వంటనూనెల్లో ఇప్పుడు రిఫైన్‌డ్ ఆయిల్ వాడకం ఎక్కువైంది. అయితే…రిఫైన్డ్ ఆయిల్ అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిఫైన్డ్ ఆయిల్ తయారుచేసే ప్రక్రియలో పెట్రో లియం ఉత్పత్తి అయిన ‘హెగ్జానే’ అనే పదార్థాన్ని వాడుతున్నారు. సులభంగా నూనె తీయడానికి, దాని మరిగే ఉష్ణోగ్రత స్థాయిని తగ్గించడానికి(63-69 డిగ్రీల సెంటీగ్రేడ్) ఈ ‘హెగ్జానే’ను వాడుతున్నారు. హెగ్జానేతోనే సరిపెట్ట కుండా ప్రమాద కరమైన రసాయినాలు, డీగమ్మిం గ్ ఏజెంట్లను, కాస్టిక్ సోడా, ఆవ్లూలు కూడా కలుపు తారని తెలుస్తోంది. చాలా రిఫైనరీల్లోఉష్ణోగ్రత దాదాపు 230 సెట్రీగ్రేడ్ వరకూ ఉంటుంది. నూనె గింజలను, నట్‌లు ఇలా ఎక్కువవేడిమి వద్ద కరిగిస్తే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయని చెబు తున్నారు. అంతేకాకుండా ఈ నూనెకు ఫ్లేవర్‌లను కలుపి… రుచి తీసుకొస్తున్నారు. ఇలాంటి నూనెలు వినియోగానికి అసలు పనికిరావు.
ఈ నూనెలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తే ద్రవరూప ప్లాస్టిక్‌గా మారుతాయి. రిఫైన్డ్ ఆయిల్ లో వేయించిన ఆహారపదార్థాలను తింటే మనకు జీర్ణం కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అందు కే ఒకసారి ఉపయోగించిననూనెను పదేపదే మరిగించి ఉపయోగించవద్దు. మనం ఇలాంటి నూనెలను ఎన్నిసార్లు వేడిచేస్తే..అంత ప్రమాదక రంగా అందులో ప్లాస్టిక్ ఏర్పడుతుంది. అయినా.. 300 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలోనే రిఫైన్డ్ ఆయిల్స్ తయారవుతాయి. కనుక..ఇవి ద్రవరూప ప్లాస్టిక్ కాక మరేమిటి? అందువల్ల సరైన పోషక విలువ లున్న ఆరోగ్యకరమైన వంట నూనెను ఎంపిక చేసు కోవాలి. ఇందుకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఎంతో శ్రేష్టమై నదని చెప్పాలి.
కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్: తక్కువ ఉష్ణోగ్రత వద్ద తయారు చేసిన వంటనూనెల ఆరోగ్యానికి క్షేమక రం. అలాంటివి ఎటువంటి హాని చేయవు. సంప్ర దాయ పద్ధతులో తయ్యారయ్యే నూనేలను ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. వంటనూనె తయారీకి సంప్రదాయక పద్దతులేమేలని శాస్త్రజ్ఞు లు చెబుతున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రత లేకుండా, రసాయినాలు కలపకుండా, సాధారణ ఉష్ణోగ్రత వద్ద గింజలను పిండి తయారు చేసే నూనె క్షేమదా యకమని శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. ఇలా తయారు చేసిన వంటనూనెలో ఎటువంటి దోషా లు, రోగ కారక లక్షణాలు ఉండవని శాస్త్రజ్ఞు లు చెబు తున్నారు. ఇలా తయారు చేసిన వంటనూనెలో మనిషి శరీరంలో జీర్ణప్రక్రియకు అవసరమైన ఎంజైములు, విటమిన్లు, మినరల్స్, యాంటియా క్సిడెంట్స్ వంటి వన్నీ ఉంటాయని చెబుతున్నారు.
సహజ పద్దతుల్లో తయారు చేసిన వంటనూనెల వాడకం వల్ల కేన్సర్, గుండె జబ్బులు,రక్తపుపోటు, మధుమేహం వంటి రోగాలు దూరమవుతాయని చెబుతున్నారు. జుట్టురాలే సమస్య కూడా తొలగి పోతుందని చెబుతున్నారు. కనుక తక్కువ ఉష్ణోగ్రతలో తయారు చేసిన వంటనూనె వల్ల ఎన్నో ఉపయోగాలుఉన్నాయి. ఇలా సంప్రదాయ పద్ధతులలో తయారు చేసి న కోల్డ్ ప్రెస్‌డ్ నూనెలు అన్ని విధాల ఆరోగ్య దాయకం. కల్తీలకు ఆస్కా రం ఉండదు. ఇతర నూనె ల్లో ఆ గ్యారెంటీ ఇవ్వలేం.
-శైలీ రాణే., ఆరోగ్య సలహాదారు..