Thursday, November 14, 2024

ఎడిటోరియ‌ల్ – మ‌ణిపూర్ లో అస్థిత్వ ఘ‌ర్ష‌ణ‌…

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణి పూర్‌ మంటల్లో మండుతోంది. ఆ రాష్ట్రంలో హింస కొత్త కాకపోయినా, ఈసారి జరుగుతున్న ఘర్షణలు స్థానికుల మధ్యనే కావడం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో 60 శాతం పైగా ఉన్న మెయితీలకూ. 40 శాతం ఉన్న కుకీలు, ఇతర గిరిజన జాతులకూ మధ్య ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలు మణిపూర్‌ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మణి పూర్‌కి మయన్మార్‌ సరిహద్దు ఉంది. ఒక్క మణిపూర్‌కే కాక, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరంలకు కూడా మయన్మార్‌ సరి హద్దు ఉంది. మయన్మార్‌లో గిరిజన తెగల వారు మన సరిహద్దు రాష్ట్రాల్లోకి చొచ్చుకుని వచ్చి ఘర్షణలకు కారకులవుతున్నారు.ఇది పాత కథ. ఇప్పుడు మెయితీ తెగ వారు తమను షెడ్యూల్డ్‌ జాతుల్లో చేర్చాలంటూ ఆందోళన సాగిస్తున్నారు. వారిని ఎస్టీల్లో చేరిస్తే తమకు ప్రస్తుతం లభిస్తున్న సదుపాయాలు ఆగిపోతాయని, లేదా తక్కువ అవుతాయనీ కుకీలు, ఇతర గిరిజన జాతుల వారు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా, విద్యార్ధు లు, యువకులు తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటా యని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెయితీల ఉద్యమాన్ని ప్రతిఘటిస్తూ కుకీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి కి మద్దతుగా ఐదు విద్యార్థి సంఘాల వారు రంగంలో ప్రవేశించడంతో ఉద్యమం హింసాత్మకంగా పరిణమిం చింది. ప్రభుత్వ వాహనాలనూ, అతిధి గృహాలను ఆందో ళనకారులు దగ్ధం చేస్తున్నారు. ఈ ఘర్షణల కారణంగా 9వేల మందిపైగా నిరాశ్రయులయ్యారు. ఈ ఉద్యమం లో మయన్మార్‌ గిరిజన తెగలు ప్రవేశించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సిం గ్‌ ఉద్యమకారులను శాంతించమని కోరినా ఆయన విజ్ఞప్తిని ఎవరూ ఖాతరు చేయలేదు. పరిస్థితి విషమిస్తుం డటంతో గవర్నర్‌ పేరిట కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. మణిపూర్‌లో నాగా, కుకీ గిరిజన వర్గాలు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.

మెయితీలను షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో చేర్చవద్దని ఈ జాతుల వారు ఆందోళన సాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ఆరోపించా రు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌తో సంప్రదిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటిక ప్పుడు తెలుసుకుంటున్నారు. అసోం రైఫిల్స్‌, ఇతర బలగాలను ప్రత్యేక విమానంలో ఇంఫాల్‌కి పంపారు. ఇప్పటికే ముఖ్యమైన ప్రాంతాలను భద్రతాదళాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడంవల్ల నిత్యావసరాలు దొరకక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే, వదంతుల కారణంగానూ, సమాచార లోపం కారణంగానూ ఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. మణిపూర్‌ లో గతంలో జరిగిన అల్లర్లకూ, ఈ ఘర్షణలకూ తేడా ఉంది. బీహార్‌, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు స్థానికులను అణగదొక్కుతున్నా రన్న అపోహల కారణంగా గతంలో అల్లర్లు జరిగాయి.

ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్న ఘర్షణల వంటివి దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. స్థానికత అంశం ఎప్పుడూ వివాదాలను రేపుతుంటుంది. మెయితీల మాదిరిగానే మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని వర్గాలు ఎస్టీ జాబితాల్లో చేర్చమని ఆందోళనలు జరుపు తున్నారు. రిజర్వేషన్ల ఫలితాలు తమకు దక్కవేమోనని ఎస్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఇది ప్రధానమైన సమస్య. గ తంలో అసోంలోకి విదేశీయులు ప్రవేశించారన్న కారణంగా స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళన లు ఉద్యమకారులను నాయకులను చేసింది. ముఖ్యం గా, అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు) నాయకుడు ప్రఫుల్లకుమార్‌ మహంతా ముఖ్యమంత్రి కాగలిగారంటే వేర్పాటు ఉద్యమ ప్రభావమే.

అలాగే, అసోం ప్రస్తుత ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కూడా ఉద్యమాల కారణంగానే నాయకునిగా ఎదిగారు. ఈ ఉద్యమాల వల్ల వ్యక్తులు లాభం పొందుతున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అసోం ఉద్యమంలో భాగంగా 80వ దశకంలో నల్లి అనే ప్రాంతంలో ఎంతోమంది మరణించారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇటు మహంతాతో చర్చలు జరుపుతూనే, మరో వంక ఉద్యమాన్ని అణచివేయడా నికి కఠిన చర్యలు తీసుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో చిచ్చు రగిల్చేందుకు చైనా అగ్గి రాజేస్తోంది. మయన్మార్‌ ని, ఇతర సరిహద్దు దేశాలను ఎగదోసి భారత్‌లో అస్థిర పరిస్థితులను సృష్టిస్తోంది. స్థానికంగా సమస్యలేవీ లేక పోతే పొరుగుదేశాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు మణి పూర్‌లో మెయితీలకూ, గిరిజనులకూ మధ్య అనుమా నాలు పెనుభూతమై ఈ ఘర్షణలకు కారణమయ్యాయి. కేంద్ర నాయకులంతా కర్నాటకలో బీజేపీ తరఫున ప్రచారంలో నిమగ్నమైన తరుణంలో మణిపూర్‌ వర్గా లు ఈ ఘర్షణలకు పాల్పడటం దుర్మార్గమే. దీనిని బట్టి పథకం ప్రకారమే ఆందోళనలను రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. హింసాత్మక ఘటనలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తప్పనిసరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement