Tuesday, November 26, 2024

ఎడిటోరియ‌ల్ – అకాల వ‌ర్షాలు… అపార న‌ష్టాలు

అకాల వర్షాల రైతుల వెన్ను విరిచాయి.ఇప్పుడు మొచా పేరుతో మరో తుపాను ముంచుకుని వస్తోంది. ఇది తూర్పు తీర రాష్ట్రాలకేనని వాతావరణ శాస్త్రజ్ఞలు ప్రకటిస్తున్నా, గత అనుభవాల దృష్ట్యా ఇవి ఒక ప్రాం తానికో, రాష్ట్రానికో పరిమితం కావడం లేదు. ఇది పులి మీద పుట్రలా ఎంతటి నష్టాన్ని కలగజేస్తుందోనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు రైతు లకే కాదు,ప్రభుత్వాలకు పరీక్షగా మారాయి.కల్లాల్లో ధాన్యం తడిసి పోయి లబోదిబో మంటున్న రైతులను ఆదుకు నేందుకు తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభు త్వాలు వాగ్దానాలను గుప్పిస్తుంటాయి.కానీ, వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తూ ఉంటాయి.అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయంపై సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు కాగి తాలమీదనే ఉంటున్నాయి.వర్షాల నష్టాన్ని అంచనా వేసే కేంద్ర బృందాల పర్యటనలు మొక్కు బడి గానే సాగు తున్నాయి.తదుపరి కార్యాచరణకు నోచు కోవడం లేదు.

వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న అసలు సమస్య ఇదే
ఏప్రిల్‌,మే మాసాల్లో కురిసే అకాల వర్షాలు రైతులకు శాపం అవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఊహించని రీతిలో దెబ్బతీస్తున్నాయి.భూతాపం వల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని ఠక్కున చెప్పేస్తారు.కానీ, పంచభూతాల్లో అతి ముఖ్య మైన నీటినీ,వాయువును మనం అత్యంత పదిలంగా వాడుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వస్తోంది. పర్యా వరణాన్ని కాపాడుకోవాలన్న బోధనలను అమలులో పెట్టకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తు తున్నాయి. దీనికి ఎవరిమటుకు వారు ప్రశ్నించుకుంటే తామే అన్న సమాధానమొస్తుంది.అకాల వర్షాల వల్ల తెలంగాణలో పదిలక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతే మొత్తంలో నష్టం సంభవించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి, రైతులకు భరోసా ఇచ్చేందుకు తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వదల కుండా కొంటామని ప్రకటిం చారు. రైతులకు ఇలాంటి సమయాల్లో ధైర్యం చెప్పే వారు కావాలి.ప్రభుత్వాధినేత ఇస్తున్న ధైర్యం కన్నా ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది.అసలు అకాల వర్షాల తోఎదురవుతున్నఇబ్బందులకు పరిష్కారాలు కనుగొ నాల్సిన అవసరం ఉంది

. వ్యవసాయ రంగం ఎప్పటి కప్పుడు కునారిల్లి పోవడానికి కారణం ఈ రంగాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే. పారిశ్రామిక వేత్తలు తమ వాణిని వి నిపించుకునేందుకు తమ ప్రతి నిధులనుఎంపీలుగా గెలిపించుకుంటూ ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.. గతంలో వ్యవసాయ రంగం తరఫున వాదించేవా రుండేవారు. ఇప్పుడు అందరూ రైతే రాజు అని జపం చేస్తూ పారి శ్రామిక వేత్తల కు సాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం ఎవరికీ పట్టని అనాధలా మారిపోయింది. తుపానులను,అకాల వర్షాలను నిరోధిం చేందుకు ఇప్ప టికీ వ్యవసాయ శాస్త్రజ్ఞులు కృషి చేస్తు న్నాయి. ఇక్రిసాట్‌ వంటిసంస్థలు మెరుగైన ధాన్యం వంగడాలను సృష్టిస్తు న్నాయి.అక్కడి ప్రయోగ ఫలి తాలు రైతులకు చేరడం లేదు,ఒక వేళ రైతులకు శాస్త్ర జ్ఞులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, పాత పద్దతుల్లోనే వంగడాలను ఎంచుకునేందు కు రైతులు ఇష్టత చూపు తారు.

వ్యవసాయ రంగం ఒక్క మాటలో చెప్పాలంటే శాపగ్రస్థంగా తయారైంది. పాలకుల్లో కూడా నిర్లిప్తత ఏర్పడుతోంది. ఈ రంగాన్ని ఉద్దరించేందుకు గతంలో రైతు నాయకులు నిజాయి తీగా,అంకిత భావంతో కృషి చేసేవారు. ఇప్పుడు అలాంటివారు ఎవరూ లేరు.ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైనసమస్య కాదు. దేశమంతటా ఉంది. ముఖ్యంగా ఆహార ధాన్యాలను పండించే రాష్ట్రాల్లో కనిపించే ఉమ్మడి సమస్య.ఈ సమస్యపై పోరాటాలు చేసిన వారు రైతు నాయకుల య్యా రు.వారిలో కొందరు జాతీయ నాయకులయ్యా రు.అయితే,రైతుల సమస్య ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగానే మిగిలిపోతోంది. ఇందుకు కేంద్రం వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ మంత్రులను సమావేశ పర్చి నిర్ణీత కాల పరిమితిలో అమలు జేయదగిన పథకా లు,ప్రణాళిక లను అమలు జేయకపోవడమే.వ్యవసాయ రంగాభి వృద్దికి కృషి చేసే వారికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించేవి. ఇప్పుడు అరకొరగా అవి సాగుతున్నాయి. హరిత విప్లవాన్ని సాధించిన మనదేశం ఇప్పుడు పారిశ్రామికవిప్లవం వైపు పరుగులు తీస్తోంది. అన్నిరంగాల్లో దేశం అభివృద్ధి చెం దాలన్న ఆశయం మంచిదే కానీ, మూలాన్ని వదులు కుంటే నేలవిడిచి సాము చేసినట్టు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement