Tuesday, November 19, 2024

ఎడిటోరియ‌ల్ – క‌న్న‌డ కాంగ్రెస్ హామీ అంత‌రార్ధం..

ఎన్నికలు వేరు.. ఎన్నికల ప్రచారం వేరు.. మేనిఫెస్టోలు వేరు.. పోలింగ్‌ వేరు.. ఆ తర్వాత ఫలితాలు వేరు.. ఒకదానికొకటి పొంతన లేకుండా జరుగుతున్న తీరు కర్నాటకలో చూస్తున్నాం. ఆ రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నిక లు ఇంకెన్నో రోజులు లేవు. ఈనెల పదో తేదీన పోలింగు. ఈలోగానే ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. ఎన్నికల ప్రచారం ఇప్పటికే వికృత మలుపులు తిరిగింది. ఇంకెన్ని మలుపులైనా తిరగొచ్చు. దూషణ భూషణలకు కొదువే లేదు. ప్రధాని మోడీని విషసర్పమని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే అంటే దానికి బదులుగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సోనియా విషకన్య అంటూ బదులు తీర్చుకున్నారు. అంతకుముందే ఖర్గే జారిన నోటిని వెనక్కి తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. కాలు జారితే తీసుకోగలం గాని నోరు జారితే తీసుకోలేమని ఖర్గేకి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ప్రచార పర్వంలో వికారపు పదనసలు ఇంకా కొలిక్కి రాక ముందే ఎన్నికల మేనిఫెస్టోలు రంగప్రవేశం చేసి ఈ గందరగోళపు ఎన్నికల చదరంగంలో తామూ తక్కు వేమీ తిన్లేదని కొత్త జగడం తెచ్చిపెట్టాయి. ఎన్నికల మేనిఫెస్టో అంటే హామీల వర్షం తప్ప మరేదీ కాదన్న సత్యం సర్వవిదితమే. ఉచితాలు.. ప్రగల్భాలు.. ఇవే ఉంటాయ నుకుంటాం. బీజేపీ మేనిఫెస్టోలో ఇవే ఉన్నాయి.

ఇంటికి పాలు తెచ్చిస్తామని కూడా హామీలిచ్చేశారు. ప్రధాని మోడీ ఓ వంక ఉచితాలను ఏకిపారేస్తుం టే.. అదే బీజేపీ కర్నాటకలో ఉచిత మంత్రం జపించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో కూడా హామీల వాన కురిపిస్తూనే వివాదాస్పద నిర్ణయమొకటి ప్రకటించింది. తాము అధికా రంలోకి వస్తే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే సంస్థðలను నిషేధిస్తామని చెబుతూ ఉదాహ రణలుగా పిీఎఫ్‌ఐ, బజరంగ్‌దళ్‌ సంస్ధలను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ఉటంకించింది. నిజానికి ఇది వివాదాస్పద నిర్ణయమే. అందుకే ఇది కమలనాథులను ఆగ్రహపరి చింది. బజరంగ్‌దళ్‌ సంస్ధను కాంగ్రెస్‌ పార్టీ నిషేధించాల ని కుట్ర పన్నిందని బజరంగ్‌దళ్‌ శ్రేణులు ఉవ్వెత్తున నిరసనలకు దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఏదైనా ఒక సంస్థðను అలాంటి కారణాలతో నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాని కర్నాటక లో అధికారంలోకి వస్తే అలాంటి నిర్ణయం తీసుకుంటా మని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు ఏ ఉద్దేశంతో మేనిఫెస్టోలో చేర్చారో అర్థం కాని విషయమే. మల్లికార్జున ఖర్గేలాంటి సీనియర్‌ నేతల సమక్షంలో మేనిఫెస్టో రూపకల్పన జరిగి ఉండదా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. లేకుంటే రాష్ట్ర పరిధిలో లేని అంశాన్ని మేనిఫెస్టోలో ఎం దుకు చేరుస్తారు అన్న మీమాంస ఒకటి మిగిలిపో యిం ది. అయినా బజరంగ్‌దళ్‌ని పిీఎఫ్‌ఐ సంస్థðతో పోల్చ డమే మిటని బీజేపీ, బజరంగ్‌దళ్‌ అభ్యంతరం. ఆ రెండు సంస్థ ðల కార్యకలాపాలు పూర్తిగా వేరు. అయినా ఆ రెంటి నీ ముడిపెట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘకాలిక ప్రణాళికే ఉందని బీజేపీ అనుమానిస్తున్నది.

అసెంబ్లి ఎన్నికల స్ధాయిలో విడుదలైన మేనిఫెస్టో జాతీయ స్ధాయిలో వివా దాస్పదం కావడం కూడా ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగమేనని అంటున్న వారూ లేకపోలేదు. మత విద్వేషా లను రెచ్చగొట్టి, మైనారిటీలకు మెజారిటీ ప్రజలకు మధ్య చిచ్చు పెట్టే శక్తులపై గాని సంస్థðలపై గాని చర్యలు తీసుకుం టే ఎవ్వరూ అభ్యంతరపెట్టరు. కాని బజరంగ్‌దళ్‌ని పీఎఫ్‌ఐతో జత కట్టడం ద్వారా కర్నాటక కాంగ్రెస్‌ అక్కడి ఓటర్లకు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటో అర్థం కాదు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో సర్వజ నాంగద శాం తియ తోటను కన్నడిగులకు హామీ ఇచ్చిం ది. అంటే అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన ప్రశాంత తోట అని. మరి అలాంటి తోట ఇలాంటి చర్యల ద్వారా కర్నాటక ప్రజలకు దొరుకుతుందా? నిషేధించే అధికారం లేకు న్నా, తమ పాలనలో బజరంగ్‌దళ్‌ సంస్థని వేధించడం ఖాయమన్న సంకేతాలిచ్చారా? కుల,మతరహిత ప్రాతి పదికగా జరగాల్సిన ఎన్నికలను పూర్తిగా కుల మతా ధారిత ఎన్నికలుగా మారస్తున్న వైనం కళ్లముందు కదలాడుతున్నది. కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకో వాలన్నది బీజేపీ లక్ష్యం. ఏడదిగా ఆ లక్ష్యంతోనే పాచిక లు కదిపింది. హిజాబ్‌ వివాదం, ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి మత సంబంధిత అంశాలను ఎన్నికల అస్త్రాలుగా చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే, ఆ వ్యూహం సరైన ఫలితం ఇచ్చేలా లేదని గ్రహించిన కమలనా ధులు అభివృద్ధి అస్థ్రాన్ని అందుకున్నారు. కేంద్రం నుంచి వేలకోట్లు కుమ్మరించారు. బెంగళూ రు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే సహా ఎన్నో అభివృద్ధి పను లు ప్రారంభించారు. అమిత్‌షా, మోడీ పదేపదే కర్నాటకలో పర్యటించారు. అటు కాంగ్రెస్‌కూడా ఉచిత హామీలను ఇచ్చింది. మరుగున పడిపోయిం దనుకున్న వేళ కాంగ్రెస్‌ చెప్పిన బజరంగ్‌ దళ్‌ నిషేధం మాటతో మళ్లి మతమే అస్త్రంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement