ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల స్థాయికి హైదరాబాద్ ఎదిగింది. అంతర్జాతీయ సంపన్న నగరాల జాబితాలో మన భాగ్యనగరానికి చోటు దక్కింది. ఇది తెలుగువారికి మనసు పులకింపచేసే పరిణామం. సంప న్న నగరాన్ని డబ్బుతో కొలవడం కాదు.. డబ్బుంటేనే సంపన్నులం కాదు.. సుఖవంతమైన జీవనానికి ఆలవా లమైన బహుముఖ వనరులు సమృద్ధిగా దొరికితే అది సంపన్న జీవితమే. అది సంపన్న నగరమే. వందల సంవత్సరాల చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక వారస త్వ సంపదతో ఎంతో ఖ్యాతి చెందిన భాగ్యనగరం ఆధు నిక యుగంలో ఐటీ రంగంలో మేటిగా నిలిచింది. ప్రపం చంలోని ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో అడుగుపెట్టి పరిశోధనలకు ఉవ్విళ్లూరుతున్నాయి. మన మహానగరం… విశ్వనగరంగా ఎదిగే దిశగా దూసుకు పోతున్నవేళ ఇది ఉత్తేజపరిచే కబురే. నిజానికి అభివృద్ధి నమూనాల కోసం అన్ని దేశాలూ ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.
ముఖ ్యంగా మెడికల్ టూరిజం, సినిమా టూరిజం, ప్రాచీన కళాఖండాల సందర్శన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ బిర్యానీ.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో హైదరాబాద్ తన ప్రత్యేకతను ప్రదర్శించుకుంటూ అగ్రస్థానంలో ఉంది. అన్నింటి కన్నా వైద్య రంగంలో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షిస్తోంది. పాత విషయాలను పక్కన పెడితే, కొద్ది రోజులుగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఇక్కడే జ రుగుతున్నాయి. అత్యంత మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాల నుంచి సామాన్యులే కాకుండా, ప్రముఖులు హైదరాబాద్‌కి తరలి వస్తున్నారు. తాజాగా, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌఢ్యల్ తీవ్ర అస్వస్థతకు లోనైతే ఖాట్మండూ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించారు. యూఏఈ, దుబాయ్, అరబ్‌దేశాల నుంచి ఎంతో మంది హైదరాబాద్‌లోని విశ్వవిఖ్యాతి చెందిన ఆస్పత్రుల్లో చికిత్స కోసం తరలి రావడం మనకు తెలుసు.
అలాగే, వందల ఏళ్ళచరిత్ర కలిగిన చారిత్రక వైభ వాలను వీక్షించేందుకు హైదరాబాద్‌కి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు సందర్శనకు రావడం కూడా నడు స్తున్న చరిత్రే .హైదరాబాద్‌లోనే కాకుండా, తెలంగాణలో గడిచిన ఎనిమిది ఏళ్ళలో సంపద బాగా పెరిగింది. కుల వృత్తులను తెరాస ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తున్నం దున గ్రామాల్లో కూలీ,నాలీ చేసుకునే జనం పట్టణాల కూ, నగరాలకూ వలస రావడం తగ్గించారు. ముఖ్యంగా, చేనేత వస్త్రాలను నేసే నేతకారులు, కుండలు, మృణ్మయ పాత్రలు తయారు చేసే శాలివాహనులు గ్రామాల్లోనే తర తరాలుగా కొన సాగుతున్న తమ వృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా నీటి వనరులు నిండు కుండల్లా కళకళ లాడుతున్నాయి. భూగర్భ జలమట్టాలు పెరగడంతో నీటి గోస తప్పింది. తరతరాలు గా రైతులకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నవి పాడిపంటలేనన్న వాస్తవాన్ని జనానికి ఎరిగింపజేయ డమే కాకుండా,వాటిపై శ్రద్ధ చూపేట్టు ప్రభుత్వం చేయగలుగుతోంది. ఒకప్పుడు వలసల రాష్ట్రం గా పేరొం దిన తెలంగాణ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ అన్నం పెట్టే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందు తోంది.
సంపద పెరగడంతో హైదరాబాద్ వైపు జనం ఆకర్షితులవుతున్నారు. పారిశ్రా మికంగా కూడా హైదరా బాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగయ్యాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ ఫ్లయిట్స్ నడుస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళాలన్నా, హైదరాబా ద్మీదుగా వెళ్ళే విమాన సర్వీసుల సౌకర్యం ఉంది. అందుకే, హైదరాబాద్ టూరిస్టు స్పాట్‌గా పేరొందింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒకప్పుడు బెంగళూ రు దేశం మొత్తం మీద అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించింది. సిలికాన్ వ్యాలీకి పోటీగా జినోమ్ వ్యాలీ అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ గడగడలాడించిన కరోనా వ్యాధి నిరోధానికి వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో దేశాల నుంచి హైదరాబా ద్‌లోని వ్యాక్సిన్ల తయారీ సంస్థలకు ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి.
నిజాం కాలం నాటి శిల్పకళా సంపదకు హైదరాబాద్ ఇప్పటికీ పుట్టినిల్లుగా ఉంది. దేశంలో అనేక నగరాల్లో ప్రాచీన నాగరికత ఉట్టిపడే సంస్థలు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌కి ఉన్న పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, ప్రపంచం లోని వివిధ నగరాల నుంచి పర్యా టకులు హైదరాబాద్‌కి తరలి వస్తుంటారు. దీంతో ప్రపం చంలో పర్యాటక రం గంలో అత్యుత్తమమైన నగరంగా హైదరాబాద్ పేరొం దింది. ప్రజలకు ఆనందాన్ని పంచ డంలోనే కాకుం డా, ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదం చేస్తున్న ఫార్మసీ సంస్థలకు హైదరాబాద్ నెలవు అయింది. రక్షణ పరిశొ ధనలు, విమానయాన రంగానికి సంబం ధించిన యంత్ర పరికరాల తయారీ… ఇలా ఒకటేమిటి అన్ని రంగాల అభివృద్ధికి వేదికగా మారింది.