భూతాపం వల్ల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు మరణశాసనంగా మారుతున్నాయి. ఇది ఎవరి మాటో కాదు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ తాజా హెచ్చరిక. భూతాపం వల్ల హిమానీన దాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. పదేళ్ళ లో సముద్ర మట్టాలు రెట్టింపు పెరిగినట్టు ఐక్యరాజ్య సమితిలో భాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ అధ్య యన నివేదిక తేల్చి చెప్పింది. గ్రీన్‌హౌస్ వాయువుల కారణంగా భూతాపం పెరుగుతోంది. అందుకే అకాల వర్షాలు, వడగాడుపులు సంభవిస్తున్నాయి. భూతాపం.. సంపన్న దేశాల పాపం అన్న నానుడిలో అత్యుక్తి లేదు. పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి వదలడం. గ్రీన్ హౌస్ వాయువులను అరికట్టలేకపోవడం భూతాపం పెరగడానికి కారణం. భూతాపంవల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం అల్లాడిపోతున్నారు. వడగాడుపుల వల్ల ఒక్క యూరప్‌లో గత ఏడాది 15,700 మంది మరణించారు. మన దేశంలో కర్బన ఉద్గారాల కారణం గా అనావృష్టి పరిస్థితులు తాండవిస్తున్నాయి. వేడిమి పెరిగిపోవడంతో భూ మండలం అంతా మానవ జీవనా నికి ప్రతికూల పరిస్థితుల ఏర్పడుతున్నాయి.
గడిచిన ఎనిమిదేళ్ళలో హిమ సానువులు కరిగి పోవడంతో సముద్ర మట్టాలు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోతు న్నాయి. ఉద్గారాల కారణంగా అనావృష్టి పరిస్థితులు తాండవిస్తున్నాయి. కార్బన్‌డయాక్సైడ్, మిథేన్, నైట్రిక్ ఆక్సైడ్ వాయవులు అదుపు లేకుండా వెలువడుతుండ టం భూతాపం పెరిగిపోవడానికి కారణమని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వీటి ప్రభావం వల్ల ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నా యి. తూర్పు ఆఫ్రికాలో కరువు పరిస్థితులు ఇందుకు నిదర్శనం. భూతాపంవల్ల ప్రపంచంలోని వివిధ దేశాలు ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటు న్నాయో కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ఐక్యరాజ్య సమితి వాతావరణ అధ్యయన సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, సముద్ర మట్టాలు మరింత పెరిగిపోయి, పెద్ద నగరాలకు ముప్పు రావచ్చని ఆ సంస్థ హెచ్చరించింది. చైనాలో వడగాడ్పులు , వర్షా భావ పరిస్థితుల వల్ల ఆహార అభద్రత పరిస్థితి ఏర్పడ వచ్చని ఆ సంస్థ హెచ్చరించింది. పాకిస్తాన్‌లో ఆహార అభద్రత వల్ల వేలాదిమంది ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. గత ఏడాది ఋతుపవనాలు సరైన రీతిలో లేక పోవడంతో అనేక ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అలాగే, వేసవి కాలంలో వడ గండ్ల వానలు, భారీ వర్షాలు పడుతున్నాయి. రైతులే కాకుండా, పారిశ్రామిక వేత్తలు అకాల వర్షాలకు భారీగా నష్టాలకు గురి కావల్సి వస్తోంది. అనావృష్టి పరిస్థితులకు తోడు ఉత్తరాఖండ్‌లోను, కొండ ప్రాంతాలు అధికంగా గల రాష్ట్రాల్లో కార్చిచ్చులు వ్యాపించడం వల్ల ప్రజలు ఎక్కువ నష్టపోతున్నారు. అనావృష్టి పరిస్థితుల వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పడిపోతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు కూడా సన్నగిల్లా యి. ముఖ్యంగా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ ఆహార మార్కెట్లలో కొరత తీవ్రంగా ఉంది. మంచు చరియలు విరిగి పడటం వల్ల కొన్నిప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి తట్టుకోలేడనడానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనం. అయితే, సహజమైన వాతావరణ పరిస్థితులకు బదులు భూతాపం వల్లనే వాతావరణం పెనుసవాల్‌గా తయారవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఏటా సమావేశాలను ఏర్పాటు చేసి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నిర్ణయా లు తీసుకుంటున్నాయి. అయితే, ఈ నిర్ణయాలు అమలు జరగకపోవడం వల్ల భూతాపం పెరిగిపోతోంది. పారిస్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన భూతాప నిరోధక సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు కనీస 1.5 శాతా నికి తగ్గేందుకు చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని సంపన్న దేశాలు గాలికి వదిలేశాయి.
పారిస్ మహాసభ లో తీసుకున్న నిర్ణయాలకు తమ దేశం కట్టుబడి ఉండద ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం లోకి రాగానే ప్రకటించారు. ఆయన దారిలో మిత్ర దేశా లు అనుసరించాయి. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడన్ పారిస్ మహాసభ నిర్ణయాలను అమలు జేస్తామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో ముందడుగు వేయలేకపోతున్నారు. భూతాపం వల్ల కష్టనష్టాలకు గురిఅయ్యే దేశాలకు పరిహారం అందించే విషయంలో సంపన్న దేశాలు స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల కూడా భూతాపంపై జరిగిన మహాసభల తీర్మానాలు అమలు కావడం లేదు. యూరప్‌లో గత ఏడాది కరువు పరిస్థితులు ఎన్నడూ లేని విధంగా ప్రజలను భయాందో ళనలకు గురి చేశాయి.ఇలా ప్రపంచంలో అనేక ప్రాం తాల్లో భూతాపం ప్రభావం తీవ్రంగానే ఉంది.