి చేసు కుంటోంది. ముడి చమురు దిగుమతులు పెరిగినప్పటికీ దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ రెండింటిని కేంద్రం ఆదాయ వనరుగా భావిస్తోంది. అలాగే, వీటిపై వ్యాట్ విధించి రాష్ట్రాలు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ రెండింటినీ జీఎస్టీ పరిథిలోకి తేవాలన్న డిమాండ్‌ను రాష్ట్రాలు అంగీకరించడం లేదు. పెట్రోల్, డీజిల్‌లపై పన్ను ద్వారా కేంద్రం లక్షల కోట్ల రూపాయిల ఆదాయాన్ని పొందుతోందని రాష్ట్రాలు ఆరోపిస్తుంటాయి. వ్యాట్ స్థానిక పన్నుల ద్వారా రాష్ట్రా లు అదే రీతిలో ఆదాయం పొందుతున్నాయని కేంద్రం ప్రత్యారోపణ చేస్తూ ఉంటుంది. అంటే కేంద్రమూ, రాష్ట్రా లూ కలిసి ప్రజలపై తలకు మించిన భారాన్ని మోపుతు న్నాయన్న వాస్తవం వెల్లడవుతోంది. అలాగే, గ్యాస్ ధర విషయంలో కేంద్రం సామాన్యులపై ఎంతో భారాన్ని మోపుతోంది. గ్యాస్ వాణి జ్యావసరాలకు సరఫరా చేసే సిలిండర్లపై ధరను పెంచినట్ట గృహ అవసరాలకు సరఫ రా చేసే సిలిండర్లపై కూడా ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉంది. దీని వల్ల మధ్యతరగతి వర్గాలు ఎన్నడూ లేనంత భారాన్ని మోయాల్సి వస్తోంది.
పెట్రోల్,డీజిల్ అవసరా లను తగ్గించేందుకు కేంద్రం ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇది మంచి ప్రత్యామ్నా యంగా కనిపిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలు తరచు పేలిపోతుండటంతో వీటిపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడలేదు. ఇంధన వినియోగం పెరగడం అభివృద్ధికి సంకేతం అని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అనేవారు. ఆయన హయాంతో పోలిస్తే ఇప్పుడు ఇంధన వినియో గం పెరిగింది. దిగుమతులూ పెరిగాయి. కానీ, ప్రజలకు కేంద్రం ఏమాత్రం వెసులుబాటు కల్పించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయన్న మిషతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్రం ఎప్పటికప్పు డు పెంచేస్తోంది. దీనిని గురించి రాష్ట్రాలు వ్యాట్, తదితర పన్నుల ద్వారా తమకు వచ్చే ఆదాయం పోతుందేమో నన్న వెరపుతో కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నాయి. డీజిల్ ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువులను జలమార్గా ల ద్వారా రవాణా జరిపించి ధరలు తగ్గించేందుకు ప్రయ త్నిస్తామని మంత్రులు సదస్సుల్లో ప్రకటిస్తూ ఉంటారు. కానీ, జలమార్గాలన్నీ కబ్జాలకు గురి అవుతుండటంతో వారి వాగ్దానాలు నీటిమూటలవుతున్నాయి. అన్ని రూపాల్లో భారాన్ని మోస్తూ నలిగి పోతున్నది మధ్య తరగతి,పేదప్రజలే.ప్రభుత్వాలకు ఇంధనం భలే మంచి వనరు.