శ్రీలంక కొత్త అధ్యక్షునిగా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఎన్నిక కావడం ఆశ్చర్యంగా భావించేవారున్నట్టే, కల్లోల లంకను గాడిని పెట్టేందుకు సీనియర్ నాయకుడి సేవలు దేశానికి అవసరమని నిర్ద్వంద్వంగా స్పష్టం చేసేవారూ ఉన్నారు. లంకలో ప్రస్తుత పరిస్థితి పిల్లి మెడలో గంట ఎవరు కడతా రన్నట్టుగా ఉంది. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో అధ్యక్ష పదవిని నిర్వహించడం ఏడు పదులు దాటిన విక్రమ సింఘేకి కత్తుల వంతెనపై నడక వంటిదే.ఇటీవల జరిగిన అల్లర్లలో ఆయన నివాసానికి కూడా నిప్పంటిం చారు. వేల కొలదీ అమూల్యమైన పుస్తకాలు బుగ్గి పాల య్యాయి. దేశ చరిత్రలో అత్యంత విషాద ఘట్టానికి కార కులైన రాజపక్స సోదరులతో సన్నిహితంగా ఉన్నారన్న అనుమానంపై ఆయన నివాసానికి కూడా ఆందోళన కారులు నిప్పు పెట్టారు.
రాజపక్స సోదరుల తప్పులను సరిదిద్ది శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తానని ఆయన కొద్ది రోజుల క్రితం తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణం చేసిన సందర్భంలో ప్రకటించారు. ఆయనకు రణతంత్రం తెలిసినా,అందుకు తగిన వ్యూహాలను అమ లు చేయగల శక్తి లేదు. లంకను దారిలోకి తేవడం అంత తేలిక కాదు, ఆయన ఎంత కాలం ఆ పదవిలో ఉంటారో తెలియదు. వయస్సు రీత్యా ఎక్కువ శ్రమపడే స్థితి ఆయ నకు లేదు. మరో వంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయిన లంకకు అప్పు ఇచ్చేవారు ఎవరూ లేకపో వడంతో ఆయన ఆశలన్నీ ఆదిలోనే ఆవిరి అయ్యాయి. అయితే, దేశ భక్తుల కుటుంబం నుంచి వచ్చిన రణిల్ అధ్యక్ష పదవికి పోటీలో కొనసాగాలని నిర్ణయించారు. ఆయనకున్న అనుభవం, పాలనాదక్షత కొన్ని దశాబ్ధాల క్రితం నాటి చరిత్రగా మిగిలిపోయింది. ఆయన ఆరు సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. శ్రీలంక అభివృద్దిలో ఆయన కృషి ఉంది.అయితే, మాజీ అధ్యక్షుడు జెఆర్ జయవర్దనే ఎగ్జిక్యూటివ్‌ప్రెసిడెంట్ వ్యవస్థను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఆయన హియాంలోనే జాఫ్నా కేంద్రంగా ప్రత్యేక తమిళ ఈలం (తమిళులకు ప్రత్యేకదేశం) కోసం ఆందోళనను వేలు పిళ్ళై ప్రభాకరన్ ప్రారంభించారు.అది మొదట్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా,తమిళ టైగర్లుగా చెప్పుకున్న ఆ సంస్థ సభ్యులు జరిపిన దాడుల్లో అనేక మంది ప్రముఖులు నేలకొరగడమో, తీవ్రంగా గాయపడటమో జరిగింది.
ప్రధానమంత్రి హోదాలో యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడు ప్రేమదాస తమిళ టైగర్ల బాంబు దాడిలో వేదికమీదనే మరణించారు.అలాగే, రక్షణ మంత్రి లలిత్ విలియం,అదేపార్టీకి చెందిన దిస్సా నాయక్ ప్రభృతులు మరణించారు. తొలి మహిళా ప్రధానిగా పేరొందిన సిరిమావో బండారు నాయకే భర్త దిస్సానాయకే కూడా దాడిలోనే మరణించారు. తమిళ ఈలం టైగర్ల ఉద్యమం ఉధృతమైన తర్వాత ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు నేలకొరిగారు.అందుకే ,ఇప్పుడుఅక్కడ నాయకత్వ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇష్టం లేకపోయినా రణీల్ విక్రమ సింఘేని కొత్త అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.ఆయన తండ్రి దినపత్రిక లకు అధిపతిగా వ్యవహరించారు. ఆయన ఎవరి చేతిలో ఓడిపోయారో ఆ రాజపక్సకు తర్వాత కాలంలో సన్నిహి తుడు కావడం శ్రీలంక రాజకీయాలో విచిత్ర పరిణా మం. అంతేకాకుండా శ్రీలంకలో కూడా అనువంశిక పాలన నడిచింది. బండారు నాయకే దంపతులు వరు సగాదేశాధినేతలుగా పని చేశారు.ఆ తర్వాత వారి కు మార్తె చంద్రిక కుమార తుంగ కూడా ప్రధా న మంత్రిగా వ్యవహరించారు.ఆమె ఒక సభలో ప్రసం గిస్తున్న సమ యంలో దాడి జరిగింది.ఆ దాడిలో కన్ను పోయింది. శ్రీలం కలో ప్రముఖు లపై దాడులు జరగడం సర్వ 0సాధారణం. లంకలో బండారు నాయకే కుటుంబ పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ, జయవర్దనే నేతృత్వం లోని యునైటెడ్ నేషనలిస్టు పార్టీ (యూఎన్‌పి) వంతుల వారీగా పాలన సాగించాయి.
జయవర్దనే అధ్యక్షునిగా ఉన్నప్పుడే మన ప్రధాని రాజీవ్ గాంధీ కొలంబోలో పర్యటించారు. ఆ సమయంలోనే రాజీ వ్‌పై సైనిక వందనం స్వీకరించే సమ యంలో దాడి జరి గింది. శ్రీలంకకు మన దేశం ఎంతో సాయం చేసింది. లంకలో పుట్టిన ఉగ్రవాద సంస్థ చేతుల్లో మన జాతీయ నాయకుడు మరణిం చాడు. లంకలో రాజకీయ చరిత్ర అంతా దాడులు, ప్రతిదా డులతోనే నిండిఉంది. అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రభు త్వంలోనైనా రాజకీయపార్టీల నాయకులు అధికారం కోసం పరస్పరం దాడులు జరుపుకోవడం తప్ప ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వారు అరుదు. ఆ దేశానికి ఏదేశమూ ఇవ్వనంత సాయాన్ని మనదేశం అందించింది.ఇప్పటికీ అంది స్తోంది. రాజపక్స హయాంలో లంక చరిత్ర మారి పోయి ంది.. చరిత్రగతంగా చూస్తే తమకు ఎంతో సాయం చేసిన భారతదేశంతో బదులు చైనాతో సన్నిహితంగా ఉండటం వల్లనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.