మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మనం అనాగరిక సమాజంలో జీవిస్తున్నామా? శాంతిభద్రతల యంత్రాంగం ఏం చేస్తోందంటూ పశ్నించింది. మణిపూ ర్ మంటలు మానవజాతికి మాయని మచ్చ అని కూడా వ్యాఖ్యానించింది. పరిస్థితి అదుపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు తీసుకోకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ కొద్ది నెలలుగా సాగుతోంది. వాటిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్కడి పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ గురువారంనాడు తొలిసారిగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్య లు తీసుకోవల్సిందేనని రాష్ట్రాన్ని ఆదేశించారు.
దేశంలో పలు ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు రాష్ట్రాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకో వడానికి ముందే ప్రధాని మోడీ ఈ హెచ్చరిక చేసి ఉంటే సబబుగా ఉండేది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్‌ని సందర్శించి తగిన ఆదేశాలిచ్చినా ఫలితం కనిపించలేదు. దీనిని శాంతిభద్రతల సమస్యగా కాకుం డా, జాతుల మధ్య తలెత్తిన వివాదాన్ని కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య కలహాలు సాధారణం. నాగాలాండ్‌లో అశాంతిని అరికట్టడంలో ఆనాడు పీవీ నరసింహారావు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పొడిగింపుగా, ప్రస్తుత ప్రధాని మోడీ తగిన చర్యలు తీసుకున్నారు.
అలాగే, ఈ సమస్య నూ ప రిష్కరించాలి. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. మహిళలపై దేశంలోని వివిధ ప్రాంతా ల్లో జరుగుతున్న లైంగిక దాడులన్నీ ఒక ఎత్తు. మణిపూర్ లో జరిగింది మరో ఎత్తు. అక్కడ మహిళలకు మొదటి నుంచి రక్షణ లేదు. జాతుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న వైరంలో మహిళలను పావులుగా వాడుకోవ డం క్షమించరాని విషయం. పైగా, రెండునెలల క్రితం పొలంలో మహిళపై యువకులు అత్యాచారానికి పాల్ప డిన సంఘటనకు సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో యావత్ లోకం తీవ్రంగా స్పందించింది. మనుషుల మధ్య సామరస్య వాతావర ణాన్ని పెంపొందించాల్సిన వివిధ జాత ుల నాయకులు ఇలాంటి వైరాలను స్వీయ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గం. మణిపూర్ లో ఆందోళన సాగిస్తున్న జాతుల డిమాండ్‌లో న్యాయం ఉండవచ్చు. కానీ, వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిం చాలే తప్ప, వారిని బాధితులను చేయడం క్షమార్హం కాదు.
మణిపూర్ ఘటనలో బాధితురాలికి కొత్తగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్, ఢిల్లిd ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. బాధితురాలి చిత్రాన్ని వైరల్ చేసినందుకు ట్విట్టర్ యాజమాన్యానికి జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ నోటీసు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారనీ, అసలైన వారిని వదిలి వేశారని ఆమె ఆరోపించా రు. ఈ ఘటనపై యావత్ దేశం తీవ్రంగా స్పందించింది. ఇంకా స్పంది స్తూనే ఉంది. మణిపూర్‌లో కొద్ది నెలలుగా జరిగిన అల్లర్లు, హింసాకాండలో రాజకీ య నాయకుల ఆస్తులు దగ్ధమయ్యాయి. మంత్రులు, శాసనసభ్యుల నివాసాలు, ఇతర ఆస్తులను ఆందోళనకా రులు తగులబెట్టారు. ఈ అల్లర్లు అదుపులోకి రాకపోవ డానికి ఆందోళ నకారులకు ప్రభుత్వంలోని కొన్ని వర్గా లు మద్దతు ఇవ్వడమే కారణమన్న ఆరోపణలు వచ్చా యి.
ముఖ్యంగా కుకీ అనే జాతికి చెందిన వారు, అగ్రవర్ణా లకు చెందిన వారు హింసిస్తున్నందువల్లనే వారు రెచ్చి పోయి ఈ అల్లర్లకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చా యి. అయితే, మయితీ అనే అగ్రవర్ణాల వారే ఈ ఘర్షణల కొనసాగింపునకు కారణ మని తాజా సమాచారం. మణిపూర్ విషయంలో కేంద్రం అనుసరించిన ఉదాసీన వైఖరే పరిస్థితి క్షీణించడానికి కారణం. ఆదివాసీలు ఇప్పుడు ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌పైనా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం పైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అల్లర్ల నిందితులకు బిరేన్‌సింగ్ మద్దతు ఉందనీ, ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మొత్తం మీద కేంద్రంలో కదలిక వచ్చింది కనుక, మణిపూర్‌లో మంటలు త్వరలో చల్లార వచ్చు. మణిపూర్‌లో మూడు నెలల నుంచి ఇంటర్నెట్ సర్వీసు లేదు. ఘర్షణల వార్తలను నియంత్రించేందుకు అలా చేస్తున్నారు.ఈ కారణంగా మే 3వ తేదీన జరిగిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన ఫోటో ఆలస్యం గా వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి హెరేన్ దాస్ అనే వ్యక్తిని ముఖ కవళికలను బట్టి గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో అసలుదోషులను గుర్తించి అరెస్టు చేసేందుకు 77 బృందాలు పని చేస్తున్నాయి.