చల్ల కోసం వచ్చి ముంత దాయడం అనే తెలుగు సామెత గుర్తుకు వచ్చేట్టుగా సాగింది ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణాదియాత్ర. తెలంగాణతో ప్రారంభ మైన మోడీ పర్యటన మైసూర్‌తో ముగిసింది.నిజానికి ఆయన పర్యటనలన్నీ సందర్భాలను పురస్కరించుకుని చేస్తున్నవే.. తెలంగాణలో పర్యటన ఎప్పటి నుంచో అను కుంటున్నదే. రెండు, మూడు సార్లు వాయిదా పడింది. ఏడాదిలో ఎన్నికలు జరిగే తెలంగాణాలో పాగా వేసేందు కు కమలనాథులు తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరి స్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు ఈ విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా తమ అభిప్రాయాల ను కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణలో ఈసారి అధికారం మాదేనని ప్రకటనలు చేస్తున్నారు.అందుకు తగినట్టుగానే కేంద్ర నాయకులు పర్యటనలు జరుపుతు న్నారు. తెలంగాణలో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి ఏనాడొ తయారైంది. అయితే,ప్ర ధానమంత్రి పర్యటన తేదీలు కుదరక వాయిదా పడుతూ వచ్చింది.ఈ సారి ఆయన ఎయిమ్స్ ప్రారంభోత్సవ చిహ్నంగా బటన్ నొక్కారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. సికిందరాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకి జెండా ఊపారు. ప్రధాన మంత్రి పర్యటన అధికారికమైనదే అయినా, అంతటి పెద్ద నాయకుడు పర్యటించినప్పుడు రాజకీయాల ప్రస్తా వన రాకుండా ఉంటుందా? వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకుని తెలంగాణ ప్రభుత్వంపై విసుర్లు విసిరా రు. రాష్ట్రానికి ఎంతో చేశామనీ,ఇంకా చేద్దామనుకుం టుంటే,రాష్ట్ర ప్ర భుత్వంకలిసి రావడం లేదని ఆయన విసుర్లు విసిరారు.
సికిందరాబాద్ నుంచి ప్రధాని చెన్నై వెళ్ళి అక్కడ కూడాఅలాంటి కార్యక్రమాల్లోనే పాల్గొన్నా రు. తమిళనాడులో ఇప్పట్లో అసెం బ్లి ఎన్నికలు లేకున్నా లోకసభ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. అందువల్ల చెన్నయ్ పర్యటన అధికారికమైనదే అయినా పూర్తిగా అలా అనుకోనక్కర్లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గడుసు మనిషి. ఎక్కడ ఏ మాట మాట్లా డాలో అక్కడ ఆ మాట మాట్లాడే నేర్పు గల మనిషి. కొద్ది రోజుల క్రితం పెరుగు అనే పదానికి ఉత్తరాది నుంచి సరఫరా అయ్యే పెరుగు ప్యాకెట్లపై దహీ అని ముద్రిస్తే సహించేది లేదని ఖరాకండీగా స్పష్టం చేసిన స్టాలిన్, ప్రధానమంత్రి పర్యటనలో అసలు ఆ ప్రస్తావన లేకుం డానే జాగ్రత్త ప డటం గడుసుతనమే.
రాష్ట్రానికి రావల్సి న నిధులు, ప్రాజెక్టుల గురించి సహజంగానే ఆయన ప్రస్తావన చేశారు. చెన్నై-కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకి జెండా ఊపారు. అలాగే, ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించారు. పాత విషయాలను కెలుక్కోవడం ఎందుకని అనుకున్నారేమో ఇద్దరూ అందువల్ల ప్రధాని పర్యటన అధికారికంగానే జరిగింది. శనివారం రాత్రికి మైసూర్ చేరుకున్నారు. ఆదివారం నాడు కర్నాటకలోని బండీపూర్ పులుల అభయారణ్యం లో ప్రధాని పర్యటించడం నిజంగా సాహసమే. ప్రాజెక్టు టైగర్ దేశానికే గర్వకారణమని అన్నారు. పులుల సంఖ్య పెరుగుదలతో భారత్ కీర్తి ఇనుమడిస్తోందని అన్నారు. దేశంలో ప్రస్తుతం 3,167 పులులు ఉన్నాయి. మధ్య ప్రదే శ్ తర్వాత కర్నాటక పులుల సంఖ్యలో రెండవ స్థానంలో ఉంది. తేప్పక్కాడులో ఆస్కార్‌లో ఎలిఫెంట్ విస్పరర్ తో పేరొందిన బొమ్మన్, బెల్లి జంట అక్కడ ఉండటంతో వారిని వెంటబెంటుకుని ఏనుగుల శిబిరాలను సందర్శిం చారు. దేశంలో జీవ వైవిధ్యాన్ని పెంచడానికి అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. బండీ పూరా అభయారణ్య సందర్శనకు ప్రధాని సఫారీ దుస్తు ల్లో వెళ్ళారు. ఆయన గతంలోకూడా అభయారణ్యాల ను సందర్శించినప్పుడు ఇదే మాదిరిగా స్థానికంగా వేసు కునే దుస్తులతోనే వెళ్ళారు. జీవవైవిధ్యం ప్రకృతి పరి రక్షణలో భాగమనీ,ప్రకృతిని పరిరక్షించడం భారతీయ సంస్కృతి అని ఆయన అన్నారు. కర్నాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో సందేశం కూడా ఉంది. రాష్ట్రంలోత్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీ నాయకులకు నర్మగర్భంగా హితోప దేశం చేసినట్టుగా ప్రధానమంత్రి ప్రసంగం సాగింది.
కొట్లాటలకు స్వస్తి చెప్పి పార్టీ విజయం కోసం కృషి చేయా లన్న సందేశం ఆయన ప్రసంగంలో ఇమిడి ఉంది. కర్నాటకలో నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరు కుంటున్నా, బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో జాప్యం జరుగు తోంది. మరోవంక కాంగ్రెస్ రెండు జాబితాలను విడుద ల చేసింది. కర్నాటకలో పార్టీ పరిస్థితిపై ఆయన సంబం ధిత నాయకులద్వారా అడిగి తెలుసుకుంటూనే ఉన్నా రు. మొత్తం మీద ప్రధానమంత్రి పర్యటన అధికారికమ ని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ఎన్నికల సీజన్ దృష్టి లో పెట్టుకుని ఆయన దక్షిణాది యాత్ర చేసినట్టు అంతే స్పష్టంగా అనిపిస్తున్నది!. ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్‌లో తప్ప ఎక్కడా రాజకీయాల ప్రస్తావన రాకపోవడం గమనార్హం.