ఇజ్రాయెల్, పాలస్తీనా దళాల మధ్య సాగుతున్న పోరు అన్ని ప్రమాణాలు, నియమాలు, సంప్రదా యాలను దాటిపోయి ఉన్మాదం స్థాయికి చేరుకుంది. గాజాలోని అల్ అహ్లి ఆస్పత్రి ఆవరణలో సంభవించిన పేలుడుకు కారణం మీరంటే మీరని ఇజ్రాయెల్, పాలసీ ్తనాలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు సభ్య సమా జానికి వెగటు పుట్టిస్తున్నాయి. ఇజ్రాయెల్ తప్పేమీ లేదం టూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌లో కాలుపె డుతూనే కితాబు ఇచ్చేశారు. అగ్రరాజ్యానికి క్షణాల్లో సమాచారం అందుతుంది కనుక బైడెన్ నిజం చెబుతు న్నారనే అనుకుందాం. మరి ఈ ఘటనపై ప్రపంచ దేశా లు వ్యక్తం చేస్తున్న అనుమానాల మాటేమిటి? ఇజ్రా యెల్, అమెరికా మానస పుత్రిక కనుక అమెరికా ఇజ్రా యెల్ పక్షాన మాట్లాడటంలో ఆశ్ఛర్యం లేదు. ఈ పోరు లో ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్న దూకుడు, చేస్తున్న ప్రకట నలను పరిశీలించినవారు ఇది ఇజ్రాయెల్ పనేనని ఎటు వంటి సందేహం లేకుండా నమ్ముతున్నారు. ఈ ఘట నలో 471 మంది మరణించినట్లు చెబుతున్నారు. బాల లు, వృద్ధులు, స్త్రీలు చికిత్స పొందుతున్న ఆస్పత్రిని లక్ష్యం చేసుకుని నారింజ రంగు బంతిని ఎవరో దుర్మార్గు లు విసిరారు. అది పేలి మృతదేహాలు కకావికలమ య్యాయి. ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా దళాలు యుద్ధనీతిని పాటించకుండా చెలరేగిపోతున్నాయి.
ఇజ్రాయెల్‌ని అమెరికా, పాలస్తీనాను అరబ్ దేశాలు, చైనా, రష్యా ఉసిగొల్పుతున్నాయి. నిజానికి అది పూర్తిగా ఆంతరంగిక సమస్య. ఇరువర్గాల ప్రతినిధులు చర్చించు కుంటే పరిష్కారమయ్యే వివాదమే. సరిహద్దు సమస్య లు ఒక్క ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. అగ్గిమీద గుగ్గిలం వేసినట్లు అమెరికా, చైనా, రష్యా చెరొ వైపు రెచ్చగొట్టి మంటలు రేపుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ ఘర్షణ జరిగినా తగుదునమ్మా అంటూ అమెరికా తయారవుతుంది. పోనీ అగ్రరాజ్యం కదా! ఇరు పక్షాలను బుజ్జగించి సమస్యకు పరిష్కారం కను గొంటుందా! అంటే అదీ లేదు. ఇప్పటికి ఇలాంటి ఘట నలు ఎన్నింటిని చూశాం. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ ఇజ్రాయెల్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత బైడెన్ వచ్చారు. ఆయన ఏం నివేదిక ఇచ్చారో తెలియదు కానీ, ఇజ్రాయెల్‌లో కాలు పెడుతూనే తప్పంతా పాలస్తీ నదేనని తీర్పు ఇచ్చేశారు. హమాస్ దళాలు సరిహద్దుల్లో స్మశానం నుంచి జరిపిన రాకెట్ ప్రయోగం వల్లనే ఈ భారీ పేలుడు సంభవించిందని ఇజ్రాయెల్ సైన్యం అధి కార ప్రతినిధి డేనియల్ హగేరి ప్రకటించారు
. అయితే, తమ సేనలు ఆ ఆస్పత్రులను ఎన్నడూ ‘టార్గెట్’ చేయదని హమాస్ ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు. ఈ పేలుడులో మరణించినవారు, గాయపడినవారిలో ఎక్కువమంది పాలస్తీనియన్లే ఉన్నారన్న కథనాలు వచ్చాయి. బాంబు పేలుడు తీవ్రత, అది వచ్చిన మార్గం ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయని హమాస్ ప్రతినిధి తెలిపారు. మరోవంక ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగి స్తోంది. ఈ దాడుల్లో లెక్కలేనంతమంది మరణించారు. మరెంతోమంది గాయడ్డారు. ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ప్రబుత్వ నాయకులే కాకుండా సైనిక దళాల ప్రతినిధుల ప్రకటనలు దీనినే తెలియ జేసు ్తన్నాయి. గాజా పట్టీలో ధ్వంసమైన వాహనాలు, తెగిన పడిన మానవ శరీర భాగాలు ఎటు చూసినా కనిపి స్తున్నా యి. రష్యా అధ్యక్షుడ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స మావేశమై సుదీర్ఘంగా చర్చించారు. రహస్య విష యాలు మాట్లాడుకున్నామంటూ పుతిన్ చేసిన ప్రకటన జుగుప్స కలిగించింది.
ఒకవంక పశ్ఛిమాసి యాలో మా రణ హోమం జరుగుతున్న సమయంలో బాధ్యతగల నాయకులు రహస్య విషయాలు మాట్లా డుకోవడం ఏమిటని ప్రపంచ దేశాలు నివ్వెర పోతు న్నాయి. ఈ చర్చలు బీజింగ్‌లోని గ్రేట్ హాల్లో జరి గాయి. వీరిద్దరూ ఈ ఏడాది కలుసుకోవడం ఇది రెండవసారి. ఇద్దరూ ఉన్మాదులే కనుక ఇజ్రాయెల్ ఉన్నాదం వారికి పట్టలేదు. పుతిన్ ఉక్రెయిన్‌పై 20 మాసాలుగా జరుపుతున్న దా డుల వల్ల సాధించేమిటి? అలాగే, జిన్‌పింగ్ దక్షిణ చైనా సముద్రంలో కలకలాన్ని సృష్టించి సాధిస్తున్న దేమిటి? తైవాన్, హాంకాంగ్‌లను నిరంతరం వేధిస్తు చైనా తన యుద్ధ ప్రీతిని బహిర్గతం చేసుకుంటోంది.
గాజా ఆస్పత్రిపై దాడి విషయమై మన ప్రధాని నరేంద్ర మోడీ చాలా తీవ్రంగానే స్పందించారు. పౌరుల మరణాలకు, యుద్ధానికి బాధ్యులైన దేశాలే ఈ దుర్ఘట నకు బాధ్యత వహించాలని, ఆ ఘటన మానవాళికే మా యనిమచ్చ అని అన్నారు. ఏ ఘర్షణ లలోనైనా పౌరులు మరణించడాన్ని ఎవరూ సహిం చ రనీ, ఇది పైశా చికమైన చర్య అని అన్నారు. ఇజ్రాయెల్ రాయబారి నోర్ గిలాన్ మాత్రం పాలస్తీనాదే బాధ్యత అంటూ ఒక వీడి యోను విడుదల చేశారు.ఎవరి వాద నను వారు చెప్పు కుంటున్నప్పటికీ పౌరుల మర ణాలకు ఇరు వైపు లవారూ బాధ్యత వహించాల్సిందే. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగుతుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు చేసిన ప్రకటన ఆందోళన కలిగించేదే.