Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – బంగ్లాతో బంధం ప‌టిష్టం…

క‌రోనా తర్వాత తొలిసారిగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ అవతరణస్వర్ణోత్సవ కార్య క్రమాలకు హాజరయ్యేందుకు ఢాకా వెళ్ళే ముందు ఆయన తన అభిప్రాయాలను ఒక వ్యాసంలో పొందుపర్చారు. బంగ్లాదేశ్‌ నిర్మాత, వంగబంధు షేక్‌ ముజిబ్‌ వూర్‌ రెహమాన్‌ను ప్రశంసిస్తూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. ముజిబ్‌ హత్యకు గురి కాకుండాఉంటే భారత ఉపఖండంలో పరిస్థితిచాలా భిన్నంగా ఉండేదన్న మోడీ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తారు. ఎందుకంటే, ఆయనే చెప్పినట్టు ముజిబ్‌ హత్యానంతరం ఉపఖండంలో ఎన్నో అవాంఛనీయ పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా, పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి ఉండేది కాదు.అలాగే, ఉల్ఫా తీవ్రవాదులకు బంగ్లాదేశ్‌ షెల్టర్‌ జోన్‌ అయి ఉండేది కాదు.ఈ ఉగ్రవాద సంస్థల దాడుల వల్ల భారత్‌ ఎంతో నష్టపోయింది.పాకిస్తాన్‌ ఇప్పుడిప్పుడే దారి లోకి వస్తోంది.అది ఎంత కాలం సంయమనాన్ని పాటిస్తుందో తెలియదు. అలాగే, అసోం లో ప్రభుత్వం మారిన తర్వాత ఉల్ఫా తీవ్రవాదులకు గతంలో మాదిరిగా ఆశ్రయం లభించ డం లేదు.ముజిబ్‌ వంటి ప్రజాస్వామ్య వాది ఉండి ఉంటే చైనా సైతం అంత దూకుడును ప్రదర్శించి ఉండేది కాదేమో.అంతేకాకుండా, ముజిబ్‌ హత్య తర్వాత బంగ్లాలో అధికారా న్ని చేపట్టిన వారంతా భారత్‌ వ్యతిరేక వైఖరిని అనుసరించారు.ప్రస్తుతం ముజిబ్‌ కుమార్తె షేక్‌ హసీనా మాత్రం తండ్రి అడుగుజాడల్లో భారత్‌తో సుస్థిరమైన మైత్రిని కోరుకుంటున్నా రు. అసలుఆనాడు భారత్‌లో అధికారంలో ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే తూర్పుబెంగాల్‌ ప్రాంతమైన బంగ్లాదేశ్‌ను భారత్‌లో ఒక రాష్ట్రంగా చేసేందుకు ముజిబ్‌ సమ్మతించి ఉండేవారెమోనని బంగ్లాదేశ్‌ రచయిత ఒకరు ఇటీవల ఒక వ్యాసంలో పేర్కొన్న విషయం వాస్తవానికి దగ్గరగా ఉంది. కొత్త దేశం అవతరణతో ఏర్పడే సమస్యలను ఎదుర్కో వడానికి భారత్‌ వంటి వర్ధమాన దేశం సహాయసహకారాలు చాలా అవసరం. అయితే, బంగ్లాదేశ్‌లో పాక్‌ అనుకూల వర్గాలు జరిపిన కుట్రకు ముజిబ్‌ కుటుంబం బలైంది.ఆ సమయంలో షేక్‌ హసీనా, ఆమె సోదరి రెహనా విదేశీ పర్యటనలో ఉండటంవల్ల బతికి పోయారు. బంగ్లాదేశ్‌తో మనకున్న సమస్యలన్నీ అంతర్గతమైనవే. ముఖ్యంగా, గంగా జలాల పంపిణీ,సరిహద్దుల్లో ఆక్రమణలు, విదేశీయుల చొరబాట్లు వంటివి పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవల్సిన సమస్యలు.ఇరుదేశాల్లో భావసారూప్యంగల ప్రభుత్వాలు ఉంటే ఎంతటి కఠినమైన సమస్యలైనా దూదిపింజల్లా ఎగిరిపోతాయి.బహుశా ఈ విష యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోడీ తన వ్యాసంలో ఆ ప్రస్తావన చేసి ఉంటారు. అంతేకాకుండా,జలమార్గాల ద్వారా సరకుల రవాణా తోఎన్నోజటిల మైన సమస్యలు తీరుతాయి. దుస్తులు,జౌళి ఉత్పత్తులను భారత్‌ మీదుగాబంగ్లాదేశ్‌ నేపాల్‌,శ్రీలంక వంటి పొరుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుండేది.అలాగే, భారత్‌లో ఉత్పత్తులను బంగ్లాదేశ్‌ మీదుగా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు పంపేందుకు వీలుండేది. అంతేకా కుండా, బంగాలీలు ఎంతో ప్రాణప్రదంగా భావించే భాషా సంస్కృతులవికాసానికి ఎన్నో అవకాశాలు ఉండేవి. భాషావికాసం, అధ్యయనం వంటి కేంద్రాలు మరిన్ని పెరగడానికి అవకాశం ఉండేది. ఇప్పటికీ ఇవి పని చేస్తున్నాయి. కానీ, షేక్‌ హసీనాకు ముందుప్రధానిగా ఉన్న యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా, అంతకు ముందు సైనిక పాలకుడు జనరల్‌ ఎర్షాద్‌ల హాయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్‌ నుంచి పౌరసత్వం లేని వారిని త్రిపుర, బెంగాల్‌, అసోంలలోకి ఆనాటి బంగ్లా ప్రభుత్వం పంపింది. దీని వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రి క్తతలు ఏర్పడ్డాయి. షేక్‌ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తొలగిపోవడమే కా కుండా, ఆరేళ్ళ క్రితం మోడీతో ఆమె జరిపిన చర్చల ఫలితంగా భూ సరిహద్దు వివాదం పరిష్కారం అయింది. బంగ్లాదేశ్‌ అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు మన ఆర్థికవిధానాలకు బాగా దగ్గరగా ఉన్నాయి. అలాగే, ఎగుమతుల ప్రోత్సాహంలో చిన్న సంస్థలకు ప్రాధాన్యం ఇస్తోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ నుంచి సహాయాన్ని ఆశిస్తోంది. మోడీ పర్యటన తో బంగ్లాదేశ్‌ తో బంధం మరింత బలడుతుందనడంలో అతిశయోక్తి లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement