Tuesday, November 26, 2024

Editorial – సిబిఐ ద‌ర్యాప్తుతో వేడి చ‌ల్లారుతుందా…?

మణిపూర్‌ కాకులు దూరని కారడవి కాదు. అక్కడ కుకీలు, ఇతర గిరిజన జాతులు దశాబ్దాలుగా అడవుల్లో గౌరవప్రదమైన జీవనాన్ని సాగిస్తున్నారు. వారి బతుకును వీధిన పడేసిన పాలకుల కారణంగానే ఇప్పుడు అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో లోకానికి తెలియనివ్వకుండా అంతర్జా లంపైనా, సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు విధిం చారు. దాంతో మే 3వ తేదీన అక్కడ ఏం జరిగిందో లోకానికి తెలియలేదు. మహిళలను నగ్నంగా ఊరేగిం చిన సంఘటనకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేసిన వ ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటనపైనే ఇప్పుడు సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. నిందితుడు అతడేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు జరిపించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ నిర్ణయం తీసుకోవడంలో విషయం అర్థమవుతుంది.

ప్రధాని నరేంద్రమోడీని అప్రదిష్టపాలు చేయడానికి ఈ వీడియో ని వైరల్‌ చేశారన్నది ఆయన ఆరోపణ. దీని వెనుక కుట్ర దాగున్నదనీ, ఇందుకు బాధ్యులెవరో నిగ్గు తేల్చేందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. అంటే హోం శాఖ అన్నమాట. పార్లమెంటులో రోజుల తరబడి సభల స్తంభన జరిగిన తర్వాత ఇంతకాలానికి ఆయన ఆ అఫిడవిట్‌లోని అంశాలను ప్రజలకు తెలియజేశారు. దీనిని బట్టి ప్రజల పట్ల ప్రభుత్వం ఎంత జవాబుదారీగా ఉంటోందో స్పష్టం అవుతోంది. భారత జాతి తలెత్తుకోలే ని సంఘటన జరిగినప్పుడు అటువంటి వాటిని నివా రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వివరించకుండా, ఎవరో కుట్ర చేయడం వల్లనే ఆ వీడియో బయటపడిందంటూ కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పడం ఎదురుదాడిగానే భావించాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న ఘటనలన్నింటికీ కారకులు బీజేపీకి చెందిన వారేనని మీడియాలో ఇప్పటి కే కథనాలు వెలువడ్డాయి.

వాటిని గురించి నిగ్గు తేల్చ కుండా, మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి వీడియోలను ఎవరో లీక్‌ చేస్తున్నారంటూ ఆరోపించడం, వారెవరో తేల్చేందుకే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామ నడం సమస్యను పక్కదారి పట్టించేందుకు కమలనాథు లు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోప ణలను కొట్టి పారేయలేం. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు అక్కడ జరిగిన ఘటనలపై కేంద్రం ఇంతవరకూ స్పష్టమై న ప్రకటన చేయలేదు. కేవలం జాతుల మధ్య కలహాలు గానే కేంద్రం పరిగణిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు మణిపూర్‌లో 1995 నుంచి జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నాగాలు-కుకీలూ, మెయితీలు – కుకీలు, మెయితీ- పంగల్‌, తదితర జాతుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అదే తీరులో ఇప్పుడూ జరుగుతుండవచ్చు. కేంద్రం ప్రకటన ప్రకారమే ఈసారి కూడా జాతుల మధ్య కలహాలను పూర్వపు ప్రభుత్వాలు ఎలా అణచివేశాయో అదే మాదిరి ప్రస్తుత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఘర్షణలున పెద్దవై ఉండేవి కావు. ఇదే విషయాన్ని శాంతిభద్రతలను కోరే వారంతా స్పష్టం చేస్తున్నారు.

గడిచిన నాలుగైదు నెలల నుంచి ఈ విషయ మై చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు మోడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరో చేస్తున్నారనడం కప్పదాటు వ్యవహారమే. మోడీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారని కమలనాథులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి నాయకుణ్ణి ఒక మారుమూల రాష్ట్రంలో జరిగిన ఊరేగింపు వీడియోని లీక్‌ చేయడం వల్ల బద్నామ్‌ చేయడం సాధ్యమా? ఒక వేళ ఎవరైనా చేస్తే జనం నమ్ముతారా? పైగా మణిపూర్‌ వాసులకు మోడీ ఎన్నో తాయిలాలు ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అటు వంటి రాష్ట్రంలో ప్రజలు ఎంత కృతజ్ఞతతో ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు మణిపూర్‌ వెళ్ళి పనిగట్టుకుని అటువంటి ఊరేగింపుల ను నిర్వహిస్తే అక్కడి వారు ఊరుకుంటారా? మణిపూర్‌ లోనే కాకుండా, ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ చేయనంత సాయాన్ని మోడీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు, అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు బయటి వారెవరో వచ్చి కుట్ర లు చేయడానికి అవకాశం ఎక్కడుంది? దీనిపై సందేహా లను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రకటన చేయాలని కోరుతున్న డిమాండ్‌కి సమాధానంగా కేంద్ర హోం మంత్రి ఈ ప్రకటన చేసి ఈ సమస్యపై వేడిని చల్లార్చడం కోసమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని జనం అనుకుంటే తప్పు పట్టగలరా?

Advertisement

తాజా వార్తలు

Advertisement