Tuesday, November 26, 2024

కళ్లముందు కోర్టు విచారణ!

సుప్రీంకోర్టు చరిత్రలో మంగళవారం సువర్ణా ధ్యాయం ఆవిష్కృతం అయింది. కోర్టులో మూడు కేసుల విచారణ ప్రత్యక్ష ప్ర సారం జరిగింది, ఎనిమిది లక్షల మంది ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో ఇది శాశ్వతంగా గుర్తుండిపోయే ఘట్టమని కోర్టు పౌర సంబంధాల శాఖాధికారి అభివ ర్ణించిన దానిలో అత్యుక్తి లేదు. ప్రజాస్వామ్యంలో పార దర్శకతకు పెద్ద పీట వేయాలని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, దానిని ఆచరణలో చూపినప్పుడే ప్రజా స్వామ్యంసార్థకమైనట్టు. నాల్గేళ్ళ క్రితం ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఇప్పటికి అమలులోకి వచ్చినందుకు సంతోషిం చాల్సిందే. సుప్రీంకోర్టులో జరిగే విచారణ వివరాలు ప్రింట్‌ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలుస్తు న్నా, ప్రత్యక్ష ప్రసారాలను ప్రజలు వీక్షించే సదుపాయం కల్పించడం ముమ్మాటికీ ఆనందం కలిగించే విషయమే. పార్లమెంటు, అసెంబ్లిలలో జరిగే కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమైన కొత్తలో ఇలాగే అంతా ఆనం దిం చారు. అయితే, కాలక్రమంలో ఆ ప్రసారాల నిడివిలో అధికార పార్టీకి చెంది న సభ్యుల ప్రసంగాలూ, మంత్రుల ప్రసంగాలు ఎక్కువగా ఉంటున్నట్టు ప్రజల దృష్టికి వచ్చింది.

అయితే ఈ ప్రత్యక్ష ప్రసారాలపై నిర్ణయం తీసు కోవల్సింది సభాపతులు, సభల అధ్యక్షులు మాత్రమే. సాధారణంగా ఈ పదవుల్లో అధికార పార్టీకి చెందినవారే ఉంటున్నారు. గతంలో సభా పతి పదవికి ఎన్నికైన నాయకుడు తన మాతృసంస్థ అయిన రాజకీయపార్టీకి రాజీనామా చేసేవారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ నీలం సంజీవరెడ్డి ప్రవేశపెట్టిన ఈ సంప్రదాయాన్ని తదుపరి సభాధ్యక్షులు పాటించకపోవడం వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంది. సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మన దేశానికి చెందిన కులభూషణ్‌ జాదవ్‌కి పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ మన దేశం దాఖలు చేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని మన దేశంలో ఎంతో మంది వీక్షించారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష విచారణ సామాన్యునికి కోర్టులు అందుబాటులో ఉన్నాయన్న భావన సాకారానికి దోహదం చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన నాల్గేళ్లకైనా అది సాకారం కావడం హర్షణీయమని అన్నారు. కోర్టులో ఏం జరుగుతోం దనేది సామాన్యులకు తెలియాలంటే ఇదొక్కటే మార్గం. కోర్టుల్లో సాగే వాద, ప్రతివాదాలు మాతృభాషలో జర గాలన్న డిమాండ్‌ ఉంది. ఇటీవల రిటైరైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ విష యమై కొంత కృషి చేశారు.

మాతృభాషలో వాద, ప్రతి వాదాలు జరిగితే కక్షిదారులకు అనుమానాలు ఉండే అవ కాశం లేదని ఆయన తరచూ స్పష్టం చేస్తూండేవారు. సామా న్యుని చెంతకు వైద్య ,విద్య వంటి నినాదాలు ఎంత ప్రాచు ర్యాన్ని పొందాయో, ఇప్పుడు సామాన్యుని చెంతకు న్యాయం కూడా అంత ప్రాచుర్యం పొందేందుకు అవకా శం ఉంది. న్యాయం చేయడమే కాకుండా, న్యా యం జరిగినట్టు కూడా కనిపించాలన్న నానుడిని ఈ ప్రయ త్నం సాకారం చేస్తుంది. కోర్టుల్లో వాదోప వాదా లను ప్రత్యక్షంగా చూడటం వల్ల న్యాయ విచారణ ప్రక్రి య పట్ల సామాన్యులకు అవగాహన కలుగుతుంది. అపో హలు తొలగిపోతాయి. ఇలాంటి ప్రత్యక్ష్య విచారణ విధా నం మన దేశంలో గుజరాత్‌, ఒడిషా, కర్నాటక, హై కోర్టు లలో అమలులో ఉంది. ఇతర దేశాల విషయానికి వస్తే, అమెరికా, బ్రెజిల్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడా, ఆస్ట్రేలి యాలలో అమలులో ఉంది. ఇతర దేశాల్లో ప్రత్యక్ష విచా రణలపై కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. అటు వంటివి ఏమీ లేకుండా పటిష్టమైన చర్యలను మన సుప్రీంకోర్టు తీసుకుంటోంది. 2018లో స్వప్నిక్‌ త్రిపాఠీ కేసు విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయ మూర్తి ప్రత్యక్ష విచారణపై తీర్పు వెలువరించారు.

- Advertisement -

మంగళవారం నాడు సుప్రీంకోర్టులో మూడు రాజ్యాంగ ధర్మాసనాల్లో ప్రత్యక్ష విచారణ జరిగింది. ఈ బెంచ్‌లలో విచారణ జరిగిన కేసులన్నీ ముఖ్యమైనవే. ఆర్థికంగా వెనుకబాటు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశానికి సంబంధించిన కేసుపై ఈ పద్ధతి ద్వారానే విచారణ జరిపారు.ఈ కేసు దేశ వ్యాప్తంగా చర్చలకు తావివ్వడం వల్ల దీనిపై ప్రత్యక్ష విచారణ మంచిదే. అలాగే, మహా రాష్ట్రలో శివసేన వర్గాల కేసును కూడా మరో ధర్మాసనం ప్రత్యక్ష విచారణ జరిపింది.ఈ విచారణలను లాప్‌టాప్‌, కంప్యూటర్లులో వీక్షించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సర్వర్‌ని ఏర్పాటు చేస్తున్నారు. పాల నలో పారదర్శకత అనే పదానికి నిర్వచనాన్ని ఇస్తున్న ఈ ప్రత్యక్ష విచారణ విధానం విజయవంతం కావడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది శుభపరిణామమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement