Thursday, November 21, 2024

Editorial – చైనా దుర్బుద్ధి – పెడ వాద‌న

జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణం భారత రాజ్యాంగంలోనిది. దానిని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం రద్దు చేసింది. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే, ఇది పూర్తిగా భారత్‌ ఆంతరంగిక వ్యవహారం. దీని మంచిచెడ్డల గురించి మాట్లాడాల్సిన వారు భారతీ యులే. ఇతర దేశాలకు సంబంధం ఏమిటో అర్థం కావ డం లేదు. వారికి వచ్చిన నష్టమేమిటో అంతకన్నా తెలి యడం లేదు. 370 అధికరణం రద్దును తాము గుర్తించ డం లేదని చైనా ప్రక టించింది. ఈ అధికరణం రద్దు ద్వారా జమ్ము- కాశ్మీర్‌ని మోడీ ప్రభుత్వం విభజించిం ది. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసింది. దీనికి చైనా తెగ బాధపడిపోతోంది. లడఖ్‌ తమ భూభాగమనీ, దాని ని విభజించే హక్కు భారత్‌కి ఎక్కడిదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ ప్రశ్నించారు. పైగా లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా తాము గుర్తించడం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలోని అన్ని దేశాల్లో తమ భూభాగాలున్నాయని చైనా వాది స్తోంది. కొద్దికాలంగా చైనా అక్రమ విస్తరణ కాంక్ష మరీ ఎక్కువైంది. మొన్నటికి మొన్న భూటాన్‌లో లోయలో అనధికార నిర్మాణాలను చైనా సమర్ధించుకుంది. భూటా న్‌ సమీపంలోని డోక్లాంలో జబర్దస్తుగా ప్రవేశించి ఆ భూభాగం తనదేనని ప్రకటించుకుంది.

సరిహద్దు భూభాగాలను తమ దేశంలో భాగాలుగా చిత్రించడంలో చైనాను మించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం పట్ల అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చైనా జోక్యాన్ని తప్పించినందుకు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించా రు. లడఖ్‌లో అత్యధిక శాతం బౌద్ధులు. తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలనీ, తమ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. చీటికీ మాటికీ చైనీయుల అక్రమ ప్రవేశంతో తాము విసిగి వేసారిపో యామనీ, భారత్‌లో కలిసి ఉండటమే తమ అభిమత మని వారు స్పష్టం చేస్తున్నారు.

లడఖ్‌ ప్రాంతాన్ని మింగే యడం కోసం చైనా దశాబ్దాలుగా కుటిల యత్నాలను సాగిస్తోంది. ఇందుకోసమే మెక్‌మెహన్‌ రేఖ వద్ద అలజడి సృష్టించింది. ఇప్పటికీ అక్కడ చైనా సైనికులు మన సైనికు లతో తరచూ గొడవ పడుతున్నారు. లడఖ్‌ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్‌ సహకారం అవసరం. అందుకని ఆక్రమిత కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ని చైనా సమర్థిస్తోంది. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించేం దుకు అదొక మార్గంగా చైనా భావిస్తోంది. చైనాని నిలువ రించేందుకే లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. లడఖ్‌ ప్రాంతంలోని సహజ సంపదను దోచుకోవడమే చైనా ముఖ్యోద్దేశ్యం. లడఖ్‌ జమ్ము-కాశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్నా, అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, మతాన్ని అడ్డు పెట్టుకుని చైనా ఇంతకాలం లడఖ్‌ ప్రాంతాన్ని దోచుకుం ది. లడఖ్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా మోడీ ప్రభుత్వం ప్రకటించడంతో చైనా గుర్రు పెంచుకుంది. లడఖ్‌ సమీపంలోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద రోడ్లు, వంతెన లను చైనా నిర్మించింది. అక్కడ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దళాలను మోహరించింది.

మూడేళ్ళ క్రితం పీఎల్‌ఏ దళాల కాల్పుల్లో భారత సైనికులు 20మంది వరకూ మరణించారు. ఆ ప్రాంతాన్ని కూడా తమ భూభాగంగా ప్రకటించుకుని చైనా ఎదురుదాడి జరుపు తోంది. అయితే, మన సైనికులు పిీఎల్‌ఏ దళాల ను సమ ర్థవంతంగా తిప్పికొట్టాయి. ప్యాంగ్యాంగ్‌ సమీపంలో ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది. మరో వంక పాకిస్తాన్‌ కూడా 370వ అధికరణం రద్దుపై సుప్రీం కోర్టు తీర్పును తప్పు పడుతూ ప్రకటనలు విడుదల చేసింది. పాకిస్తాన్‌ లో అంతర్గత పరిస్థితి సవ్యంగా లేదు. కొత్తగా పుట్టుకొచ్చి న ఉగ్రవాద సంస్థ 25 మంది సైనికులను హత్య చేసింది. ఆర్థికంగా దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తా న్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తుత పరిస్థితిలో పాక్‌ భారత్‌తో సన్నిహితంగా ఉండటమే మంచిదన్న అభిప్రా యాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు.

తన హయాంలో భారత్‌తో సాన్నిహిత్యం కోసం చాలా ప్రయత్నించాననీ, మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోడీ పాక్‌లో పర్యటించారనీ, బస్సు, రైలు సర్వీసులను కూడా ప్రారం భమయ్యేట్టు చేశానని చెప్పు కొచ్చారు. పాక్‌లో 370 అధికరణం రద్దును వ్యతిరేకించే వారంతా సైనికాధికారు ల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్న వారే. 370వ అధికరణం రద్దుపై ఎవరేమి మాట్లాడినా, దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిం చిన దృష్ట్యా మన దేశం నిశ్చింతగా ఉండవచ్చు. 370 అధికరణం అడ్డుపెట్టుకుని కాశ్మీర్‌ ప్రాంతాన్ని కబళించేం దుకు పాకిస్తాన్‌ దశాబ్దాలుగా కుయుక్తులు చేస్తోంది. అయితే కంటిలో నలుసుగా ఉన్న ఆ సమస్యను ప్రధాని మోడీ అవలీలగా పరిష్కరింరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement