Friday, November 22, 2024

ఎడిటోరియ‌ల్ – భార‌త్ భ‌రోసా..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐదు రోజుల పాటు జరిపిన విదేశ యాత్ర విజయవంతం అయింది. జపాన్‌ లో హిరోషిమా, నాగసాకిలో జరిగిన జి-7 దేశాల శిఖరా గ్ర సమావేశాలకు హాజరైన మోడీ, ఆ తర్వాత పసిఫిక్‌ సముద్రంలోని 14 దీవుల సమాహారమైన ఇండియా-ప సిఫిక్‌ ద్వీప సహకార వేదికనుద్దేశించి ప్రసంగించి చేసిన ప్రసంగంలో ఇచ్చిన భరోసా ఆ దీవుల పాలకులకు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. కష్టకాలంలో మొహం చాటేసే రీతిలో కాకుండా, కష్టం వచ్చినప్పుడే మరింత ఎక్కువగా సాయం అందించే దేశంగా భారత్‌ పేరొందిందని ఆయన చైనాను పరోక్షంగా ఎత్తి పొడిచా రు. చైనా తూర్పు చైనా సముద్రంలోనూ, మరి కొన్ని ప్రాంతాల్లోని దీవులను ఆక్రమించడమే కాకుండా, అక్కడ ఉండే సహజవనరులను కొల్లగొడుతున్న సంగతి యావత్‌ ప్రపంచానికి తెలుసు. భారత్‌ అలాకాకుండా పసిపిక్‌ తీరంలోని దీవుల్లో కరోనా వచ్చినప్పుడు వ్యాక్సి న్లు సరఫరా చేసింది. ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తోంది.ఈ విషయాన్ని అక్కడి దేశాధినేతలు ముఖ్యం గా పపువాన్యూ గినియా అధ్యక్షులు, ఇతరులు ప్రస్తావిం చి భారత్‌ తోడ్పాటును ప్రశంసించారు.

న్యూగినియాలో జైపూర్‌ ఫుట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రక టించగానే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఇప్పుడు కావల్సింది ఆరోగ్య, వైద్య రంగా ల్లో సేవలను అందించడం. ఈ విషయంలో భారత్‌ ఎంతో ముందు ఉంది. ఈ విషయాన్ని మన ప్రధాని మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆయా దేశాల అధినేతలు ప్రస్తావించి ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని దేశాలనూ పీడిస్తున్న ప్రధానమైన సమస్యలు సైబర్‌ నేరాలు.. ఉగ్రవాదం.ఈ రెండింటికీ బాదరాయణ సంబంధం ఉంది. ఉగ్రవాదులే సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారన్నది నిపుణుల అభిప్రాయం. వీటిని ఎదుర్కోవడానికి సైబర్‌ సెక్యూరిటీ విషయంలో సహకారాన్ని అందిస్తామనీ, పునరుత్పాదక ఇంధనం విషయంలోనూ పసిఫిక్‌ దీవులకు సాయాన్ని అందిస్తా మని మోడీ ప్రకటించగానే వారంతా పొంగిపోయారు. పపువా, గినియా దీవుల్లో తరచూ భూకంపాలు సంభవి స్తూ ఉంటాయి. వాటిని నిలబడగలిగే ఇళ్ళ నిర్మాణాలకు భారత్‌ తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చింది. గినియా ప్రధాని జేమ్స్‌ మరాపే అగ్రరాజ్యాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యామ నీ, ఈ సమయంలో భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం తమకు అండగా నిలవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ప్రశంసించారు.

ఈ దీవుల్లో అంబులెన్స్‌లు, ఇతర ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తామని ప్రధాని మోడీ ప్రకటించగానే అక్కడి వారిలో చెప్పలేనంత ఆనందం కలిగింది. ఫిజీలో సూపర్‌ స్పెషాల్టిdస్‌ ఆస్పత్రిని కూడా భారత్‌ నిర్మిస్తుందని ప్రధాని ప్రకటించారు. పేరుకి ఇవి చిన్న ద్వీపాలైనా ఆధునిక సౌకర్యాల కల్పన విషయంలో ఇవి పోటీ పడుతున్నాయి. అక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అక్కడి వారు తరచూ భారత్‌కి వస్తుం టారు. ఇకపైన అటువంటి సమస్య లేకుండా తమ దేశం లోనే సూపర్‌ స్పెషాల్టిdస్‌ వైద్యం లభ్యమవుతుందంటే వారికి కావల్సింది ఏముంది? ఫిజీ ప్రధాని సిటివేని రెబూకా మోడీకి అత్యున్నతమైన పురస్కారమైన కంపా నియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఫిజీ ఇచ్చి సత్కరించారు. తమిళంలో ప్రఖ్యాతి చెందిన తిరుక్కురల్‌ గ్రంథానికి గినియా స్థానిక భాష టోక్‌ పీసెస్‌లో రాసిన గ్రంథాన్ని మోడీ ఆవిష్కరించారు.అటు నుంచి ఆస్ట్రేలియా చేరగా నే మోడీకి ఆస్ట్రేలియన్లే కాకుండా, ప్రవాస భారతీయులు ఘనస్వాగతం చెప్పడం ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. మోడీఈజ్‌ బాస్‌ అంటూ ఆయ న చేసిన వ్యాఖ్య భారత్‌కి దక్కిన గౌరవంగా భావించాలి.

కొన్ని తరాలుగా భారత్‌, ఆస్ట్రేలియాలను క్రికెట్‌, టెన్నిస్‌, కామన్వెల్త్‌, కర్రీలు కలిపి ఉంచుతున్నాయని మోడీ వ్యాఖ్యానించగానే ప్రవాస భారతీయులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఆస్ట్రేలియాతో భారత్‌ సంబంధా లు మెరుగు పడుతున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద టాలెంట్‌ ఫ్యాక్టరీ భారత్‌లో ఉందని మోడీ అనగానే ప్రవాస భారతీయులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. వివిధ దేశాల్లో ప్రవా స భారతీయులు అందిస్తున్న సేవలు సామాన్యమైనవి కావని మోడీ అన్నారు. ఆస్ట్రేలియాతో మన సంబంధా లు ఇటీవల కాలంలో మెరుగుపడ్డాయి. ముఖ్యంగా, చైనాకి వ్యతిరేకంగా క్వాడ్‌ ఏర్పాటులో ఆస్ట్రేలియా చొర వ చూపింది. చైనా దూకుడును తగ్గించేందుకే అమెరికా, జపాన్‌ తదితర దేశాలతో కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేసింది.ఈ కూటమిఏర్పాటుతో చైనా గుండెల్లో రాయి పడింది. ప్రతి సందర్భంలోనూ చైనా దీనిని గురించి ప్రస్తావిస్తోంది. చైనాని అదుపు చేయడానికి ఏర్పాటైన క్వాడ్‌ ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటోంది. ప్రధాని పర్యటన చైనాను ఎదుర్కొనడానికేనన్నది ఆయన ప్రసంగాలలో నర్మగర్భంగా స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement