రైతులు పండించిన ఆహార ధాన్యాలకు మద్దతు ధర విష యంలో ఏటా ప్రభుత్వానికీ, రైతాంగానికీ వివాదం తలెత్తుతోంది. ఈ ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజుల క్రితం వరి, వాణిజ్య పంటల మద్దతు ధరను పెంచుతున్నట్టు కేంద్ర ప్రభు త్వం ప్రకటించింది. అయితే, పెరిగిన పెట్టుబడి వ్యయం తో పోలిస్తే ప్రభుత్వం పెంచిన మద్దతు ధర ఏపాటిదం టూ రైతులు పెదవి విరిచారు. ఇది మద్దతు ధర కాదనీ, మొక్కుబడి ధరంటూ ధ్వజమెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో సరిపెడితే, ఉత్తరాదిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు సోమవారం నాడు కురుక్షేత్రలో మహా పంచా యత్‌ని నిర్వహించి ఢిల్లి దాకా ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం న్యాయసమ్మతం కాదనీ, పొద్దు తిరుగుడు పువ్వుకు క్వింటాల్ ధరను 6,400 రూపాయిలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కురుక్షేత్ర జిల్లాలో పిప్లీ వద్ద ఎంఎస్‌పి ది లావో, కిసాన్ బచావో నినాదాలతో రైతులు ఆందోళనను నిర్వహించారు
.
ఈ దృశ్యం రెండేళ్లక్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లి సరిహద్దుల్లో రైతులు నిర్వహించిన ఆందోళన గుర్తుకు తెచ్చింది. పెట్టుబడి వ్యయం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పెంచే మద్దతు ధర ఏమాత్రం సరిపోవడంలే దనీ, ఆహార ధాన్యాల ధరలను కేంద్రం సరియైన రీతిలో అంచనా వేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత ్తల డిమాండ్లను అంగీకరిస్తోందనీ, వ్యవసాయదారుల విషయంలో అన్యాయం చేస్తోందని వారు ఆరోపిస్తున్నా రు. అటు ఉత్తరాది రైతుల్లోనే కాకుండా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై ఇటు వరి పండించే రైతుల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పెట్టుబడి వ్యయం పెరగడంతో పాటు అకాల వర్షాలు, చీడ, పీడలవల్ల ఆహార ధాన్యాల దిగుబడి బాగా తగ్గి పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా, వరి సాగు వ్యయం ఎకరానికి 38 వేల రూపాయిలు అవుతుండగా, కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 22 వందల రూపాయిలు ఏమాత్రం సరిపోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయఅధికారులు పదేళ్ళక్రితం సూచించిన ధరలను ఇప్పుడు ప్రకటించడం విడ్డూ రంగా ఉందని వారంటున్నారు. వరి మద్దతు ధర విష యంలో తెలుగు రాష్ట్రాల రైతులు సూచించిన ధరలను కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పొద్దు తిరుగుడు పువ్వు ధర విషయంలో కూడా అన్యా యం జరుగుతోందని ఉత్తరాది రైతులు వాపోతున్నారు. పంజాబ్, హర్యానా రైతులు మాత్రం ఈ విషయంలో ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు ఆందోళన చేపట్టారు.
కాగా, హర్యా నా ముఖ్య మంత్రి మనోహర్‌లాల్ కట్టార్ రైతుల ఆందోళన రాజకీయ ప్రేరేపి తమైనదని ఆరోపిం చారు. గతంలో రైతులు జరిపి న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ప్రధాన వ్యవసాయ సమస్యల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారనీ, ఈ ఏడాది ముందే మద్దతు ధరలు పెంచారని అయినా, రైతులు ఆందోళన చేపట్టడం ఎంత మాత్రం న్యాయం కాదని ఖండించారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే వారు ఆందోళన చేపట్టారని కట్టార్ మాత్రమే కాకుండా, బీజేపీ నాయకులు పలువురు ఆరోపించారు. పొద్దు తిరు గుడు పువ్వు విత్తనాలను ఎంఎస్‌పి ధర కన్నా తక్కువకు విక్రయించిన రైతులకు క్వింటాల్‌కి వెయ్యి రూపాయిల వంతున ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం ముందుకు వచ్చిందని కట్టార్ అన్నారు. రెజ్లెర్ల సమాఖ్య నాయకుడు బజరంగ పునియా ఆధ్వర్యంలో రెజ్లర్లు రైతుల ఆందోళ నకు మద్దతు ఇవ్వడాన్ని ఉదహరిస్తూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులు ఆందోళన సాగిస్తున్నా రంటూ కమలనా థులు ధ్వజమెత్తుతున్నా రు.ఈనెల ఆరవ తేదీన భారతీ య కిసాన్ యూనియన్ ఆధ్వర్యం లో ఆరు గంటలపా టు జాతీయరహదారిని దిగ్బంధనం చేయడాన్ని కూడా కమలనాథులు తీవ్రంగా విమర్శిస్తు న్నారు. రైతులకు ప్రభుత్వం ఎంతో గౌరవం ఇస్తోందనీ, వారి డిమాండ్ల పట్ల సానుభూతితో వ్యవహరిస్తోం దనీ, అయినప్పటికీ, భారతీయ కిసాన్ యూనియన్ వంటి సంస్థలు ప్రతిప క్షాల చేతుల్లో పావులుగా మారడం దురదృష్టకరమని మనోహర్ లాల్ కట్టార్ విమర్శించారు.
ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు కావడం వల్ల మరింత ఒత్తిడి తెస్తే, ప్రధాని వద్ద తమ వాణిని మరిం త బలంగా వినిపించగలరని రైతులు భావిస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు మహాపంచాయత్‌ని నిర్వహించ డం చట్ట విరుద్ధమని ప్రభుత్వం ఆరోపిం చింది. భారతీ య కిసాన్‌యూనియన్ అధ్యక్షుని తో సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. రాజకీయా లు ఎలా ఉన్నా అన్ని రాష్ట్రాలలో రైతులు మద్దతు ధరపై అసంతృప్తితో ఉన్నమాట నిజం.