చైనా బుద్ధి ఎప్పుడూ వంకరే. ఎదురుపడినప్పుడు ముసిముసి నవ్వులు, మెచ్చుకోలు ప్రకటనలు, అలా వెళ్లగానే భారత్‌పై విషంకక్కడం చైనా నైజం. భారత్‌తో సాధారణ సంబంధాల కోసం తమ ప్రభుత్వం ఎదురు చూస్తోందని చైనా విదేశాంగ మంత్రిగా ఇటీవల ప్రమా ణం చేసిన క్విన్‌గాంగ్ అన్నారు. అంతకుముందు ఈ పదవిని నిర్వహించిన వాంగ్ యీ కూడా ఇదే మాట ఎన్నో సార్లు అన్నారు. వారు విధి నిర్వహణలో భాగంగా ఆ మాట అంటూ ఉంటారు. అసలు నిర్ణయాధికారం దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చేతిలో ఉందనే విషయం అందరికీ తెలుసు. లడఖ్ తూర్పు ప్రాంతంలో గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు చొచ్చుకుని వచ్చినప్పుడు మన సైనికులు తలబొప్పికట్టే రీతిలో గట్టి సమాధానమి చ్చారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో మన సైనికులు 20 మంది మరణించారు. వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మేజర్ సంతోష్‌బాబు కూడాఉన్నారు. ఆ ఘర్షణలో చైనా వైపు భారీగా ప్రాణనష్టం జరిగింది.
అయితే, అదేమీ లేదంటూ బుకాయిస్తూ వచ్చిన చైనా చివరికి చావుకబురు చల్లగా చెప్పినట్టు తమవైపు కూడా సైనికుల నష్టం జరిగిందని అంగీకరించింది. ఇది జరిగిన తర్వాత ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలోనూ, ఉన్నత దౌత్యాధికారుల స్థాయిలో సమావేశాలు జరిగా యి. యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, ఆ నిర్ణయాన్ని చైనా మూణ్ణాళ్ళ ముచ్చటగా తుంగలోకి తొక్కింది. తూర్పు లడ ఖ్ ప్రాంతంలో మన దేశానికి చెందిన పెట్రోలింగ్ పాయింట్లు మొత్తం 65 ఉండగా, వాటిలో 26 పాయింట్లను చైనా తన ఖాతాలో వేసుకుంది. ఈ పెట్రోలింగ్ పాయింట్లు కారాకోరం నుంచి చూమూరు వరకూ ఉన్నాయి. సరిహద్దులలో భారత దళాలు ఈ ప్రాంతంలో గస్తీ కాస్తుంటాయి. అంటే మన అధీనంలోనివే. అయితే. వీటిని కోల్పోవడం గురిం చి అడిగితే కాలక్రమంలో పెట్రోలింగ్ పాయింట్లు తగ్గు తాయంటూ వితండవాదం మొదలు పెట్టింది.
ఈ 26 పాయింట్ల ప్రాదేశిక సరిహద్దు ప్రాంతంపై హక్కును భారత్ కోల్పోయిందన్న విషయాన్ని ఇటీవల ఢిల్లిdలో జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో లడఖ్ పోలీసు అధికారులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ నివేదికకు ఆధారం లేదంటూ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తోసిపుచ్చారు. వాస్తవాధీన రేఖ వద్ద మన భూ భాగమేదీ అన్యాక్రాంతం కాలేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, భద్రతా వ్యవ హారాల సలహాదారు అజిత్ దోవల్ వంటి అతిరథులు హాజరైన సమావేశంలో లడఖ్ పోలీసులు అబద్ధపు నివేదికను సమర్పిస్తారా? ఇది కేవలం రక్షణ శాఖ బుకా యింపు మాత్రమేనని అనుకోవల్సి వస్తోంది. రక్షణ శాఖ అధికారులు గతంలో కూడా ఇదే మాదిరిగా మన భూ భాగం అన్యాక్రాంతం కాలేదంటూ బుకాయిం చారు. ఆశ్చర్యమైన విషయమేమంటే, గతంలో ఆక్రమించిన 90వేల చదరపు మైళ్ళ భూభాగం ఇంకా చైనా అధీనం లోనే ఉందని సమాచార హక్కుచట్టం కింద ఒకరు అడిగి న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. ఆ భూభాగం తిరిగి మన ఆధీనంలోకి రాలేదు సరికదా, కొత్తగా, పెట్రోలింగ్ పాయింట్లు కోల్పోవడం భారత్‌లోకి చైనా చొరబడేందుకు చేస్తున్న యత్నాలకు అద్దం పడు తోంది.
గాల్వాన్ ఘర్షణ సమయంలో కూడా కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. అయితే, తమ వైపు సరిహద్దు ల్లో రోడ్డు, వంతెన నిర్మాణ పనులవల్ల కొంత మేర భారత భూభాగంలోకి వచ్చినట్టుగా కనిపించి ఉండవచ్చని చైనా సరిహద్దు అధికారులు వివరణ ఇచ్చారు. అంటే, అది చొరబాటు అని అంగీకరిస్తూనే, తాత్కాలికమేనని చెప్పడం చైనా నంగనాచితనానికి నిదర్శనం. అయితే, సరిహద్దులలో మన వైపు అంగుళం అంగుళం చొప్పున సలామీ స్లైసింగ్ పేరిట చైనా దళాలు చొచ్చుకుని రావడం వల్లనేd ఈ పెట్రోలింగ్ పాయింట్లు తగ్గిపోయాయన్న వాదం సరైనదే కావచ్చు. ఒక్కొక్క అంగుళం చొప్పున భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడం చైనా వ్యూహంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మన భద్రతా దళాలు మరింత మెలుకవతో, చైనా కదలికలను గమ నిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్ది రోజుల క్రితం సరిహద్దుల్లో తమ దళాల కదలికల తీరును గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. అంటే ఆయన ఎప్పటికప్పుడు తమ దళాల చొరబాటును పర్యవేక్షిస్తున్నట్టు అర్ధం చేసుకోవ ల్సి ఉంటుంది. మనవైపు సైనికదళాల ప్రధానాధికారి, రక్షణ మంత్రి చైనా చొరబాట్లేవీ లేవనీ, ఒక వేళ చైనాకి చెందిన పీఎల్‌ఏ సభ్యులను మన దళాలు తరిమికొడుతు న్నాయని చెబుతూ ఉంటా రు. చైనాపై అనుమానాలు వ్యక్తం చేయడంగానే ప్రభుత్వం భావించాలి తప్ప, పొరుగు దేశానికి అనుకూలంగా మాట్లాడినట్టుగానో, మన సేనల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినట్టుగానో భావించరాదు.