Saturday, November 23, 2024

ఎడిటోరియ‌ల్ – నేపాల్ లో మ‌ళ్లీ సంక్షోభం..

నేపాల్‌లో మళ్ళీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. వచ్చే నెల 9వతేదీన జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల లో నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి రామచంద్ర పౌఢల్‌కి మద్దతు ఇవ్వాలని ప్రస్తుత ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ నిర్ణయించడంతో ఆయన ప్రభుత్వా నికి మద్దతు ఇస్తున్న సీపీఎన్‌ యూఎంఎ ల్‌ పార్టీ వైదొల గింది. సీపీఎన్‌ యూఎంఎల్‌కి నేతృత్వం వహిస్తు న్న కేపీ శర్మ ఓలీకి ప్రచండ ప్రభుత్వానికి మద్దతుఇవ్వడం మొదటి నుంచి ఇష్టం లేదు. పైగా ఈ రెండు పార్టీల మధ్య భావసారూప్యం లేదు. ప్రచండ పార్టీ భారత్‌కి అను కూలం కాగా, ఓలి పార్టీ చైనాకు అనుకూలం.అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఇస్తామన్న మాటను ప్రచండ నిలబెట్టుకోలేదని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. పైగా, ప్రచండ భారత్‌ అనుకూల విధానాన్ని అనుసరించడం తమ పార్టీకి ఏమాత్రం నచ్చ లేదని ఓలీ బహిరంగంగానే ఆరోపించారు. ఓలీ ప్రధాని గా ఉన్నప్పుడు కాలాపానీ వంటి భారత భూభాగాలను నేపాల్‌లో కలుపుకునేందుకు ప్రయత్నించారు.

దీనిపై మన దేశం అభ్యంతరాన్ని తెలియజేసింది. అంతేకాక, మాదేశీ శరణార్ధులు భారత్‌కి వెళ్ళి పోవాలంటూ కేపీ శర్మ ఓలీ హుకుం జారీ చేశారు. నేపాల్‌కి మన దేశం దశాబ్దాలుగా ఆహారం, సాంకేతిక సాయం అందిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో తయారయ్యే అన్ని ఉత్పత్తుల ను నేపాల్‌కి సరఫరా చేస్తోంది. నేపాల్‌ ప్రజలు సాంస్కృ తికంగా, చారిత్రకంగా భారత్‌తో కలిసిమెలిసి ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల అయోధ్యలో రామాలయా నికి అవసరమైన భారీ శిలలను నేపాల్‌ తెచ్చిఇచ్చింది. భారత్‌లో జరిగే సాంస్కృతిక ఉత్సవాల్లో నేపాలీలూ, నేపాల్‌లో జరిగే ఉత్సవాల్లో భారతీయులు పాల్గొనడం ఆనవాయితీ. పశుపతి నాథ్‌ ఆలయాన్ని సందర్శించేం దుకు భారతీయులు ప్రాధాన్యం ఇచ్చినట్టే, అయోధ్య, కాశీవిశ్వనాథ్‌ ఆలయాలను సందర్శించేందుకు నేపాలీ లు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో భారతీయులతో చె లిమిని కోరకుండా కేపీ శర్మ ఓలీ చైనాతో సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యంఇవ్వడం ప్రచండకు ఏమాత్రం నచ్చలేదు.రామచంద్ర పౌఢ్యాల్‌కి 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఓలీ పార్టీ మద్దతు లేక పోయినా పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని నెగ్గించు కునే మెజారిటీ ప్రచండకు ఉంది. అధికార కూటమిలో పార్టీలు మద్దతును ఉపసంహరిస్తే ప్రధాని ప్రచండ నెలరోజులులోగా పార్లమెంటు విశ్వాసాన్ని పొందవలసి ఉంది. సాధారణంగా సంకీర్ణ కూటముల్లో మెజారిటీ పార్టీ నాయకునికే పదవి దక్కుతూ ఉంటుంది.కానీ, ప్రచండ ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఎన్‌ మావోయిస్టు సెంటర్‌కి 32 స్థానాలు మాత్రమే వచ్చాయి.

నేపాలీ కాంగ్రెస్‌ పార్టీకి 89 సీట్లు రాగా, సిపిఎన్‌ యూఎంఎల్‌ పార్టీకి 78 స్థానాలు లభించాయి. నేపాల్‌ రాజకీయాల్లో మాజీ ప్రధానులు ఎక్కువ మంది ఉండటానికి కారణం సంకీర్ణాలు ఎక్కువ కాలం నిలవక పోవడమే. నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవుబాకీ ప్రచండకీ మధ్య ప్రధాన మంత్రి పంపకం విషయంలో అంగీకీరం కుదరకపోవ డం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ప్రచండ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియదు. ప్రచండ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎంత కాలం అధికా రంలోఉంటుందో చెప్పలేమని రెండు నెలల క్రితమే విశ్లేషకులు పేర్కొన్నారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు ప్రభుత్వం సంక్షోభంలోపడింది.నేపాల్‌లో రాచరిక వ్యవస్థ కుప్పకూలిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు పేక మేడల్లా కూలి పోతున్నాయి. సైద్ధాంతిక సారూప్యత లేక పోవడం ఒక కారణం కాగా, చైనా ఆడిస్తున్న ఆటలో నేపాలీ పార్టీలు పావులుగా మారడం ప్రధాన కారణం. నేపాల్‌ ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభు త్వాలు చైనాకి వంత పాడటం ప్రజలకు నచ్చడం లేదు. పైగా, చైనా నిర్మిస్తున్న మహామార్గం కోసం నేపాల్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న విషయం బహిరంగ రహస్యం. ఈ విషయమై నేపాలీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. నేపాలీ పార్టీలమధ్య సఖ్యత కొరవ డటానికి ఇదే కారణం. శ్రీలంకలో మాదిరిగా నేపాల్‌లో రేవులు, విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించినేపాల్‌ని శాశ్వతం గా తమ అధీనంలో ఉంచుకోవడానికి చైనా రాచరిక వ్యవస్థ కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా నేపాల్‌లో రాజకీయ సంక్షోభానికి చైనాయే కారణం అనడం ఏమాత్రం సత్యదూరం కాదు.మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనా చేతిలో కీలు బొమ్మ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చైనా ఇప్పటికే శ్రీలంకనూ, పాకిస్తాన్‌నూ బానిస దేశాలుగా పరిగణిస్తోంది. నేపాల్‌ కూడా లోబర్చుకునేందుకు చాలా కాలంగా ప్రయత్ని స్తోంది. అయిత్‌ భారత్‌ అండ కారణంగా నేపాల్‌ చైనా వలలో పడటం లేదు. ఇప్పుడు అక్కడి రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని చైనా నేపాల్‌ను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement