Tuesday, November 19, 2024

Editorial – అమెరికా – ర‌ష్యాల రాక్ష‌స క్రీడ‌…

ఇజ్రాయెల్‌పై హమాస్‌ తీవ్రవాదులు జరిపిన రాకెట్‌ దాడి ఇజ్రాయెల్‌ – పాలస్తీనాల మధ్య భీకర యు ద్ధానికి దారితీసింది. దెబ్బతిన్న పులిలా ఇజ్రాయెల్‌ రెచ్చి పోతోంది. ఈ రెండు దేశాల రాక్షస క్రీడలో గాజా గజగజ లాడుతోంది. ఇజ్రాయెల్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హమాస్‌ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది పక్కనపెడితే, ఇరు వైపులా వేల సంఖ్యలో సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మారణహోమానికి పూర్తి బాధ్యత అమెరికా, రష్యాలదే. ఈ రెండు దేశాలు దశా బ్దాలుగా తమ మధ్య ఉన్న వైరాన్ని ఆసరాగా చేసుకుని అమీతుమీ తేల్చుకోవడానికి పశ్చిమాసి యాను కార్య క్షేత్రంగా ఎంచుకున్నాయి. పశ్చిమాసి యాలో అగ్గి రగి లించడం ఈ రెండు దేశాలకు కొత్త కాదు. ఇప్పుడు మరో రూపంలో ఇవి దూకుడు పెంచా యి. ఇజ్రాయెల్‌లో పరి స్థితిని చక్కదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దూతను పంపగా, ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా అమెరికాదే బాధ్యత అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాల మధ్య శాంతి కోసం ప్రపంచ దేశాలు సాగిస్తున్న కృషిని దెబ్బతీ యడానికి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా జోక్యం చేసు కోవడం వల్లనే పరిస్థితి క్షీణించిందని పుతిన్‌ ఆరోపించారు. ఇది పూర్తిగా అసత్యం కాదు. ప్రపంచం లో ఏ మూల ఘర్షణలు జరిగినా, అస్మదీయులే విజేతలు కావాలనీ, తమ ఆధిపత్యం కొనసాగాలని అమెరికా కోరుకుంటూం డటం వల్లనే ఇలాంటి ఘర్షణలు మితిమీ రుతున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి పూర్తిగా ఆ రెండిం టి ఆంతరం గిక వ్యవహారం. ఒకప్పుడు రష్యాలో అంత ర్భాగమైన ఉక్రెయిన్‌ తమ చెప్పుచేతల్లో ఉండాలని కోరు కుంటున్న రష్యా దాడి ప్రారంభించింది. ఇందుకు ప్రతిగా ఉక్రెయిన్‌కి అమెరికా, దాని మిత్రదేశాలు ఆధుని క ఆయుధాలు సరఫరా చేసి ఘర్షణలు మరింత పెద్దవి అయ్యేట్టు చేశాయి. అలాగే, ఇప్పుడు పశ్చమాసియా సమస్యలో జోక్యం చేసుకుంది. ఏడు దశాబ్దాలుగా ఇజ్రా యెల్‌, పాలస్తీనాల మధ్య రగులుతున్న ఘర్షణ భీకర పోరుగా మారేందుకు ఆజ్యం పోస్తోంది. పాలస్తీనా తో తమ దేశం పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తోందనీ, హమాస్‌ మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. నెతన్యా హుపై సొంత పార్టీలోనే అసమ్మతి ఉంది. తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఆయన ఎదుర్కొం టున్నారు. ఈ యుద్ధాన్ని ఆయన తన ఇమేజ్‌ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ యుద్ధానికి ముందు ఆయన పట్ల అమెరికా కొంత వ్యతిరేకంగా ఉన్నా, ఇప్పుడు అత్యంత ఆధునిక ఆయు ధాలను సరఫరా చేయడం ద్వారా అండగా నిలు స్తోంది. హమాస్‌ రహ స్య గూఢచార వ్యవస్థనూ, డ్రోన్‌ల వ్యవస్థను నిర్మూలించేందుకు ఇజ్రాయెల్‌ దాడులును తీవ్రతరం చేస్తోంది. ఇంతవరకూ ఈ యుద్ధంలో వేలా దిమంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చునంటు న్నారు. హమాస్‌ సభ్యులు కూడా అంతే మొత్తంలో మర ణించారు. ఇజ్రాయెల్‌కి అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు, పాలస్తీనాకు ఇరాన్‌, ఇతర అరబ్‌ దేశాలు అండ గా ఉంటున్నాయి.ఈ యుద్ధంలో తమ రక్తసంబందీకు లను కోల్పోయిన వారి వేదన పాషాణ హృద యులను సైతం కదిలిస్తోంది. తమ వారిని చంపవద్దని, అందుకు బదులుగా తమను బందీలుగా తీసుకుని వెళ్ళమని ఇజ్రాయెల్‌ పౌరులు మొరపెట్టుకుంటున్న దృశ్యాలు కఠినాత్ములను సైతం కంటతడిపెట్టిస్తున్నాయి.

ఈ యుద్ధంలో ఇరు వైపు దళాలు రక్తం మరిగిన పులుల మాదిరిగా పంజాలు విసురుతూ మారణహోమానికి పాల్పడుతున్నాయి. హమాస్‌ దాడుల్లో అనేక భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పొగలు దట్టంగా వ్యాపించి ఎక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి నెల కొంది. ఈ మొత్తం మారణకాం డకు ప్రధాన దోషి అమె రికా కాగా, రష్యా కూడా తామేమీ తక్కువ తినలే దన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇంకా పెరుగు తాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల చమురు ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తృతీయ ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక భారానికి లోనవుతున్నాయి.

- Advertisement -

ఉక్రెయిన్‌ యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరించిన మన దేశం ఈ యుద్ధంలో మొదట హమాస్‌ దాడికి గురైన ఇజ్రాయెల్‌కి మద్దతు ప్రకటించింది. ఇరుదేశాల ప్రధానమంత్రులున ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ యుద్ధాన్ని ఆప గల శక్తి ఐక్యరాజ్య సమితికి ఉంది. కానీ, సమితి అమెరికా పక్షాన వహిస్తున్నదనే అపప్రథను ఇప్పటికే మూటగట్టుకుంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. మరోవై పు ఇజ్రాయెల్‌ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు ఇబ్బందే. అమెరికా దృష్టి, సహకారం ఇప్పు డు ఇజ్రాయెల్‌వైపు ఉంటుంది. ఇజ్రాయెల్‌ – పాలస్తీనా యుద్ధం తమతొ పాటు ప్రపంచ దేశాలకు ప్రమాదమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాకు కావలిసింది కూడా అదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement