Monday, November 25, 2024

ఎడిటోరియ‌ల్ – మ‌హా రాజ‌కీయాలు కొత్త దిశ‌గా

మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రానున్నా యా? మహారాష్ట్ర స్ట్రాంగ్‌మ్యాన్‌గా పేరొందిన నేషన లిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరుతా రంటూ వచ్చిన వార్తలు వేడి పుట్టించాయి. అజిత్‌ పవార్‌ నేతృత్వంలో ఎన్సీపీ వర్గం బీజేపీలో చేరితే తాను బీజేపీతో తెగతెంపులు చేసుకుంటానంటూ ప్రస్తుత ముఖ్య మంత్రి, శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే హెచ్చరించారు. షిండే, బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వా న్ని ప్రస్తుతం నడుపుతున్నారు. బీజేపీ నాయకులతో ఆయనకు పలు విషయాల్లో సరిపడటం లేదు. అలాగే, షిండే వ్యవహార శైలిపై బీజేపీ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేప థ్యంలో షిండే వర్గంతో తెగ తెంపులు చేసుకుని అజిత్‌ పవార్‌ నేతృత్వంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలను చేరదీయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు తగిన విధంగా ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే, దీనిపై షిండే వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ వ్యూహం మార్చుకున్నట్టు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా, ఎన్సీపీని చీల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా హెచ్చ రించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశానికి రాజధా నిగా పేరొందిన ముంబాయిలో రాజకీయ అస్థిరత ఉంటే తమ వ్యాపార సామ్రాజ్యాలు సజావుగా సాగవన్న బెదురు పారిశ్రామిక, కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఉంది. దేశా న్ని కుదిపేస్తున్న హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో కార్పొరేట్‌ దిగ్గజం గౌతమ్‌ అదానీని దోషిగా వేలెత్తి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా, దేశ రాజకీయా లను ప్రభావితం చేసే శక్తి గల ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ని గురువారం నాడు అదానీ కలుసుకుని రెండు గంటలు పైగా చర్చలు జరిపారు. హిండెన్‌బర్గ్‌ అదానీపై చేసిన ఆరోపణల ప్రభావం దేశ రాజకీయాల్లో స్తబ్దతకు దారి తీసింది.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎటువంటి చర్చ జరగకుండా వాయిదా పడటానికి ఇదే కారణం. మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావే శాల్లో కూడా ఎటువంటి చర్చ జరగకపోతే ప్రభుత్వం ప్రతిష్ట మరింత మసకబారు తుంది. ప్రతిష్టంభన తొలగకపోతే ప్రభుత్వానికే కాకుండా ఆయనకూ ఇబ్బం దికరమే. అందుకే, ప్రతి పక్షాలకు నచ్చజెప్పేందుకు పవార్‌ మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదని ప్రధాని మోడీ భావిస్తున్నట్టు కనిపి స్తోంది. హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై ఇతర ప్రతిపక్షాలు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని కోరు తుండగా, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ చేత దర్యాప్తు చేయిస్తే చాలు నని శరద్‌ పవార్‌ చేసిన ప్రకటనను బట్టి ఆయన ద్వారా ప్రతిష్టంభనను కరిగించే ప్రయత్నాలు చేయించాలని ప్రధాని ఆశిస్తున్నట్టు కనిపి స్తోంది.

అదానీకీ, పవార్‌కీ దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్నాయి. వాటిని పుర స్కరించుకుని ఆయన పవార్‌ని మర్యాద పూర్వకంగానే కలిసి ఉండవచ్చు. అంతేకాకుండా, జేపీసీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ విషయంలో పవార్‌ కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. అయితే, జేపీసీలో బీజేపీ ఎంపీల సంఖ్య ఎక్కువ ఉండ వచ్చునేమోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటులో బీజేపీకి ఇప్పుడు సంపూర్ణ మైన మెజారిటీ ఉన్నందున స్పీకర్‌ ఏర్పాటు చేసే జేపీసీలో సహ జంగానే బీజేపీ సభ్యులు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. గతంలో రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్‌పై జేపీసీలో కూడా కాంగ్రెస్‌ ఎంపీలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేయనున్న జేపీసీపై కాంగ్రెస్‌ ఇతర పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తితే, బోఫోర్స్‌పై జేపీసీ గురించి ప్రస్తావించి నెగ్గుకు రావచ్చ న్నది పాలకపార్టీ వ్యూహాంగా కనిపిస్తోంది. జేపీసీకి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేయడం ద్వారా పవార్‌ ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు.

- Advertisement -

ప్రతిపక్షాల్లో పవార్‌ మాటకు విలువ ఇచ్చే పార్టీలు ఇంకా ఉన్నాయి. అందు వల్ల జేపీసీపై ఏర్పడిన ప్రతిష్టం భనను తొలగించేందుకు పవార్‌ దౌత్యాన్ని అధికార పార్టీ ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. శరద్‌పవార్‌ని రంగంలోకి దింపేందుకే ఆయనకు సన్నిహితుడైన అదా నీని కేంద్ర నాయకులు పంపిఉండ వచ్చు. ఇప్పుడు సమస్య అదానీ వల్లే ఉత్పన్నమైంది కనుక ఆయననే ముందుకు తోస్తే పరిష్కార మార్గం దొరకవచ్చని కేంద్ర నాయకులు భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది.
పారిశ్రామికవేత్తలకు ఒక్క అధికార పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా మిత్రులు ఉంటారు. అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు సాగిస్తే ప్రతిష్టంభన తొలగిపోవచ్చన్నది కేంద్ర నాయ కుల వ్యూహంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement