భారత్ పొరుగున ఉన్న దేశాలపై చైనా కన్ను వేసిం దనే విషయం గతంలో శ్రీలంక సముద్ర జలాల్లోకి గూఢ చార నౌకను పంపడంలోనే అవగతమైంది. భారత్‌ని ఏదో విధంగా కలవర పెట్టాలన్న చైనా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు మన దేశం తిప్పి కొడుతోంది. అరుణా చల్ ప్రదేశ్‌లోనూ, లడఖ్ సమీపంలోని ప్యాంగ్యాంగ్ లోనూ అనధికార ఆక్రమణలు, నిర్మాణాలు జరిపిన చైనా ఇప్పుడు జల మార్గాల ద్వారా కూడా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మనకి శత్రు దేశం గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్లో కరాచీ హార్బర్లో చైనా నౌకలు, జలాంతర్గామి దర్శనమివ్వడంతో మన దేశంతో కయ్యానికి కాలుదువ్వుతోందనే విషయం స్పష్టం అవు తోంది. అయితే, చైనా-పాక్‌ల మధ్య భారీ స్థాయిలో నౌకా దళ సీ-3 గార్డియన్ విన్యాసాలు జరుగుతున్న సందర్బా éన్ని పురస్కరించుకుని చైనాకి చెందిన నౌకలు కరాచీ రేవు సమీపంలోకి వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.
సముద్ర తీరంలో పొంచి ఉన్న ముప్పునకు ప్రతిస్పందనగా ఈ విన్యాసాలు చేపట్టినట్టు చైనా చెబుతున్న కారణాలు హేతుబద్ధంగా లేవు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, సంప్రదాయ స్నేహాలను ఏకీకృతం చేయ డానికి ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్టు చైనా నమ్మ బలుకుతోంది చైనా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనే విషయం దాని గత చరిత్రను బట్టి స్పష్టం అవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొం టున్నట్టు వియత్నాం, ఫిలిప్పీన్స్, స్పార్ట్లీ ద్వీపాలు ఇప్ప టికే ఫిర్యాదు చేశాయి. ఈ ద్వీపాల్లోని అమూల్యమైన ఖనిజాలను దోచుకోవడానికే దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ కన్నువేసింది. అలాగే, మన సరిహద్దుల్లో చొర బాట్లను పెంచి భారత్‌ని ఏదో విధంగా కవ్వించే ప్రయత్నం చేస్తోంది.
చైనా పోకడలను గమనిస్తున్న మన దేశం ఎంతో సంయమనాన్నీ, సహనాన్నీ ప్రదర్శిస్తోంది. శ్రీలంక సమీపంలోకి గూఢచార నౌకను పంపడంలో చైనా దురుద్దేశ్యం స్పష్టం అయింది. కొలంబో సమీపంలోని హంబన్ టోటా రేవు అభివృద్ది కోసం చైనా కంపెనీలు అందించిన సాయం శ్రీలంకను రుణం ఊబి లోకి నెట్టాయి. పాకిస్తాన్‌కి సాయం అందించడం నెపం తో చైనా పాకిస్తాన్‌లోని గ్వాదర్ రేవు అభివృద్ధి పేరిట కాలు మోపింది. సాయం అందించే కారణంతో ఇరాన్ నుంచి మన దేశానికి ఇంధనం సరఫరాకు మోకాలడ్డిం ది. చైనా ఏదో ఒక దురుద్దేశ్యంతోనే మన పొరుగు దేశాలకు సాయం అందిస్తోందన్న సంగతి తాజాగా ఇప్పుడు భూటాన్‌కి సాయం అందించడంలో తేటతెల్లం అవుతోంది. భూటాన్ మన కు పొరుగుదేశమే కాదు, ఆప్త దేశం. భూటాన్‌తో మన దేశానికి సైనిక బంధం ఉంది. దానిని పురస్కరించుకునే మూడు సంవత్సరాల క్రితం డోక్లామ్‌లో భూటాన్ సరిహద్దులను దాటి వెళ్ళేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. అప్పుడు భూటాన్ అభ్యర్థనపై మన సైనికులు అడ్డుగా నిలిచారు.
చైనా ఆగడాల గురించి చెప్పాల్సి వస్తే పెద్ద గ్రంథమే అవుతుం ది. వెనకటి అనుభవాల దృష్ట్యానే చైనా నౌకలు, జలాంత ర్గామి కరాచీ రేవు సమీపంలోకి రావడంతో మనదేశం ఆందోళనకు గురి అవుతోంది. గత సంవత్సరం చైనాకి చెందిన గూఢచార నౌకలు హిందూ మహాసముద్రంలో దర్శనమిచ్చాయి. కరాచీ రేవు సమీపంలో లంగరు వేసిన జలాంతర్గామి టైప్ 039 ఎలక్ట్రిక్ సబ్ మెరైన్. ఈ జలాం తర్గామి ద్వారా సుదూర ప్రాంతాలలో నౌకల సమాచారా న్ని తెలుసుకోవచ్చు. అరేబియా సముద్రంలోని నౌకల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తమ రేవులకు వేల కిలోమీటర్ల దూరంలో నౌకాదళ పరమైన ఆస్తులను కలిగి ఉండాలన్న చైనా ఆకాంక్ష దీనిని బట్టి వెల్లడవుతోం ది. గతంలో అమెరికాకి చెందిన నౌకలు, జలాంతర్గాము లు హిందూ మహాసముద్రంలో ప్రవేశించినప్పుడు మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా, చైనా, బ్రిటన్లు అండగా నిలవగా, రష్యా మనకు తోడ్పాటునందించిం ది. ఇప్పుడు రష్యా పాకిస్తాన్‌తో కొత్త స్నేహం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. అందువల్ల పాకిస్తాన్ జలాంత ర్గామిని నిలువరించేందుకు అమెరికా సాయం అవస రం.
రక్షణ రంగంలో భారత్, అమెరికాల మధ్య వ్యూహా త్మక భాగస్వామ్యం ఉన్నందున ఈసారి అమెరికా మన కు తోడ్పాటును అందించాల్సి ఉంది. అలాగే, ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు, చైనా అండగా నిలుస్తోంది. ఈ కారణంగా అమెరికాయే హిందూ మహా సముద్రంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు తోడ్పడాలి. అయితే, అమెరికాతో తగువు పెట్టుకోవడం చైనాకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో చైనా యుద్ధ నౌకల మోహరింపు బెదరింపులకు చిహ్నంగానే భావించాలి. చైనాకి వ్యతిరే కంగా క్వాడ్ ఏర్పాటులో మన దేశం కీలక పాత్ర వహిం చడం వల్లనే డ్రాగన్ దేశం మన దేశంపై కక్ష కట్టి ఉండ వచ్చు. ఏమైనా కరాచీ సమీపంలో యుద్ధ నౌకల మోహరింపు చైనా నుంచి మన దేశానికి ఏర్పడిన కొత్త ముప్పుగానే పరిగణించాలి.