Saturday, November 16, 2024

ఎడిటోరియ‌ల్ – విమ‌ర్శిస్తే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కాదు…

మీడియాకు వాస్తవాలు చెప్పే హక్కుందంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య దేశంలో పత్రికా స్వేచ్చకు కొత్తగా ప్రాణం పోసినట్ట భావించాలి. అయితే, పత్రికలై నా, ఎలక్ట్రానిక్‌ సాధనాలైనా పరిధుల్లో పని చేస్తే ఎటు వంటి సమస్యలు ఉత్పన్నం కావు. రాజ్యాంగం మూల స్తంభాలైన చట్టసభలు, పత్రికా వ్యవస్థ,కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు లక్ష్మణరేఖలు దాటనంత వర కూ వాటికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది.ఈ విషయాన్ని గతంలో ఎంతో మంది న్యాయకోవిదులు స్పష్టం చేశారు. అయితే,ఎప్పటికప్పుడు సమాజంలో మనుషుల్లో మాదిరిగానే, వ్యవస్థల్లోనూ ఆధిపత్య ధోరణి పెరిగిపో తోంది. దీని వల్లనే సమస్యలు పుట్టుకుని వస్తున్నాయి. చట్టసభలు చేసే నిర్ణయాలను అమలు జేసే బాధ్యత కార్య నిర్వాహక వ్యవస్థది. అయితే, ఈ మధ్య కాలంలో కార్య నిర్వాహక వ్యవస్థ దూకుడును ప్రదర్శిస్తుండటం వల్ల చిక్కులు ఏర్పడుతున్నాయి. అలాగే, పత్రికా వ్యవస్థ కూడా తన స్వేచ్ఛను ఎక్కువ వినియోగించుకుంటోంద న్న విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు పరిధిని అతిక్రమిస్తున్నాయన్న ఆరోపణ లు వస్తున్నాయి. వార్తల ద్వారా సంచలనాన్ని సృష్టించేం దుకు పత్రికలు, వార్తా ప్రసార సాధనాలు పోటీ పడుతు న్నాయి. గతంలో తమకు అందిన వార్త సరైనదో కాదో నిర్ధారణ చేసుకునేందుకు అందరినీ సంప్రదించడం, సలహాలు తీసుకోవడం చేసే వారు. ఇప్పుడు మీడియా లో పోటీ పెరగడం వల్ల అంత వ్యవధి ఎవరికీ ఉండటం లేదు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇది ఎక్కువగా కనిపిస్తోం ది. ప్రజలను ఆకర్షించడానికి మీడియా సంచలనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శ లు అనివార్యం. పత్రికల్లో ప్రభుత్వం మీద విమర్శలు గతంలోనూ వచ్చేవి. అప్పట్లో విమర్శలు విధానపరమై న అంశాలకే పరిమితం అయ్యేవి. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం లభిస్తోంది.ఇప్పుడు అన్నీ వింత గా కనిపించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. వ్యక్తిగత విమర్శలకే కాకుండా, వ్యక్తిగత విషయాలకు మీడియా లో ప్రాధాన్యత లభిస్తోంది. దీనిలో కొంత అతి కనిపిస్తోం ది. దీంతో పరువు నష్టందావాలు, కోర్టు కేసులు పెరిగి పోతున్నాయి. మనది ప్రజాస్వామ్యం కావడం వల్ల పౌరుల్లో ఉండే సహజ గుణాలే, అధికారంలో ఉన్న వారిలోనూ కనిపిస్తున్నాయి.

విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం పరిపాటి కావడంతో ప్రతిపక్షంలో ఉన్న వారు అధికారంలోకి వెళ్ళగానే తమపై వచ్చే విమర్శల నూ, ఆరోపణలను తట్టుకోలేకపోతున్నారు. వారు వీరు అనే తేడా లేకుండా వి మర్శలు, ఆరోపణలు పరిధులు, రేఖలు దాటిపోయి చేసుకోవడం వల్ల ఎవరి చేతిలో అధికారం ఉంటే వారు ఆవలి వారిపై చర్యలు తీసుకునే ధోరణి పెరిగిపోతోంది. మలయాళం మనోరమ పత్రిక కు చెందిన మీడియా వన్‌ ఛానెల్‌ని కేంద్రం నిషేధించడా న్ని సవాల్‌ చేస్తూ ఆ సంస్థ యాజమాన్యంసుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలు దీనిపై విచారణ జరిపి కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.ఈ చానల్‌పై గత ఏడాది కేంద్రం నిషేధాన్ని విధించింది. దానిపై ఆ చానల్‌ యాజమాన్యం హైకోర్టులో సవాల్‌ చేసింది. లైసెన్స్‌ పునరుద్ధరించుకోవాలంటే హోం శాఖ ను సంప్రదించాలని హైకోర్టు సూచించగా,హోం శాఖ సీల్డ్‌ కవర్‌లో తన అభిప్రాయాన్ని రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది.

- Advertisement -

ఆ చానల్‌పై నిషేధం సబబేనని పేర్కొం ది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తోపాటు డివిజన్‌ బెంచ్‌ కూడా దీనిని సమర్ధించగా, ఆ చానల్‌ సర్వోన్నత న్యాయ స్థానం లో అప్పీలు చేసింది.ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజా స్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన పత్రికావ్యవస్థ (మీడియా) ను నిషేధించడం సరికాదని స్పష్టం చేసింది. పౌర సత్వ చట్టం సవరణ, సీఏఏవంటి చట్టాలపై పౌరులు అభ్యంతరం తెలియజేసినంత మాత్రాన దానిని జాతీయ భద్రతకు భంగ కరమన డం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.రాజ్యాంగం మౌలిక సూత్రాలను సైతం గతంలో సవాల్‌ చేసిన కక్షిదారులు ఉన్నారు. కేశ వానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైనది. పౌరుల హక్కులను పరిరక్షించడం రాజ్యాంగం ముఖ్య లక్ష్యమని పేర్కొంది.అలాగే, చాలా కేసుల్లో ప్రజల హక్కు ల విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా,సూటిగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వంపై చేసే విమర్శలనుప్రభుత్వ వ్యతిరేకం గా పరిగణించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిం ది. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వ్యక్తులు కానీ, వ్యవస్థ లు కానీ అతిక్రమించకుండా తమ పరిధుల్లో పని చేసుకు ని పోవాలన్నది సు ప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల సారాంశం. ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు, తీసుకునే విధానాలపై విమర్శలు సహజం. ఇటీవల కాలంలో వ్యక్తిగతంగా విమర్శలు చెలరేగుతున్నందునే చట్టసభల్లో గందరగోళ దృశ్యాలు కానవస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement