Sunday, November 3, 2024

Editorial : నిధుల పంపిణీ… సుప్రీం చెప్పే వరకూ ఆగాలా…

ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్రమూ,రాష్ట్రాలూ పోటీదా రులు కావు.రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.అసలు ఫెడరల్‌ వ్యవస్థ అం టేనే అది.కానీ, కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ రాష్ట్రాలు చాలా కాలంగా ఫిర్యాదుచేస్తున్నాయి. విసిగి వేసారినట్టు అవి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ కేరళ, తమి ళనాడు,కర్నాటక దాఖలు చేసిన పిటిషన్లను పురస్క రించుకుని కేంద్రానికి హితవచనాలతో సుప్రీంకోర్టు జ్ఞానబోధ చేసింది.

- Advertisement -

సుప్రీంకోర్టు చేత ఇలా చెప్పిం చుకోవడం కేంద్రానికి చిన్నతనమే. సాధారణ నిధుల విషయంలోనే కాకుండా, ప్రకృతివైపరీత్యాలు సంభ వించినప్పుడు ఇచ్చే నిధుల విషయంలోనూ కేంద్రం జాప్యం చేస్తోందని కేరళ ఫిర్యాదు చేసింది. కర్నాట కనుద్దేశించి కోర్టు ప్రధానమంత్రిని కలిసి నిధుల కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించింది. దానిపై కర్నాటక ప్రభుత్వం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఆరు మాసాల క్రితం ఢిల్లిd వెళ్ళి ప్రధానికి మహజరు సమర్పించిన సంగతిని గుర్తు చేసింది.ఒక వంక ప్రధానమంత్రి దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్ల కోసం ర్యాలీల్లో ప్రసంగిస్తున్న సమయంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. రాజ్యాంగంలోని సూత్రాల ప్రకారం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరగాల్సి ఉండగా,కేంద్రం వివక్ష చూపుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించడం శోచనీయం.

కర్నాటకకు కరవు నిధుల అంశం పార్లమెంటు కడపటి స మావేశాల్లో కూ డా ప్రస్తావనకు వచ్చింది. కర్నాటక కాంగ్రెస్‌ ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ సోద రుడు,కాంగ్రెస్‌ ఎంపీ డికే సురేష్‌ ఆగ్రహంతో ఊగి పోతూ విడిపోతేనే దక్షిణాదికి న్యాయం జరుగు తుందేమోనంటూ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారం రేపింది. ఆయన వ్యాఖ్యను ఖం డించడానికి కమలనా థులు జట్టుకట్టినట్టు ముందుకు వచ్చారు.ఆయన అలాంటి వ్యాఖ్య చేయడం పొరపాటే కానీ, అప్పటి నుం చి ఇంతవరకూ కేంద్రం నిధుల విష యంలో స్పందిం చలేదని కర్నాటక నాయకులు విమ ర్శిస్తున్నారు. అసలు కరవు నిధుల పంపిణీ విధానమే లోపభూయిష్టంగా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ విమ ర్శించారు.

కేంద్రమూ, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ అనేది ప్రణాళికా సం ఘం సూచనల మేరకు గతంలో జరిగేది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానే నీతి ఆయోగ్‌ అనే సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థకు ఉపాధ్యక్షు డు,ఇతరయంత్రాంగం ఉన్నా, కర్త,కర్మ,క్రియ అంతా ప్రధానే. ఆయన చెప్పినరీతిలోనే నిధుల కేటాయిం పు ,నిర్ణయాలు జరుగుతాయని విజయన్‌ ఆరోపించారు. కేరళకు రెండేళ్ళక్రితం సంబం భవించిన తుపాను నిధులు ఇంకా అందలేదన్నారు. తమ ఆర్థిక వ్యవస్థ వి ధ ్వంసానికి కేంద్రం కారణమవుతోందని ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తొలిముఖ్య మంత్రి కే చంద్రశేఖరరావు కూడా ఈ విషయంలో కేంద్రం అనుస రిస్తున్న విధానాన్ని గతం లో పలుమార్లు తప్పు పట్టారు. కేంద్రం కేవలం దక్షిణా దిరాష్ట్రాల పట్లే ఈ వివక్షను ఎందుకు చూపుతోందని కేరళ, కర్నాటక, తమిళనాడు ముఖ్య మంత్రులు ప్రశ్నిస్తు న్నారు.

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనె మోనంటూ వారే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ అంశం ప్రధాన రాజకీయాస్త్రంగామారింది. దీనిపై దక్షిణాది పర్యటనలో ప్రధాని వివరణలు ఇచ్చు కుంటూ ముం దుకు సాగుతున్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ దక్షిణాదికి చెందిన వారే అయినా ఆమె ఈ విషయంలో నిస్సహాయరాలుగా ఉన్నట్టు కనిపి స్తోంది. మోడీ తొలివిడత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహ రించిన అరుణ్‌జైట్లీ కూడా ఇదే మాదిరి నిస్స హాయతను ప్రకటించేవారు. వీరిద్దరూ రాజకీయంగా బలం లేని వారే. రాజ్యసభ ఎంపీలుగా కేంద్రంలో అత్యం త కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహించడంవీరిలో ఉమ్మ డిగా కనిపించే లక్షణం. అంతకుముందు యూ పీఏ ప్రభు త్వంలో కూడా చిదంబరం ఆర్థిక మంత్రిగా ద క్షిణా దికి చేసిందేమీ లేదు. ఎంపీల సంఖ్య,రాబడి దామాషాల ప్రకారం దక్షిణాదికి రావల్సినన్ని నిధులు రావడం లేదన్న ఫిర్యాదులు చాలా కాలంగా వినవస్తు న్నాయి. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని తమి ళనాడు, కేరళ సూటిగానే ఆరోపించాయి. ఈ పరి స్థితుల్లో వారి అసంతృప్తిని చల్లార్చాల్సిన బాధ్యత కేం ద్రంపై ఉంది. కనీసం ఎన్నికల ముందయినా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement