Tuesday, November 26, 2024

Editorial – అమిత్ షా విశ్వ‌రూపం…

అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండో రోజు పతాక స్థాయికి చేరింది. తొలి రోజు కాంగ్రెస్‌ తరఫున చర్చను ప్రారంభిస్తారనుకున్న ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ రెండవ రోజైన బుధవారం మాట్లాడారు. దాదా పు నలభై నిమిషాల ప్రసంగంలో ఆయన చేసిన ఆవేశ పూరిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా భారతమాతను మణిపూర్‌లో ప్రభుత్వం హత్య చేసిందని ఆయన పదేపదే నొక్కి వక్కాణించిన సం దర్భాల్లో సభలో ఉభయపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సుదీర్ఘ ప్రసంగంలో చాలా విషయాల మీద స్పష్టత వచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వం నోరుమెదపని కారణంగా, మణిపూర్‌కి సంబంధించి ప్రభుత్వం ఏమి చేస్తున్నది? దాని వ్యూహం ఏమిటి? ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏమిటి అన్న అంశాలు ఏ మాత్రం బయటికి తెలియని పరిస్థి తుల్లో అమిత్‌ షా దాదాపు అంతా తేటతెల్లం చేశారు. ఎం తగా అంటే… గురువారం ప్రధాని నరేంద్రమోడీ తన సమాధానంలో చెప్పడానికి ఏముందన్నంతగా అమిత్‌ షా అనేక అంశాలను ప్రస్తావించారు. మణిపూర్‌ ఘటన సిగ్గుచేటే, ఒప్పుకుంటున్నాం…. కానీ దానిని రాజకీయం చేయడం మరీ సిగ్గు చేటని అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరిస్తూనే, ప్రతిపక్షం పాత్రను తప్పు పట్టారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మణిపూర్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందంటూ ప్రధానమంత్రి మోడీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ,ముఖ్యంగా మౌలిక సదుపాయాలను పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వ మూ ఈ ప్రాంతంలో విమానాశ్రయాల ఏర్పాటుపై శ్రద్ధ తీసుకోలేదనీ, మోడీ ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టున్నారనీ, కమ్యూనికేషన్‌ నెట్‌ వర్క్‌ని విస్తరింప జయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. అన్యాపదేశంగా రాహుల్‌ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మణిపూర్‌ ఘటనల నుంచి రాజకీయ లబ్ధి పొందాలన్న యావ తప్ప అక్కడి ప్రజల బాగోగుల గురించి కాంగ్రెస్‌ ఎన్నడూ ఆలోచించ లేదని విమర్శించారు. ఒక్క మణిపూర్‌ గురించే కాకుండా మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని గురించి ఆయన పనిలోపనిగా స్థూలంగా వివరించారు. పదహారు దేశాల్లో మోడీ ప్రత్యేక గౌరవాన్ని పొందారనీ, అంతర్జాతీయంగా భారత్‌ ఎంతో మంచి పేరును సంపాదించుకుందని అన్నారు. వచ్చే ఐదేళ్ళల్లో భారత్‌ తృతీయ ఆర్థిక శక్తిగా అవతరించగలదని చెప్పారు. రుణ మాఫీ కన్నా, రైతుల ఆర్థిక శక్తిని మెరుగు పర్చేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.

ఉచితాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీ ర్మానా లను ప్రవేశపెట్టడం కొత్త కాదనీ, అది వాటి హక్కు అనీ, అంటూ అలనాడు పీవీ నరసింహారావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో ఆనాటి ప్రభుత్వం అడ్డదారులుతొక్కిందనీ,తమ పార్టీకి చెందిన వాజ్‌పేయి ప్రభుత్వంపై ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానం నెగ్గినా, తీర్పును తమ పార్టీ శిరసావహించిందని అమిత్‌ షా అన్నారు. మణిపూర్‌ ఘటనలను అడ్డు పెట్టుకుని పార్లమెంటును స్తంభింపజేయడం, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం ప్రతిపక్షాల వక్రమార్గానికి నిదర్శనమని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉందనీ, ప్రతిపక్షాల పట్ల ప్రజలకు విశ్వాసం లేదని ఆయన స్పష్టం చేశారు.

మణిపూర్‌ మయన్మార్‌ సరిహద్దుల్లో ఉండటం వల్ల పొరుగుదేశం నుంచి చొరబాట్లు సహజమనీ, దానిని నిరోధించడానికి తమ ప్రభుత్వం గుర్తింపు కార్డుల ప్రక్రియను వేగవంతం చేసిందని అమిత్‌ షా చెప్పారు. ఏ విధంగా చూసుకున్నా ఈశాన్య రాష్ట్రాలకు తాము గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా చేస్తున్నామని ఆయన గణాంకాలతో సహా వివరించారు. అధికారం లోకి రావాలన్న యావ తప్ప ప్రతిపక్షాలకు దిశ,దశ లేదని ఆయన ఘాటైౖెన పదజాలంతో విమర్శించారు.
అవిశ్వాస తీర్మానాలంటే తమ ప్రభుత్వానికి భయం లేదనీ, ఇప్పటికి 27 తీర్మానాలను ఎదుర్కొందని అమిత్‌ షా స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాల హక్కుగా భావిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అమలు జేస్తు న్నామని అమిత్‌ షా గర్వంగాప్రకటించారు. దేశం కోసం ప్రధాని మోడీ గతంలో ఎవరూ చేయనివిధంగా కష్టప డుతున్నారని, తమ ప్రభుత్వం పట్ల ప్రజలకు పరిపూర్ణ విశ్వాసం ఉందని ఆయన ధీమాగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement