Tuesday, November 26, 2024

Editorial …. వెన‌క్కి త‌గ్గితే ప‌రువేం పోదు

యుద్ధోన్మాదం తలకెక్కితే నియమ నిబంధనలు, ప్రమాణాలు గాలిలో కలిసిపోతాయని గాజా ప్రాంతం లో పరిస్థితి తేటతెల్లం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించిన హమాస్‌ ఇజ్రాయెల్‌ ఇంతలా విరుచుకుని పడుతుందని ఊహించి ఉండకపోవచ్చు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి, కొరివితో తలగోక్కున్న చందంగా తయా రైంది. ఇజ్రాయెల్‌కి దన్నుగా అమెరికా తన అస్త్రాల న్నింటినీ ప్రయోగిస్తోంది. నేరుగా కాకుండా ఇజ్రాయెల్‌ దళాల ద్వారా ఆయుధాల తీటను తీర్చుకుంటోంది. ఈ రణరంగంలో ఎవరు సురక్షితంగా బయటపడతారో చె ప్పలేని పరిస్థితి ఏర్పడింది. దళాల విషయాన్ని పరిశీలిస్తే హమాస్‌కన్నా ఇజ్రాయెలీ దళాల సంఖ్యే అత్యధికం. ఇజ్రాయెల్‌ తన దేశంలోని 3 లక్షల మంది రిజర్విస్టులను గాజా సరిహద్దుకు తరలించింది. అంతేగాక, 1,70,000 మంది నిైకులను తరలించింది. హమాస్‌కి చెందిన ఫైటర్లు 30 వేలమంది వరకూ ఉన్నారు. వారి బలగం రిజర్విస్టు బలగాలలో పది శాతం మంది మాత్రమే. ఏవి ధంగా చూసుకున్నా హమాస్‌ దళాలు పరిమితంగానే ఉన్నాయి. అయితే, లెబనాన్‌కి చెందిన హిజ్బొల్లా దళా లు హమాస్‌కి మద్దతుగా ఏ క్షణంలోనైనా రంగంలోకి ది గేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఇజ్రాయెల్‌, ఇటు హమాస్‌ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించడం లేదు. అంతకంతకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరువైపులా వారు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడులవల్ల కొత్త రోగాలు ప్రబలుతున్నాయి. ఈ దాడుల్లో అనేక ఆస్పత్రులు నేల మట్ట మయ్యాయి. విద్యుత్‌, నీరు సరఫరా నిలిచి పోవ డంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇజ్రా యెల్‌కి ఉన్న వివిధ దళాలు ఆ దేశపు రక్షణ రంగానికి అభేద్యంగా ఉన్నాయి. అలాగే హమాస్‌ దళాలు సొరం గాల్లో దాక్కొని ఇజ్రాయెలీ బాంబు దాడుల నుంచి తన సేన లను కాపాడుకుంటోంది. సామాన్యుల మ్యల గు రించి ఇరువైపులవారూ ఆలోచించడం లేదు. అయితే గా జా ప్రాంతంలో ఉన్న అత్యధిక జన సాంద్రత హమా స్‌ ఒక విధంగా ఉపయోగకరంగా ఉంది. ప్రజలను అడ్డుపెట్టు కుని హమాస్‌ దళాలు పోరాడుతున్నాయి.


ఐక్యరాజ్య సమితి హెచ్చరించినప్పటికీ ఇజ్రాయెల్‌ లెక్క చేయడం లేదు. గాజా నుంచి లక్షలాదిమందిని తర లించడం అంత సామాన్యమైన విషయం కాదు. రష్యా కూడా ఈ విషయంలో అవకాశవాదాన్ని ప్రదర్శి స్తోంది. రష్యాకి ఇప్పుడు కావల్సింది ఉక్రెయిన్‌పై తాను జరిపిన దాడి నుంచి ప్రపంచ దేశాల కితాబు. అంటే ఉక్రె యిన్‌పై తాను జరిపిన దాడి సక్రమమైనదేనని ప్రపంచ దేశాలు ధ్రువీకరించాలి. హమాస్‌ ఉగ్రవాదుల మాది రిగా ఉక్రె యిన్‌ దళాలు తమ దేశంపై దాడికి ప్రయ త్నిసు ్తన్నాయని, ఆత్మరక్షణకోసం తాము దాడి జరిపామని చెప్పుకునేందుకు రష్యా తహతహలా డుతోంది. రష్యాకు అంతర్జాతీయంగా ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోయినా హమాస్‌, హిజ్బొల్లా వంటి తీవ్రవాద దళాల మద్దతుతో చెలరేగవచ్చని భావిస్తోంది| అమెరికా కూడా రష్యాకి వ్యతిరేకంగా ఇతర దేశాలను ఉసిగొల్పి రక్తపాతానికి ఆజ్యం పోస్తోంది.


ఇజ్రాయెల్‌ని సమర్థిస్తున్న దేశాల్లో కూడా ఏకా భిప్రాయం లేదు. ఇజ్రాయెల్‌ ఇంతవరకు జరిపిన దాడు లన్నీ హమాస్‌ తీవ్రవాదుల లక్ష్యంగా చేసుకునే. రెండు వైపులా నిప్పులు చెరుగుతుతన్న మారణా యుధాల వల్ల ఇజ్రాయెల్‌కే ఎక్కువ ప్రమాదకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌, గాజా ప్రాం తంలో ప్రభుత్వాన్ని కూల్చివేయగలదని, దాని స్థానే సైనిక పాలన తేగలదని, హమాస్‌ని ఓడించాలంటే గాజా లో మొత్తం జనాభాను అంతం చేయాల్సి ఉంటుందని, అది జరిగే పని కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాజాలో పరిస్థితులు అత్యంత దయనీ యంగా ఉన్నా యి. అక్కడ మానవతా సంక్షోభం తలెత్తుతోంది. బయ టినుంచి మందులు, మంచినీరు, ఔషధాలు, ఆహార పదార్థాలు రానివ్వకుండా ఇజ్రాయెల్‌ దిగ్బంధం చేసింది. ప్రస్తుతం లక్షలా దిమంది గాజావాసులు ఆకలితో అలమ టిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో గాజా ఒకటి. మా మూలు రోజుల్లోనే అక్కడ 8 లక్షల మంది ఐరాస శర ణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వారికి ప్రపం చ ఆహార సంస్థ అన్నపానీయాలు అందిస్తోంది. ప్రస్తు తం అక్కడ నిల్వలు అడుగంటాయి. తాజా పరిస్థితుల పట్ల ఐరాస, ప్రపంచ ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

తాజా వివరాల ప్రకారం 58 శాతం గాజా వాసులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మరో 29 శాతం మంది బతకలేని పరిస్థితుల్లోకి చేరారు. మంచి నీటి కొరతతో అక్కడి ప్రజలు విలవిలలా డుతు న్నారు. అంతర్జాతీయ సంస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. స్నానం మానేసి, ఆ నీటిని దాహార్తి తీర్చుకునే పరిస్థితి అక్కడ నెలకొంది. గాజా పట్టీలో 83 ప్రాంతాల్లో ఐరాస మానవతా సాయం అందిస్తోంది. ఆ శరణార్థి శిబిరా లపైనా ఇజ్రాయెల్‌ బాంబులు పడ్డాయి. పదుల సంఖ్య లో సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్ర వాదుల దాడిని సమర్థించలేం. కానీ, ఆ కారణంగా ఇజ్రాయెల్‌ దాడులు పరిధి దాటడం, నిర్బంధం పేరు తో సామాన్యులను ఆకలిదప్పులతో అలమటించేలా చేయడం మానవత్వం కాదు. అక్కడ జరుగు తున్న నరమేథాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలు అసహ్యిం చుకుంటున్నాయి. ఇంకా ఎక్కువ జన నష్టం జరిగితే ఇజ్రాయెల్‌ని ప్రపంచ దేశాలు క్షమించవు. ఇప్పటికైనా ఇజ్రాయెల్‌, హమాస్‌లు వాస్తవ పరిస్థితు లను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గడం అందరికీ మంచిది. వెనక్కి తగ్గితే పరువేం పోదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement