Friday, November 22, 2024

Editorial – కిసింజ‌ర్ దౌత్య కౌశ‌లంలో క్రీనీడ‌లు …

హెన్రీ కిసింజర్‌ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి. అయితేనేం. ఆయనకు అమెరికా మాజీ అధ్యక్షుడన్నంత పేరు వచ్చింది.ఆయనను అసాధారణ దౌత్యవేత్తగా, అరుదైన దౌత్యవేత్తగా అభివర్ణించారు. ఆయన నిండు నూరేళ్ళ జీవితంలో ఎన్నోప్రశంసలు పొందినట్టే, విమర్శలను ఎదుర్కొన్నారు.జర్మనీలో పుట్టిన కిసింజర్‌ యూదు జాతీయుడు.జర్మనీలో హిట్లర్‌కి వ్యతిరేకంగా అమెరికా తరఫున పోరాడారు.ఆయన ఆంగ్లంలోమంచి పట్టు కలిగిఉన్నప్పటికీ జర్మన్ యాసలోనే మాట్లాడే వారు. ఆయన అమెరికా జాతీయభద్రతా సలహాదారు గా, విదేశాంగ మంత్రిగా వ్యవహరించి దౌత్య వ్యవహారా ల్లో తనను మించిన వారు ఎవరూలేరని రుజువు చేసుకు న్నారు. ఆయన అనుసరించిన విదేశాంగ విధానం అమెరికా- భారత్‌ల మధ్య దూరాన్ని పెంచింది. పాకిస్తా న్‌తో సాన్నిహిత్యాన్నికోరుకున్న కిసింజర్‌ ప్రభావం అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌పై ఎంతో ఉంది. తెలివైన వాడు,మేధావి అయిన కిసింజర్‌కి నిక్సన్‌ అధికప్రాధాన్యం ఇచ్చేవారు

.భారత్‌ని అప్పట్లో ప్రతి అంశంలో తప్పు పట్టి భారత్‌పై చాడీలు చెప్పేవారు.ఒక రకంగా అది భారత్‌కి మంచిది అయ్యింది.ఆనాటి ప్రధా ని ఇందిరాగాంధీకి బంగ్లాదేశ్‌ యుద్ధం కారణంగానే దేశ, విదేశాల్లో మంచి పేరు వచ్చింది. ఆ యుద్ధాన్ని పరోక్షం గా పురికొల్పిన వాడు కిసింజర్‌. పాకిస్తాన్‌కి ఆయుధాల ను విక్రయించరాదన్న నిషేధాన్ని పక్కనపెట్టేట్టు అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ని ఒప్పించగలిగారు.భారత ప్రధాని ఇందిరాగాంధీ అత్యంత శక్తిమంతురాలనీ, పాక్‌ పై పూర్తిస్థాయిలో యుద్ధాన్ని చేసేందుకు సమాయత్తమ య్యారనీ, ఈ సమయంలో పాక్‌కి అమెరికా ఆయుధ సాయం అవసరమని కిసింజర్‌ వాదించాడు. ఆయన చెప్పుడు మాటల వల్లే నిక్సన్‌ ఇందిరాగాంధీని అవహేళ న చేశాడు. వ్యంగ్యోక్తులతో అవమానించాడు. అయితే, తన సత్తా చాటు కోవడానికి ఆమె దీన్ని మంచి అవకాశం గా మలచుకుని రాటుదేలారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారితీసిన పాక్‌ యుద్ధంలో ఇందిర ప్రదర్శించిన ధైర్య సాహసాలకు అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. దేశంలో ప్రతిపక్షాలు సైతం ఆమెను ప్రశంసించాయి.

వియత్నాం యుద్ధం సమయంలోనూ, ఇజ్రాయెల్‌- అరబ్‌ల మధ్య యుద్ధంలోనూ కిసింజర్‌ సలహాలు అమెరికాను తప్పు తోవ పట్టించాయి. ఇరాన్‌ ద్వారా పాక్‌ కి సాయం అందించేట్టు కిసింజర్‌ సలహా ఇచ్చాడు. భారత్‌ పై ఉన్న వ్యతిరేకత కారణంగానే కి సింజర్‌ అలా చేసినట్టు వెల్లడైంది. అమెరికా అధ్యక్షులందరిలో నిక్సన్‌ సమర్ధుడై నప్పటికీ కిసింజర్‌ సలహాల కారణంగా సరైన రీతిలో వ్యవహరించలేకపోయారు. అయితే, చైనా, రష్యాల మధ్య బంధాన్ని వి డగొట్టి, చైనాని అమెరికాకి దగ్గర చేయడంలో కిసింజర్‌ ప్రధానపాత్ర వహించాడు. కిసింజ ర్‌ తర్వాతి కాలంలో తన విధానాల్లో మంచి సెబ్బరలను తెలుసుకున్నాడు. భారత్‌తో వైరం పెట్టుకుని ఉండవ ల్సింది కాదని ఆయన ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిం చాడు.

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన లో ఆయనను కలుసుకునేందుకు వీల్‌ చైర్‌లో వాషింగ్టన్‌ కు వచ్చాడు. మోడీ విధానాలను మెచ్చుకున్నాడు. కిసింజర్‌ వల్ల పశ్చిమాసియాలో యుద్ధం చాలా రోజులు కొనసాగింది. ఇజ్రాయెల్‌ని సమర్ధించి యూదులపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. లాటిన్‌అమెరికన్‌ దేశా ల్లో కమ్యూనిస్టు దేశాలకువ్యతిరేకంగా మద్దతు ఇచ్చిన కిసింజర్‌ అశాంతిని రెచ్చగొట్టాడు. అలాంటి వ్యక్తికి నోబెల్‌ శాంతిపురస్కారం ఇవ్వడం అప్పట్లో వివాదాస్ప దమైంది. కిసింజర్‌ సలహపై అప్పట్లో ప్రెసిడెంట్‌ నిక్సన్‌ కాంబోడియాపై జరిపించిన రహస్య బాంబింగ్‌లో లక్షలాది మంది మరణించారు.వియత్నాం యుద్ధంలో నూ కిసింజర్‌ సలహాతో వేలాది మంది మరణించారు. ఇన్ని వేల మంది మరణాలకు కారణమైన వ్యక్తికి శాంతి పురస్కారమేమిటని ఆరోజుల్లో అంతా నిలదీశారు. అంతేకాక, అమెరికా విదేశాంగ శాఖలో రహస్య పత్రాల ను ఆయన బయటపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి

. రిపబ్లికన్లకు చెడ్డ పేరు రావడానికి ఆయన ఇచ్చిన తప్పు డు సలహాలే కారణం.ఎన్ని తప్పుడు ఆలోచనలు చేసినా, కిసింజర్‌ తన దౌత్య కౌశలంతోనూ, చాణక్యంతోనూ అమెరికా అధ్యక్షులతో సమానంగా పేరు ప్రఖ్యాతులను పొందారు. సాధారణంగా దౌత్యవేత్తలు గడుసుతనాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ వాస్తవానికి దూరంగా జరిగి పోరు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా కిసింజ ర్‌ దేశ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా దేశాధ్యక్షుడికి సలహాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. వియత్నాం యుద్ధసమయంలో ఆయన ఇచ్చి సలహాల వల్ల అమెరికా ఆయుధ పరంగా, ఆర్థికంగా దెబ్బతింది. అయితే ఆ యుద్ధాన్ని ఆపించడంలో కీలకపాత్ర వహించి ఆయన తన కౌశలాన్ని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement