ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు,అధికారులు లంచాలు తీసుకోవడంపై సెటైరికల్‌గా చాలా సినిమాల్లో గీతాలు వచ్చాయి.వాటిల్లో చాలా మటుకు ప్రజాదరణ పొందాయి. రాజకీయ నాయకుల ముడుపుల గురించి కూడా వ్యంగ్యంగా గీతాలు వచ్చాయి. లంచానికి ఆమ్యామ్యా అనే మారు పేరును స్థిరపర్చారు సినీ కవులు.రాజకీయ నాయకులు ముడుపులు లేనిదే ఏ ప నీ చేయరన్న నానుడి స్థిరపడిపోయింది. లోకంలో జరుగు తున్నదే సినిమాల్లో చూపిస్తున్నామని సినిమా దర్శకు లంటారు. ఏమైనా, ఆమ్యామ్యా లేనిదే ఎక్కడా ఏ ప నీ జరగడం లేదన్నది మాత్రం యథార్ధం.ప్రభుత్వంలో చిన్న ఉద్యోగులు, అధికారులు లంచాలు తీసుకుంటే కక్కుర్తి పడ్డారనుకునేవారు. కానీ, ఇప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా పెద్ద హోదాల్లో ఉన్నవారు లంచాలను సగౌరవంగా తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లిd ఎన్నికల్లో ముడుపుల అంశాన్ని బీజేపీపై దాడికి కాంగ్రెస్ తిరుగులేని అస్త్రంగా తీసుకుం ది. ఇంజనీరింగ్, తదితర శాఖల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే 40 శాతం కమిషన్ చెల్లించి తీరాల్సిందే నని డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఆరోపణను రుజువు చేస్తూ ఇద్దరు కాంట్రాక్టర్లు 40శాతం కమిషన్ చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో కాంగ్రెస్ ఆరోపణ అసత్యం కాదని రుజువైంది. కర్నాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. దాంతో కాంగ్రెస్ ఆరోపణను జనం నమ్మారు. కర్నాటకలోనే కాదు, మా రాష్ట్రంలో నూ కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదని కేరళ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితల ఆరోపించారు.
కర్నాటకలో 40 శాతమే, తమ రాష్ట్రంలో 80 శాతం తీసు కుంటున్నారని ఆయన ఆరోపించారు.అసెంబ్లిdలో ప్రతి పక్ష నాయకుడు వి.సతీశన్ మరోముందడుగు వేసి మోటారు వాహనాలకు 627 ఏ-1 కెమెరాలను అమర్చా లన్న నిబంధనను ప్రవేశపెట్టారనీ, వాటిని అమర్చని వాహనాలదారుల నుంచి ముడుపులు వసూలు చేస్తున్నా రని ఆరోపించారు. ఈ కెమేరాలను తయారు చేసే సంస్థ లో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కి వాటాలున్నా యని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి విజయన్‌పై ఇంతకుముందే అవినీతి ఆరోపణలు వచ్చాయి. దుబా య్ నుంచి స్వప్న సురేష్ అనే యువతి విజయన్ కోసం దొంగ బంగారాన్ని తెచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కేసులో విజయన్‌కి సంబంధం లేదనీ, అధికారులు ఖండించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యు లకు సంబంధం ఉందని తేల్చారు.
అలాగే, వివిధ వ్యాపార సంస్థల్లో విజయన్ అల్లుడుకి,కుమార్తెకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు కొత్తగా రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి వర్గ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గెహ్లాట్ పైనే కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు సచిన్ పటేల్ ఇంత కుముందే ఆరోపణలు చేశారు. మళ్ళీ ఇప్పుడు గెహ్లాట్‌కి వ్యతిరేకంగా జన సంఘర్ష్ యాత్ర జరిపారు.తనపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి యాగీ చేయకుండా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజేతో గెహ్లాట్ కుమ్మక్కయ్యారని సచిన్ ఆరోపించారు. ఈ యాత్ర చేయవద్దని సచిన్‌ని పార్టీ అధిష్టానం ఆదేశిం చినా ఆయన లెక్క చేయలేదు. సచిన్ గెహ్లాట్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇద్దరికీ పొసగక పోవడం వల్ల బయటికి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుదిరిన ఒప్పందం ప్రకారం గెహ్లాట్ ఆరు నెలలు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన తర్వాత తప్పుకోవాలి. కానీ, ఆయన మొండికేసి పదవి లో కొనసాగుతున్నారు. అధిష్టానం ఆదేశించినా లెక్క చేయలేదు. ఆయన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కేబినెట్ లో పని చేశారు. అందువల్ల ఆయన పట్ల సోనియా దూకుడుగా వ్యవహరించడం లేదు. సచిన్‌కి బలం లేద నీ, అతడిని నమ్ముకుంటే పార్టీ పని గోవిందా అంటూ బ్లాక్‌మెయిల్‌కి పాల్పడుతున్నారు.
గెహ్లాట్ కేబినెట్లో మంత్రులలో అధిక సంఖ్యాకులు అవినీతి పరులు. ఒక మంత్రి తన కుమారుని పెళ్ళికి ఏకంగా ఒక గ్రామాన్ని నిర్మించాడు. ప్రజల వద్ద ఎక్కువ మొత్తంలో ముడుపు లు వసూలు చేశాడు.మరో మంత్రి దొంగ బంగారం కేసు లో నిందితుడు. మంత్రులు వసుంధరారాజేకి కోట్లాది రూపాయిలు ప్రయోజనం చేకూరుస్తున్నారని సచిన్ ఆరోపించారు. అంతేకాక, అధిష్టానంపై నేరుగానే ఆరోప ణలు చేస్తున్నారు. గెహ్లాట్‌కి కళ్ళెం వేయకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాకి బీజేపీ గాలం వేసిన ట్టే సచిన్‌కి వేసిం ది. అయితే, సచిన్ తన తండ్రి రాజేష్ పైల ట్ మార్గంలో కాంగ్రెస్‌నే నమ్ముకుని పని చేస్తున్నారు. రాష్ట్రంలో యువతరం ప్రతినిధులంతా సచిన్ వైపు నిలు స్తున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా సచిన్, గెహ్లాట్ల మధ్య విభేదాలు తెరమీది కి వచ్చాయి. సోనియాగాంధీ జోక్యంతో సర్దుమణిగాయి.