Sunday, September 8, 2024

చైనా కుతకుత!

అమెరికా చట్టసభ అధ్యక్షురాలు నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనను చైనా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. తైవాన్‌ తమ దేశ అంతర్భాగమైనప్పుడు అమెరికా చర్య ను ఎలా సమర్థిస్తారంటూ ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తోం ది. అంతటితో ఆగకుండా భారత్‌కూడా తన అభిప్రాయా న్ని వెల్లడించాలని ఒత్తిడి చేస్తోంది. తైవాన్‌కి నానాటికీ పెరుగుతున్న మద్దతుతో చైనా కుతకుత ఉడికిపోతోంది. తైవాన్‌పై భారత్‌ తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని వాదిస్తోంది. చైనాపై భారత్‌ మొదటి నుంచి ఒకే వైఖరిని అనుసరిస్తోందనీ, ఎప్పటికప్పుడు తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాల్సిన అవసరం లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఒకే చైనా విధానాన్ని160 దేశాలు పైగా సమర్థిస్తున్నాయంటూ చైనా విదేశాంగ ప్రతినిధి అన్నారు. ఒకప్పుడు అలా సమర్థించిన మాట నిజమే కావచ్చు. మారుతున్న అంతర్జాతీయ పరిణామా ల్లో సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన దేశాలకు తమ విదేశాంగ విధానాల్లో స్వతంత్రతను పాటించేందుకు హక్కు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వివిధ దేశాల విదే శాంగ విధానాలలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చైనా రష్యాను ఉసికొల్పిన తీరు చాలా దేశాలకు నచ్చ లేదు. తైవాన్‌ విషయంలో ప్రపంచ దేశాల విధానాలను మరోసారి బయటపెట్టాలని చైనా నిర్ణయించుకుంది. తైవాన్‌ విషయంలో ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ లేదన్న మన విదేశాంగ ప్రతినిధి మాటల్లో న్యాయం ఉంది. తైవాన్‌ చైనా అంతర్భాగమేనని అన్ని దేశాల చేత మరో సారి నొక్కి వక్కాణించేట్టు చేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. తైవాన్‌లోఅధిక సంఖ్యాకులు చైనీయులే ఉన్నారని వాదిస్తున్న చైనా ఇప్పుడు కొత్తగా తైవాన్‌ గురించి ఎందుకు పట్టుపడుతోందో ఊహించలేనంత అమాయకులు ఎవరూ లేరు. తైవాన్‌ విషయంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న దాష్టీకాన్ని అంతా సమర్థించా లన్నది చైనా అభిమతంగా కనిపిస్తోంది. తైవాన్‌కి అమె రికా మద్దతు ఉందన్న విషయం బహిరంగ సత్యం. అలాగే, ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలు, ఆర్థిక సాయా న్ని అందించింది.అదికూడా కాదనలేని విషయం .ఈ రెండు దేశాల పట్ల అమెరికా ఉదారంగా వ్యవహరించ డానికీ, అవకాశం కల్పించింది చైనా, రష్యాలేనన్నది కూడా కాదనలేని విషయం. తైవాన్‌ ప్రజలు స్వాతంత్య్రా న్ని కోరుతున్నారు.తమ హక్కులను కాపాడుకోవడమే వారి లక్ష్యం. అలాంటప్పుడు వారిని చైనాకు అనుకూలం గా మారమని ఏదేశమూ బలవంతంగా ఒప్పించ లేదు. చైనా తన మాటను అందరూ పాటించి తీరాలని పట్టు బడుతోంది. చైనా వైఖరిని హాంకాంగ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పౌరసత్వ చట్టంపై పెద్ద ఉద్యమాలే జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పటికీ చైనాపెత్తందారీ తనాన్ని హాంకాంగ్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టే, తైవాన్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సెమీ కండక్టర్లు, చిప్స్‌ తయా రీలో తైవాన్‌ చైనాను మించిపోయింది. ప్రపంచం మొత్తా నికి సెమీ కండక్టర్లను అందిస్తున్నందుకు తైవాన్‌ను అన్ని దేశాలూ సమర్థిస్తున్నాయి.అలాగే, తైవాన్‌, హాంకాంగ్‌ల లో పెట్టుబడులు అమెరికా, దాని మిత్ర దేశాల పెట్టుబడు లు పెరగడానికి అక్కడున్న వాతావరణమే కారణం. ప్రతి దేశమూ ఇప్పుడు ఆర్థిక పరమైన ప్రయోజనాల ప్రాతిపదికగా విదేశాంగ విధానాలను అనుసరిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఆ రీతిలోనె సాగుతున్నా యి. తమ దేశానికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుం దో అంచనా వేసుకుని ద్వైపాక్షిక,వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తైవాన్‌తో సంబం ధాలు పెట్టుకోవద్దని భారత్‌ మాత్రమే కాదు, ఏ దేశమూ చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు.ఈ విషయాన్ని విస్మరించి నియంతృత్వ పోకడలతో వ్యవహరించేందుకు చైనా కానీ, రష్యా కానీ ప్రయత్నిస్తే వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఉక్రెయిన్‌ ఒకనాడు సోవియట్‌ యూనియన్‌ అంతర్భాగ మే కావచ్చు, స్వతంత్ర దేశమైన తర్వాత ఆర్థికంగా ఎదిగేందుకు తన ప్రాథమ్యాలను తాను నిర్థారించుకునే హక్కు ఉక్రెయిన్‌కి ఉంది. తైవాన్‌పై తమ దేశానికి మద్దతు ఇవ్వాలని చైనా భారత్‌ని కోరుతోంది. చైనాకు భారత్‌కి ఏ విషయంలో సాయపడుతోం ది? కొద్ది రోజుల క్రితం భద్రతా మండలిలో లష్కర్‌ తోయిబా అధ్యక్షుడు హఫీజ్‌ సయీద్‌ సోదరుడు రవూఫ్‌ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానంపై అన్ని దేశాలూ సమర్థించినా, చైనా మోకాలడ్డటం వల్ల ఆ తీర్మానం వీగిపోయింది.అలాగే, శ్రీలంకలోని హంబన్‌ టోటా రేవు కు గూఢచార నౌకను భారత్‌ వద్దన్నా పంపింది. భూటా న్‌ భూభాగంలోకి చైనీస్‌ సేనలు చొచ్చుకుని వచ్చినప్పు డు భారత్‌ అభ్యంతరం చెప్పినా చైనా లెక్క చేయలేదు.ఏ విషయంలోనూ చైనా మన దేశానికి సహకరించ లేదు. ఇప్పుడు తైవాన్‌ విషయంలో భారత్‌ సాయం కోరడం నంగనాచితనం కాక మరేమిటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement