Monday, November 25, 2024

ఎడిటోరియ‌ల్ – మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంద‌హాసం?

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో పేదలు ఉండెవారు. ఇప్పుడు పేదలు మధ్య తరగతిగానూ, మధ్య తరగతివారు ఎగువ మధ్య తరగతివారిగానూ ఎదిగా రు. ఇది ఒక పరిణామక్రమం. లక్షాధికారులు కోటీశ్వరు లుగానూ, కోటీశ్వరులు మహాకోటీశ్వరులుగానూ వ ృద్ధి చెందారు. సమాజంలో అట్టడుగు వర్గం అంటే మధ్య తరగ తే అని చెప్పుకోవచ్చు. మధ్య తరగతి వారి కోసమే తమ ప్రభుత్వం పని చేస్తోందనీ, తానూ మధ్యతరగతి నుంచే వచ్చానని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ న్‌ పాంచజన్య మ్యాగజైన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమం లో తెలియజేశారు. కడు పేదరికాన్ని చూశాననీ, తన తల్లి కట్టెపుల్లల పొగలో అన్నం వండేదంటూ సందర్భం వచ్చి నప్పుడల్లా బాల్యంలో తన పేదరికాన్ని గురిచి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వర్ణిస్తుంటారు. వారిద్దరూ చెప్పిం ది నిజమే అయినా, ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చగల స్థితికి ఎదిగిన తర్వాత నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకో కుండా తమ నిరాడంబరతను చాటుకోవడానికి పాత విషయాలను గుర్తు చేస్తూ ఉంటే పేదలకు ఒరిగేది ఏమి టి? ఓదార్పు మాటలూ, ఊరడింపు కబుర్ల వల్ల పేదలకు మేలు జరగద న్న వాస్తవాన్ని అత్యున్నత స్థాయికి చేరిన వారు తెలుసుకోకపోవడం దురదృష్టకరం.

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దగల శక్తి తమ చేతుల్లో ఉన్నా వారేమీ చేయలేకపోతున్నారని, అయ్యో పాపమని వారిని చూసి మనం జాలి పడాలా? నిర్మలా సీతారామన్‌ మూడేళ్ళ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమె కి ముందు ఈ శాఖను నిర్వహించిన అరుణ్‌జైట్లీ కార్పొ రేట్‌ లాయర్‌గా పేరొందిన దృష్ట్యా ఆయనకు మధ్య తరగతివారెవరూ కనిపించలేదేమోనని అనుకోవడం సహజం. కానీ, నిర్మల ఆమే స్వయంగా చెప్పినట్టు మధ్య తరగతి నుంచి వచ్చినప్పటికీ గడిచిన మూడేళ్ళలో మధ్య తరగతికి పెద్దగా చేసిందేమీ లేదు. మధ్య తరగతికి ఏదో చేయాలనే ఆకాంక్ష ఆమెలో ఉండి ఉండవచ్చు. కానీ, ఆ అవకాశం ఆమెకు లభించి ఉండకపోవచ్చు. వ్యవస్థలో ఉన్న లోపాలే ఇందుకు కారణం. మధ్య తరగతికి ఏదో చేద్దామన్న సంకల్పం ఉన్నా, దేశంలో మధ్యదళారుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడంవల్ల ఆర్థి క మంత్రులు అశక్తులవుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ న పార్లమెంటుకు సమర్పించే సాధారణ బడ్జెట్‌లో మధ్య తరగతికి ప్రధాని వరాలు ప్రకటిస్తారని ఆమె వెల్లడించా రు. వెంటనే ఆదాయం పన్ను పరిమితిని ప్రభుత్వం పెంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఆదాయం పన్ను పరిమితి అంటే స్థూలంగా ఉద్యోగ వర్గాలకే ప్రయోజనం కలుగుతుంది. అసంఘటిత వర్గా ల సంగతి ఏమిటి? అయినా ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగాలెక్కడున్నాయి? ఆదాయం పన్ను పరిమితి పెంపు అనేది ఓట్లను కొల్లగొట్టే అస్త్రంగా మిగిలిందే తప్ప సమాజంలో అధిక సంఖ్యాకులకు దాని వ ల్ల ఎక్కువ ప్రయోజనం ఉండటం లేదు.

పేదరికం గురించి ఇప్పుడు పేదల కన్నా, సంపన్నులే ఎక్కువ మాట్లాడుతున్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెబితే తప్ప ఓట్లు రాలవన్న భయంతో వారు పేదరికం గురించి ఎక్కువగా మాట్లాడు తున్నారు. నలభై ఏడేళ్ళ క్రితం ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ పేదరికాన్ని పారద్రోలుతాం అం టూ గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి రాజకీయ నాయకులకు ఇది తారక మంత్రం అయింది. ఒకరి పేదరి కాన్ని ఇంకొకరు పారద్రోల గలరా? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కడు పేదరికంలో మగ్గినవారిమేనని చెప్పుకుంటున్నారు. వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డా రు. ఎంతో శ్రమ చేశారు. నేటితరం వారు కూడా అలాగే, స్వయంకృషితో ఉచ్ఛ స్థితికి రావాలి కానీ, వారికి తాయి లాలు ఇస్తే సరిపోతుందా? అయినా తాయిలాలు ఎంత కాలం ఇస్తారు? ఆవలి వ్యక్తికి ఏదో ప్రయోజనం ఉంటే తాయిలం ఇవ్వరు కదా! ఈ విషయాన్ని, తీసుకునే వారు గ్రహిస్తే ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చే పరిస్థితి ఏనాడో అంతమయ్యేది. సమాజంలో అందరూ స్వయంకృషి మీద జీవించే శాశ్వతమైన స్థితికి వారిని తీసుకుని రావాలి. ఉచితాలు, తాయిలాలు సగటు మనిషి ఎదుగద లకు తోడ్పడటం లేదనే విషయం రుజువైంది. ప్రజల్లో ఈ రకమైన చైతన్యం రాకుండా అడ్డు పడుతున్నది పాలకు లే. ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తూ వారి చేతుల్లోని ఓట్లను లాక్కుంటున్నారు. ప్రజల్లో ఈ విధమై న చైతన్యం వస్తే సమాజంలో పేదరికం పోతుంది. ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాల్లో శాశ్వతమైనవే ఉండాలి. నిర్మలాసీతారామన్‌ చెప్పిన విషయాల్లో వాస్త వాలు ఉన్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో స్వయం పోషకత్వాన్ని పెంచే పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే పేదల పట్ల అధికారంలో ఉన్న వారి చిత్తశుద్ధి, ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. కానీ, సంక్షేమ పథకాల ద్వారా మధ్యతరగతికి ప్రయోజనం చేకూరాలంటే మధ్య దళారులను తొలగించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement