Monday, November 18, 2024

Editorial – ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త – ఓ ఎండ‌మావి…

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందు కు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాలన్న మరో మహత్తర యత్నానికి గండిపడింది. ప్రతిపక్షాల అనైక్యత ప్రధాని నరేంద్రమోడీ బలం అన్న వాస్తవం మరోసారి రుజువైం ది. ఇండియా పేరిట బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను ఎదుర్కోడానికి ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమి చీలుదారులు పట్టింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించడమే కాకుండా అవి పోటీ చేసే స్థానాల సంఖ్యను ప్రకటించేశాయి. ఇండియా కూటమి ఏర్పడి నాలుగు మాసాలు అయింది. ఈ కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ అయిష్టంగానే చేరింది. సమాజ్‌వాదీ పార్టీ నిజానికి ఉత్తరప్రదేశ్‌కే పరిమితమయ్యింది.

జాతీయ స్థాయిలో ప్రతిపత్తి కోసం ఆ పార్టీ వ్యవస్థాపకు డు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ కృషి చేశారు. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతు న్న మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కృషి చేస్తు న్నారు. సమాజ్‌వాదీ పార్టీ రైతుల పక్షాన పోరాడే పార్టీగా ముద్రపడింది. రామ్‌మనోహర్‌ లోహియా సిద్ధాంతాల కు ఆకర్షితులై ములాయంసింగ్‌ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతుల ఉద్యమం నడిపిన మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కి సన్నిహితునిగా ములాయంసింగ్‌ పనిచేశారు. మధ్యప్రదేశ్‌లో ఆయనకు పెద్దగా అనుచరగ ణం లేదు. అయినా పార్టీ శాఖను కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో బలమున్న చోట్ల అభ్యర్థులను నిలబెడు తూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పడు అఖిలేష్‌ కూడా అదే మార్గాన పయనిస్తున్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ ప్రధానమైనది. తెలంగాణా, మిజోరం, చత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి అంతగా బలం లేదు. రాజస్థాన్‌లో కొద్దో గొప్పో బలం ఉంది. అయితే ఇతర వెనుకబడిన కులాల ఓబీసీ ఓట్లపై ఆధారపడి సమాజ వాదీ పార్టీకి ములాయం ఒక పునాది ఏర్పాటు చేశారు. దానిని అఖిలేష్‌ కాపాడుకుంటూ వస్తున్నారు.

మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఓబీసీల ఓట్లను చిల్చేందుకు చాలా ప్రయత్నం జరిగింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ములాయంసింగ్‌ సోదరుడు శివపాల్‌సింగ్‌ని బీజేపీ పురికొల్పింది. అయితే బీజేపీతో పొసగక ఆయన తప్పుకు న్నారు. కాంగ్రెస్‌ ఇండియా కూటమిలో పెద్దన్నగా పాత్ర ను ఆశిస్తోంది. కూటమికి ఏ పార్టీ నేతృత్వం వహించాల నేది ఎన్నికల తర్వాత చూసుకోవచ్చన్న అంగీకారంతోనే ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. అయితే, యూపీ ఏ కూటమికి గతంలో నేతృత్వం వహించిన అనుభవా న్ని కలిగి ఉన్నందున ‘కాంగ్రెస్‌ వెనకటి గుణమేల మాను’ అన్న చందంగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లి కి తమ పార్టీ తొలి జాబితాగా 144 మంది పేర్లను ప్రకటించింది. దాంతో అఖిలేష్‌ యాదవ్‌ కాంగ్రెస్‌పై చిర్రుబుర్రులాడ టమే కాకుండా తొమ్మిది మంది పేర్లతో తొలి జాబితాను, 22 మందితో మరో జాబితాను ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు 18 స్థానాల్లో పోటీ పడను న్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌ తమ పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించి, అర్థరాత్రి దాటిన తర్వాత తమ పార్టీ అభ్యరుల జామితా ప్రకటించిందని అఖిలేష్‌ ఆరోపించారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చి న ఓట్ల వివరాలను బట్టి ఈసారి కూడా అవే సీట్లను కేటా యిస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిందని ఆరోపిం చారు. ఆరు సీట్ల విషయమై పరిశీలిస్తామని చెప్పి చివరికి అవికూడా ఇవ్వలేదన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌ నైజం తెలుసున్నం దువల్ల చర్యలకు వెళ్లకూడదనుకున్నామని, కానీ కాంగ్రె స్‌ రాష్ట్ర నాయకులు పట్టుపట్టడం వల్ల తమ పార్టీ నాయ కులు చర్చలకు వెళ్లారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ ధోరణి మొదటి నుంచీ పొత్తుకు విముఖంగానే ఉంది.. ఉత్తరప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన అజయ్‌రాయ్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్రం లోని 80 సీట్లకు పోటీ చేస్తుందని ముందే ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అతిరథ మహారథులైన నాయకులున్నారు. వారిమధ్య నాయకత్వ సమస్య ఉంది. గత అసెంబ్లి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీని చేజేతులా అధికారం నుంచి దించేసుకున్న ఘనులు అక్కడి నాయకులు. యువ నాయకత్వం దూసుకుని వస్తున్నా వృద్ధతరం నాయకులు పార్టీ పదవు ల కోసం పాకులాడటం వల్ల కాంగ్రెస్‌ విజయావకాశాల ను చేజేతులా పోగొట్టుకుంటున్నది.

దిగ్విజయ్‌ సింగ్‌, కమలనాథ్‌లు ఇప్పటికీ పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. కూటమిలో కాంగెస్‌ పెద్దన్నగారి పాత్ర వహించేందుకు ఈ నాయకులు తహతహలాడుతున్నా రు. సమాజ్‌వాదీ పార్టీ ఇందుకు ససేమిరా అంటోంది. జనతాదళ్‌(యు) నాయకుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చి మ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా కాంగ్రెస్‌ పెద్దన్నగారి ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. ఇండి యా కూటమి ఏర్పాటుకు పదనిసలకు అసలు కారణం అదే అయితే … బీజేపీని ఎలాగైనా సరే గద్దెదింపాలన్న లక్ష్యంతో వీరంతా కూటమిగా ఏర్పడ్డారు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐ దర్యాప్తు జరిపించడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ఎన్ని సమస్యలు న్నా కూటమి గొడుగులోకి రావడానికి ప్రధాన ప్రేరణ ఇదే . వీరిలో వీరికే పడకపోవడం కొత్త విషయం కాదు. అసలు జనతాపార్టీ ప్రయోగం విఫలం కావడానికి కూడా ప్రధాన కారణ, ఇదే. అప్పటికన్నా ఇప్పుడు వైషమ్యాలు పెరిగిపోయాయి. బీజేపీ పట్ల వీరికి ఎంత వ్యతిరేకత ఉన్నా స్వీయ అతిశయాల నాయకత్వ సమస్య వల్ల వీరు ఏకతాటిపై నిలవలేకపోతున్నారు. అ విషయం మరోసారి రుజువైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement