Saturday, November 23, 2024

జిన్‌పింగ్‌ ఉక్కిరిబిక్కిరి!

కరోనాని పూర్తిగా నిర్మూలించేందుకు చైనీస్‌ ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ విధానం పర్యవసానంగా అనేక నగరాల్లో లాక్‌డౌన్‌లు ప్రకటిం చారు. నిరవధిక లాక్‌డౌన్‌ల వల్ల ప్రజలు అనేక ఇబ్బం దులకు గురవుతున్నారు.వారిలో సహనం నశిం చింది.అందుకే, లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగిస్తు న్నారు. దేశాధ్యక్షునిగా జిన్‌పింగ్‌ మూడోసారి ఎన్నికైన రోజునే ఆయన ప్రయాణించే మార్గంలో జనం గుమిగూడి ఆందోళన సాగించారు.ఆందోళనలు మొదట తక్కు వస్థాయిలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దేశంలోని అన్ని నగరాలకూ విస్తరించాయి. ముఖ్యంగా విశ్వ విద్యాలయాలు,కాలేజీలు,ఇతర విద్యా సంస్థల్లో విద్యా ర్ధులు జీరో కోవిడ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తు న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిన్‌పింగ్‌కి వ్యతి రేకంగా ఆందోళనలు సాగిస్తున్నారు.జిన్‌జియాంగ్జీ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌ఖీలో అగ్ని ప్రమాదంలో పది మంది మరణించడంతో ఆందోళనలు మరింత తీవ్ర మయ్యాయి.లాక్‌ డౌన్‌ కారణంగా ఒక అపార్టు మెంటు లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల వ్యాపించిన మంటలను అగ్ని మాపక దళం వారు ఆర్పలేకపోవడం వల్లనే పది మంది మరణించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రావిన్స్‌ లోజనాభా కోటి మంది పైగా ఉండగా,వీరిలో మైనారిటీ వర్గానికి చెందిన వీగర్లే అత్యధికంగా ఉన్నారు.

లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాలు అందక చాలా మంది ఆకలి మంటలతో విలవిలాడుతున్నారనీ, లాక్‌డౌన్‌ వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్‌,మంచినీటి సరఫరా ఆగిపో యిం దనీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపి స్తున్నారు. 50 పైగా విద్యాలయాల్లో విద్యార్ధులు చదు వులకు స్వస్తి చెప్పి,జీరో కోవిడ్‌కి వ్యతిరేకంగా ఆందొళన సాగిస్తున్నారు.ఈ ఆందోళనలు 80వ దశకం చివరి భాగంలో తియాన్మన్‌ స్క్వేర్‌ వద్ద జరిగిన ఆందోళనలను గుర్తుచేస్తున్నాయని పాత తరం వారు చెబుతున్నారు. జిన్‌పింగ్‌ ప్రభుత్వం మరో వంక ఈ జీరో కోవిడ్‌ విధా నాన్ని సమర్థిస్తోంది.ఈ విధానం వల్ల సత్ఫలితాలు లభిస్తున్నాయనీ,దేశంలో పౌరల ప్రాణాలను నిలబెట్టేం దుకే కఠినమైన ఈ నిర్ణయాన్ని తీసుకోవల్సి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు.ప్రజల ఇబ్బందులు తమకు తెలుసుననీ,దేశ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పలేదని ఆయన అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు జేస్తున్నప్పటికీ, ఆదివారం ఒక్కరోజే 3,500 పైగా కేసులు నమోదు అయ్యాయని అధికార వర్గాలు తెలియ జేశాయి.కోవిడ్‌ మొదలైన తర్వాత ఇంత సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమమని ఆ వర్గాలు వివరించాయి.

చైనాలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, ఆమ్‌స్టర్‌ డామ్‌, డబ్లిన్‌,టొరంటో మొదలైన పెద్ద నగ రాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్న వారిని షాంఘై నగరంలో భద్రతాదళాలు చెదరగొట్టారు.కొందరిపై లాఠీ చార్జి జరిపారు.పశ్చిమ దేశాల మీడియా ఆందోళనలను రెచ్చగొడుతోందని చైనా అధికార వర్గాలు ఆరోపించాయి. ముఖ్యంగా, అమెరికా మీడియా పనిగట్టుకుని ఈ ఆందొళనల దృశ్యాలను పెద్దవి చేసి చూపిస్తోందని ఆ వర్గాలు ఆరోపించాయి.దీంతో విదేశీ జర్నలిస్టుల కోసం వేట మొదలైంది.కొంతమంది జర్నలిస్టులను ఇప్పటికే అరెస్టు చేశారు.ఒక జర్నలిస్టుకు బేడీలు వేసి తీసుకుని వెళ్లడంపై జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే, జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఇలాంటి ఆందోళనలను లెక్క చేయకుండా ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతోంది. రోడ్లపై ఆందోళనకారులను భద్రతా దళాలు చెదరి కొడుతున్నాయి.

- Advertisement -

భద్రతాదళాలు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌లను విద్యార్ధులు బద్దలు కొడుతున్నారు. ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీవార్షిక సమావేశం జరిగిన ప్రదేశానికి అతి చేరువలో వంతెనపై ట్రాఫిక్‌ని ఆందోళన కారులు అడ్డుకుంటున్నారు. బీజింగ్‌లో ఈ రహదారి చాలా ముఖ్యమైనది. జిన్‌పింగ్‌ తరచూ ఈ రహదారి గుండానే వెళ్తూ ఉంటారు.ఆయన కంటపడటం కోసమే వంతెనపై ఆయనకు వ్యతిరేకంగా గల నినాదాల బ్యానర్లను వేలాడదీశారు. జిన్‌పింగ్‌ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ మాదిరి నిరసన సెగ లను ఎదుర్కోవడం ఇదే ప్రథమం. జిన్‌పింగ్‌ అధికారం నుంచి వైదొలగాలంటూ ప్రదర్శకులు చేస్తున్న నినాదాలు ఆయన సన్నిహితులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిన్‌పింగ్‌ గతంలో పట్టువిడుపులను ప్రదర్శించేవారనీ, మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఎవరినీ, దేనినీ లెక్క చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి.ఈ ఆందోళనలతో ఆయన అధికార పీఠం కదలడం ఖాయ మని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement