Monday, November 18, 2024

Editorial – ఎన్నిక‌ల వైపు ప‌రుగులు…

దేశమంతటా ఉన్నట్టుండి ఎన్నికల వాతావరణం అలుముకుంది. నైరుతి రుతుపవనాల కోం యావద్దేశం ఆబగా ఎదురుచూస్తుంటే అవి దోబూచులాటలో మునిగి తేలుతున్నాయి. కాని ఎన్నికల రాజకీయాలు మాత్రం కారుమబ్బులై విహరిస్తున్నాయి. నాలుగైదు రోజుల్నుం చి కేంద్ర పెద్దలు ఎన్నికల కోణంలోనే అనేకానేక ఆలోచ నలు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహాలే కేంద్రంగా రకరకాల నిర్ణయాలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం కూడా ఏతావాతా అందుకు ఉద్దేశించినదే. ఒకవంక ప్రతిపక్షాలు, మరోవంక అధికా ర పక్షం ఎవరి హడావుడిలో వారున్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ హైదరాబాదులో తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ని కలవడం కీలక పరిణామంగా భావిం చాలి. ప్రతిపక్ష కూటమి కకావికలు కాకుండా ఉమ్మడి బాటకు పాదు వేయాలన్న ప్రయత్నం జాతీయ స్థాయి లో జరుగుతున్న నేపథ్యంలో అఖిలేష్‌ యాదవ్‌ కేసీఆర్‌ భేటీ నిస్సందేహంగా ప్రాధాన్యత సంతరించుకున్నట్టే.

ఎన్నికల సీజన్‌ వచ్చేసింది అని అనుకోవడానికి మహ రాష్ట్ర ప్రస్తుత పరిణామాలు తాజా ఉదాహరణ. బీజేపీ తన అమ్ములపొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటే మరొక సారి బైటికి తెస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతున్నది. ప్రతి పక్ష కూటమి తొలి భేటీని తన రాష్ట్రంలో నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్‌ కుమార్‌ రాజకీయ అస్థిðత్వం మీదే నీలినీడలు అలుము కుంటున్న పరిస్థితి గోచరిస్తున్నది. మహరాష్ట్రలో అజిత్‌ పవార్‌ ఆదివారం తెలతెలవారుతుండగానే రాజ్‌భవన్‌ కు వెళ్లి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలతో గుంపగుత్తగా వేది క మీద ప్రమాణస్వీకారం చేయడం కమలనాథుల వ్యూహాల ఖడ్గం ఎంతగా పదునెక్కి రాటుదేలి ఉందో అర్థ మవుతున్నది. మహరాష్ట్రలో రాజకీయ కథ ఇంతటితో పరిసమాప్తం కాదు. అజిత్‌ పవార్‌ తెరమీదికి వచ్చి ప్రభు త్వంలో భాగస్వామి కావడంతో ప్రభుత్వంలోనే సరికొత్త సమీకరణాలకు తెరలేచినట్టయింది. సమీకరణాల్లో మార్పు వచ్చిందంటే అందుకు తగ్గట్టు నేతల ప్రాధాన్య తల్లోనూ మార్పు అనివార్యం అవుతుంది. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీని బలహీనపరిచే యజ్ఞంలో కమలనాథులు విజయం సాధించారు. ఎన్సీపీని చీల్చడ మంటే జాతీయస్థాయిలో శరద్‌ పవార్‌ని బలహీనపరచ డమే. తద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపరచడమే. అదే విధంగా మహరాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో శరద్‌ పవార్‌ పాత్రని కుదించి ఆధిపత్యం సాధించే ప్రక్రియలో బీజేపీ ఒకవిధంగా పొలిటికల్‌ సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసిందని చెప్పొ చ్చు. ఎటొచ్చీ అజిత్‌ పవార్‌ ఇప్పుడు సం తృప్తిక ర మైన, సుఖమయ స్థానంలో ఉన్నట్టయింది.

అదే సమయంలో ముఖ్యమంత్రి షిండే భవితవ్యం డోలాయమానంలో పడబోతున్న వాతావరణం స్పష్టంగా కనిపి స్తున్నది. దీని ప్రభావం బీహార్‌ మీద పడే ప్రమాదాన్ని ఏమాత్రం తోసి పుచ్చలేము. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మళ్లిd ఎన్డీయే లోకి వెళ్లే అవకాశాల గురించి అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అదే జరిగితే ప్రతిపక్ష ఐక్యతా యత్నాల దిశ, దశ మారే అవకాశాలున్నాయి. ఒక వంక కమలనాథులు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల కు పార్టీ ని సన్నద్ధం చేస్తూనే మరోవంక బీజేపీయేతర ప్రభు త్వాల్లో అమలు పరచాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తు న్నారు. ముఖ్యం గా ప్రధాని మోడీ అమెరికా నుంచి వచ్చీ రాగానే ఎన్నిక ల సమరాంగణంలోకి దూకేశారు. దేశం లోని ప్రాంతీ య పార్టీల మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ప్రమాదకర సంకేతాలిచ్చారు. త్వరలో జరగాల్సిన అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల కోసం కేంద్ర కేబినెట్‌కు కొత్త రూపమి వ్వబోతున్నారు. కేంద్ర కేబినెట్లకు ఎన్నికల కేబినెట్ల రూప మివ్వడం ఇటీవలి కాలంలో వచ్చిన కొత్త పరిణామం. ముఖ్యంగా ప్రధాని మోడీ హయాంలో ప్రతి మినీ ఎన్నికలకు లేదా ముఖ్య మైన రాష్ట్ర అసెంబ్లి ఎన్నికలకు ముందుగా కేంద్ర కేబినె ట్‌లో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత పెంచుతూ మా ర్పులు చేయడం పరిపాటిగా మారింది.

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే విధిగా కేంద్రం నుంచి అంగ అర్థ బలాలతో పాటు నైతిక మద్దతు కూడా అవసరంగా మారిపోయిన వైనం కళ్లముందు స్పష్టంగా సాక్షాత్కరిస్తున్నది. అందుకోసం బీజేపీ ఎంతటి సాహసోపేత నిర్ణయా లకై నా వెనుకడుగు వేయడం లేదు. తెలంగాణ బీజేపీ వ్యవహారాలే ఇందుకు ఉదా హరణ. మరోవంక ఆదివారం నాడు ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ జనగర్జన విజయవం తమైందని ఢిల్లిd నుంచి హైదరాబాదు దాకా కాంగ్రెస్‌ నాయకులు కొత్త జోష్‌లో ఉన్నారు. రాహుల్‌ గాంధీ ఖమ్మం సభలో చేయూత పథకం కింద నాలుగువేల రూపాయల పెన్షన్‌ స్కీమ్‌ ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించేశారు. ఇలా ఎక్కడికక్కడ అటు జాతీయస్థాయిలో, ఇటు వివిధ రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ప్రజలను ఎన్నికలమూడ్‌లోకి తీసుకెళ్లిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement