Wednesday, November 6, 2024

Editorial : ఈవీఎంలపై ప్రతిసారీ అనుమానాలేనా

ఏ దైనా ఒక వ్యవస్థ స్థానే కొత్తదానిని ప్రవేశపెడితే దానిని గుడ్డిగా వ్యతిరేకించకూడదు.ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (ఈవీఎం)లను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు దాటింది.దానిపై ఇంకా అనుమానాలను వ్యక్తం చేయడంతగదు.ఈవీఎంలలో నమోదైన ఓట్లను సరిచూసుకోవడం (క్రాస్‌ చెక్‌) కోసం ప్రవేశపెట్టిన వీవీ ప్యాట్‌ల ద్వారా వచ్చిన స్లిప్‌లను వందశాతం లెక్కిం చాలన్న అభ్యర్ధనలను సుప్రీంకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది.

- Advertisement -

అనుమానాలతో వ్యవస్థనే కాలదన్నడం సరైనది కాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కౌంటింగ్‌ సమయంలో స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ యంత్రాలను వినియోగించాలన్న సూచ నను ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు చేసింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ప్రవేశపెట్టిన కొత్తలో అను మానాలు వ్యక్తం అయిన మాట నిజమే కానీ, ఇప్పటికి నాలుగు, ఐదు సార్లు వీటినే వినియోగించడం జరుగుతున్నప్పుడు ఇంకా అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యం కాదన్నది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. ఓటింగ్‌ వివరాల కోసం ప్రవేశపెట్టిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లను నూరు శాతం సరిచూడటం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంల పని తీరుపై సాంకేతిక నిపుణులచేత ఎన్నికల సంఘం గతంలో డిమాన్‌స్ట్రేషన్‌ చేయించింది. ఇప్పుడు మళ్ళీ చేయించింది. వారి అను మా నాలను నివృత్తి చేయడానికే వీవీ ప్యాట్‌ సిస్టమ్‌ని ప్రవేశపెట్టింది.

ఈవీఎంల స్థానే పాత బ్యాలెట్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆమధ్య దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈవీఎంలను తొలిసారిగా 1998లో ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యంత్రా లను చాలాకాలంగా ఉపయో గిస్తున్నారు. వీవీ ప్యాట్‌ లపై అరుణ్‌కుమార్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని వంద శాతం స్లిప్‌లను వంద శాతం సరిచూడటం కుదరదని కోర్టు స్పష్టం చేస్తూనే ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది.ఈవీఎంలలో సింబల్‌ లోడింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆ యూనిట్‌ని సీల్‌ చేసి 45 రోజుల పాటు భద్రపర్చాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఏడు రోజుల లోపుగా అభ్యర్ధు లు తమ అభ్యంతరాnలను తెలపాలనీ, అప్పుడు ఇంజనీర్ల బృందం ఈవిఎంలలో రికార్డయిన మెమరీని తనిఖీ చేయాలని కోర్టు ఆదే శించింది. ఇందు కయ్యే ఖర్చంతా అభ్యర్ధులు భరించా లని కూడా ఆదేశించింది. ట్యాంప రింగ్‌ జరిగితే ఆ ఖర్చులు తిరిగి ఇవ్వాలనికూడా ఆదేశించింది. ప్రస్తుతం ఓ అసెంబ్లిd నియోజకవర్గంలో ఐదు ఈవీఎం లలో ఓట్లను సరిచూస్తున్నారు. అలా కాకుండా మొత్తం ఈ వీఎంల లోని ఓట్లను సరిచూడాలని పిటిషనర్‌ కోరారు.అది సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పిటిషనర్‌ పిటిషన్‌ని కోర్టు తోసిపుచ్చింది.

అయితే, ప్రతి పార్టీ గుర్తుతో పాటు బార్‌ కోడ్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.
వివి ప్యాట్‌లపై సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంప దెబ్బ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానిం చారు.అయితే, గతంలో బీజేపీ కూడా ఈవీఎంల పని తీరును వ్యతిరేకించింది.దీనిపై ఆ పార్టీ నాయకుడు ఒకరు పెద్ద పుస్తకమే రాశారు.ఈ విఎంలను ప్రాంతీయ పార్టీల కన్నా, కాంగ్రెస్‌,బీజేపీలే పదే పదే వ్యతి రేకిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. రాజకీ యంగా తమకు లబ్ది కలిగితే ఆ వ్యవస్థను పొగడటం, వ్యతిరేక ఫలితాలు వస్తే విమర్శించడం ప్రధాన రాజకీయ పార్టీల తీరుగా కనిపిస్తున్నది. దీని వల్ల వాస్తవం ఏమిటో తెలియక ప్రజలు అనుమానాలకు గురి అవుతున్నారు.
ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అనుమానాలను వ్యక్తం చేయడం ఎన్నికల సంఘం ఈ యంత్రాలను నిపుణుల చేత డిమాన్‌స్ట్రేట్‌ చూపించి అనుమానాలు తీర్చడం జరుగుతోంది.అయినా ఎన్నికల ముందు ఇలాంటి పిటిషన్లుదాఖలు అవుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement