Friday, November 22, 2024

Editorial – ధ‌ర్మ‌దండ‌మై విల‌సిల్లాలి….

పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి మర్నాడు.. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జయంతి నాడు.. కొత్త పార్లమెంటు భవ నం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. భారతదేశ సార్వభౌ మాధి కారానికి నిలువెత్తు దర్పణమై పార్లమెంటు భవనం సగర్వంగా సమున్నతంగా నిలిచిన రోజది. అనుకున్నట్టే రోజంతా ప్రధాని మోడీయే దర్శనమిచ్చారు. ఒకే ఒక్కడు.. ఒకే ఒక్క రాజదండం. కన్నుల పండగే. ప్రధాని మోడీ కోరుకున్నది ఇదే. సర్వాధికార సర్వం సహా మోడీయిజం గుర్తుగా అది మిగిలిపోయేలా ఆవిష్కరణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇది ముందే ఊహించిన ప్రతిపక్షం మోడీ ముందరి కాళ్లకు బంధం వేయాలని చూసింది. రాష్ట్రపతి చేత ఆవిష్కరింపచేయాలన్న డిమాండుని తెలివిగా తెరమీదికి తెచ్చింది. అది బాగానే చర్చనీ యాంశమైంది. వివాదాస్పదమైం ది. తర్కవితర్కాలకు దారితీ సింది. ఆ డిమాండుతో ప్రతిపక్షం తాను అనుకున్నది సాధించింది గాని అంతిమంగా అవిష్కరణ విషయంలో మాత్రం దాని ఆటలు సాగలేదు

అందుకే ప్రతిపక్ష పార్టీలు ఈ చారిత్రక సంఘటనలో ఎక్కడా కనిపించలేదు. దేవెగౌడ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని మోడీ ఆయన దగ్గర కాసేపు ఆగి ఆయన చేతులు పట్టుకుని పలకరించారు. మా జీ ప్రధానిగా ఆయనకు దక్కిన గౌరవమిది. అదే కర్ణాటక రాష్ట్రాని కి చెందిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సదవకా శాన్ని దక్కించుకోలేకపోయారు. చరిత్రలో ఆ అరుదైన సంఘట నలో తానూ భాగస్వామినని తనని తాను నమోదు చేసుకోలె కపోయారు. ఇరవై రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్క రించాయి. ఇది నిజంగా లోటే. ఇలాంటి సందర్భం ఎదురుకా వడానికి ఎవరు బాధ్యులు? ఎదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలు సంఘర్షణాత్మ కమైనవే.

సర్వో త్కృష్ట చట్టసభలో నిరంతరాయంగా జరిగే విఘాతాలకు ఎవరు కారణమంటే ఇంతవరకు సమాధానం దొరికిందా? ఇదీ అంతే. ప్రారంభోత్స వ కార్యక్రమాన్నయితే ప్రతిపక్షాలు బహిష్క రించాయి గాని, ఆర్నెల్లకోసారి జరిగే పార్లమెంటు సమావేశా లకు ఇదే భవనంలో హాజరవ్వాలన్న విషయాన్ని ప్రతిపక్షాలు మరిచిపోయాయా అన్న ప్రశ్నకు మాత్రం వారే బదులివ్వాల్సి ఉంటుంది. ఆ భవిష్యత్‌ దూర దృష్టితోనైనా ప్రతిపక్ష పార్టీల అధినాయకులు హాజరై ఉంటే మున్ముందు వారి వాదనలకు బలం ఉండేది. ఇప్పుడు పాలకపక్షం తప్పిదంలో సగం వాటాను వారే చేజేతులా మోయా ల్సిన పరిస్థితిని కల్పించుకున్నట్ట యిం ది. ప్రధాని మోడీ, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌ ముగ్గురే వేదికపై ఆసీను లయ్యారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ హాజరవ్వడాన్ని జేడీ(యు) తప్పుపట్టింది.

- Advertisement -

బహిష్క రించిన ప్రతిపక్ష పార్టీల్లో ఈ పార్టీ కూడా ఉంది. రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి సైతం హాజరుకాని కార్యక్రమానికి వెళ్లి హరివంశ్‌ ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడంపై ఆగ్రహంతో ఉంది. మొత్తంమీద ఆ సమావేశం, ఉపన్యాసాలు కొత్త చరిత్రకు తొలి సంతకాలుగా నమోదు అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాజదండం ప్రతిష్టాపన ఒక ఎత్తుగా నిలిచింది. అసలీ మొత్తం కార్యక్రమానికి ఇదే ప్రధాన ఆకర్షణగా మారింది. ఇదే ప్రధాన కార్యక్రమం మాదిరిగా, ఇదే అసలుసిసలైన ఆవిష్కరణ అన్నట్టు నిర్వహిం చారు. అయిదడుగుల రాజదండానికి ప్రధాని మోడీ సాష్టాంగ ప్రణామం చేశారు. యోగులు, సాధువులు, భారీ తలపాగాల సంతుల సమక్షంలో వారి మంత్రోచ్ఛారణలు, వేదా శీర్వాదాల మధ్య మోడీ ఆ రాజదండాన్ని రెండు చేతులతో పర మ పవిత్ర ఆయుధంగా జాగ్రత్తగా భక్తిశ్రద్ధలతో లోక్‌సభలోకి తో డ్కొని వెళ్లి, స్పీకర్‌ స్థానానికి పక్కనే ఒక ఒరలో ప్రతిష్టింపచేశారు. అదొక మరపురాని అనుభూతిని మిగిల్చింది.

మొదటిసారి పార్లమెం టు సాధువులు, సంతులు, రాజకీయ నాయకుల సమ్మేళనమై ఆహూతులకు వింత అనుభవాన్ని ఇచ్చింది. ఈ రాజదండం ఇప్పటికే అనేక ప్రశ్నలు లేవనెత్తింది. రాజశబ్దం ఎంత ప్రాచీనమో ఈ రాజదండం కూడా అంత ప్రాచీనమైనదని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. భారత ప్రజాస్వామిక చరిత్రలో ఈ 75 ఏళ్ల కాలంలో ఏనాడూ రాజదండం అనే ప్రస్తావన రాలేదు. ఇది సార్వత్రికమైనదే అయినా ఆధునిక భారత దేశంలో తొలిసా రిగా వినవచ్చింది. కనవచ్చింది. మహాభారతం లో దీని ఊసు ఉంది. రాజ్యపట్టాభిషేక సమయంలో ఇది తెరమీ దికొచ్చే ది ఆ రోజుల్లో. నేటి ఆధునిక భారతంలో కొత్తపార్లమెం టు భవన ఆవి ష్కరణ సందర్భంలో మళ్లిd వచ్చింది. అందుకే ప్రతిపక్షాలు ఇది ప్రధానిమోడీ పట్టాభిషేకంలా ఉందని విమర్శ లు గుప్పించా యి. అధికారమంతా ఒక్కరి దగ్గరే కేంద్రీకృత మయ్యే దురవ స్థðకు రాజదండం ఒక సంకేతమని వారి వాదన. కాని అదే రాజ దండం అదే పాలకుడికి కర్తవ్యబోధన చేసే ధర్మ దండంగా నూ ఉపకరించవచ్చు. మనకు రాజ్యంగామే రాజదం డం అని భావి స్తున్న ఆధునిక భారతంలో ఈ రాజదం డం ధర్మ దండంగా ఉపకరించాలని అందరూ కోరుకుంటు న్నారు. అది ముందుగా చట్టసభలతో మొదలుకావాలి.

పార్లమెం టులో నిబంధనలు తుచ తప్పక పాటించాలి. ప్రతిపక్ష గళానికి విలువ ఇవ్వాలి. వారి సలహాలు తీసుకోవాలి. బిల్లుల గురించిన సమాచా రాన్ని ముం దుగా ప్రతిపక్షాలకు అందుబాటులో ఉంచాలి. సహేతుక చర్చల కు అవకాశం కల్పించాలి. సముచిత ప్రతిపక్ష సలహాలను ఆచరణ కు తీసుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. మౌలికంగా ఈ మార్పులతో ఆ రాజదండం నిర్వచనానికి ధర్మదండం అనే ఆమోదనీయ గుర్తింపుని తీసుకొ చ్చే ప్రధాన బాధ్యతను ప్రధాని మోడీయే స్వీకరించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement