Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – ఎవ‌ర్ గివెన్ గుణ‌పాఠం

ఈజిప్టులోని సూయెజ్‌ కాలువలో అడ్డం తిరిగిన ఎవర్‌ గివెన్‌ భారీ కంటైనర్‌ నౌక కదలడంతో ఈజిప్టుప్రభుత్వమే కాకుండా, ప్రపంచదేశాలన్నీ ఊపిరి పీల్చుకు న్నాయి. నౌకా రవాణా సురక్షితమే కానీ, ప్రకృతిదయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. సముద్రంలో తుపానులు, సునామీల గండాలను దాటుకుని సాగాల్సి ఉంటుంది. సూయెజ్‌ కాలువ వ్యూహాత్మకంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించు కుంది. ఈజిప్టు గుండా ఆసియా, ఆఫ్రికాదేశాల మధ్య సరకుల రవాణా వారధిగా విశిష్టమైన సేవలందిస్తోంది. ఈ కాలువలో కంటైనర్‌ నౌక ప్రవేశించడమే అశ్చ ర్యం గొలిపే విషయం. గత మంగళవారం రాత్రి ఇసుక తుపానుకు ఈ నౌక గమ్యాన్ని కోల్పో యి ఇసుక, బంకమన్నులో కూరుకుని పోయింది. దీనిని కదిలించడానికి బ్రహ్మప్రయత్నమే జరిగింది.ఆ ప్రయత్నానికి పౌర్ణమి నాటి చంద్రుని ప్రకాశశక్తికి ఎగిసిపడినఅలలు దోహదం చేశాయి. ఇంత పెద్ద భారీ నౌక అడ్డం తిరగడం వల్ల 367 నౌకలు కదలలేదు. వీటి వల్ల చమురు, పశువుల సరఫరా స్తంభించిపోయింది. మామూలు నదులు, సముద్ర తీర ప్రాంతాల్లోనే నౌకలు,బార్జర్లు, స్తంభించి పోతే వాణిజ్యంబాగా దెబ్బతింటుంది.అలాంటిది ప్రపంచంలో విభిన్న ప్రాంతాలను కలిపే కాలువలోఈ మాదిరి స్తంభన వల్ల ఎన్నివేల కోట్ల డాలర్ల ఆదాయం దెబ్బతినిఉంటుందో ఊహించడమే కష్టం. ఈ కాలువ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందే ఈజిప్టు ప్రభుత్వానికి 710 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లినట్టు అంచనా. చమురు నౌకలన్నీ ఈ కాలువ గుండానే వెళ్తాయి.చమురు రవాణాలో ఆటంకాల వల్లనే చమురు ధరలు పెరుగుతున్నాయి. సముద్రంలో చమురు ట్యాంకర్లు లీక్‌ అయి, చమురు తెట్టులు ఏర్పడటం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. ఇరాన్‌, ఇరాక్‌ యుద్ధం సమయంలో ఈ కాలువ గుండా నౌకల ప్రయాణం ఉద్రిక్తతతో సాగింది.తమ నౌకలు సురక్షితంగా తిరిగి వచ్చేవరకూ ఆయా దేశాలు ఉత్కంఠతో ఎదురు చూసేవి. ఏ సమయం లో ఏ నౌక మునిగి పోతుందోనన్నభయాందోళనలు నెలకొని ఉండేవి. నౌకలను ముంచేసే ప్రయత్నాలు కూడా అప్పట్లో జరిగాయి.అమెరికా,రష్యాల ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో ఈ కాలువపై రాజకీయాలు వాడిగా, వేడిగా ఉండేవి.ప్రజల సంక్షేమం,సౌభ్రాతత్వాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలను తీసుకోవల్సిన దేశాలు తమ ప్రతిష్ట కోసం ఈ కాలువ ద్వారా సాగే వ్యాపారాలను అడ్డు కోవడంపై దృష్టి పెట్టేవి.గత ఏడాది కరోనా కారణంగా జలమార్గం ద్వారా వాణిజ్యానికి బాగా నష్టం వాటిల్లింది.ఈఏడాది ఈ భారీ నౌక దిగబడి పోవడం వల్ల ఆరు రోజులు నౌకలు స్తంభించి పోయి వివిధ దేశాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవ ల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నౌకా యానం గతంలోమాదిరిగా సాఫీగా, సజావుగా సాగడం లేదు. సోమాలియాప్రాంతంలో సముద్రపు దొంగల వల్ల నౌకా వాణిజ్యం బాగా దెబ్బతింటోంది. నౌకాసిబ్బంది ప్రాణాలకు హానిజరుగుతోంది. ఈ విధంగా మన దేశానికి చెందిన నౌకలు, నౌకా సిబ్బంది సముద్రపు దొంగల దాడులకు తరచూ గురిఅవుతున్నారు. ప్రపంచంలో పనామా, వోల్గా తదితర కాలువలు ఉన్నప్పటికీ సూయెజ్‌ కాలువ చాలా కీలక మైనప్రాంతంలో నెలకొని ఉన్నందునదాదాపు అన్నిదేశాల వాణిజ్య నౌకలూ ఈ కాలువ మీదుగా సరకులరవాణా చేస్తుంటాయి.జ ల రవాణా చౌకగా జరుగుతుంది.ఎక్కువ రోజులు పట్టినట్టు కనిపించినా సజావుగా, సాఫీగా సాగుతే లాభదాయకమైనది. ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్‌ వారి కాలంలో బకింగ్‌ హమ్‌ కాలువద్వారా జలమార్గాల ద్వారా సరకుల రవాణా జరిగేది.జలమార్గాల ద్వారా రవాణావల్ల ధూళి, కాలుష్యాలనునివారించవచ్చని నిపుణులు సూచించారు. ప్రఖ్యాత ఇంజనీర్‌ డాక్టర్‌ కెఎల్‌ రావు బకింగ్‌ కాలువ పునరుద్ధరణ కోసం కేంద్ర ఇరిగేషన్‌ శాఖమంత్రిగా చాలా కృషి చేశారు. ఆయన కృషి ఫలించి ఉంటే జలమార్గాల ద్వాిరా రవాణా ఆంధ్రప్రదేశ్‌కి గొప్పవరం అయి ఉండేది. విజయవాడలో ఏలూరు కాలువ కు గోదావరికాలువ అనుసంధానం ఈ ఆలోచనలోంచే పుట్టుకొచ్చింది. జలమార్గాల ద్వారా సరకుల రవాణావల్ల లాభాలు ఉన్నట్టే, ఇలాంటిఘటనలు అనుభవంలోకి వచ్చిన ప్పుడు నష్టాలుకూడాఉన్నట్టు కనిపిస్తుంది,రోడ్లపై మానవలోపంవల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎవర్‌ గివెన్‌ పరిణామాలు మానవజాతికి గుణపాఠాలే.

Advertisement

తాజా వార్తలు

Advertisement