Friday, November 22, 2024

పొలిథిన్‌, ప్లాస్టికకిే బైబై !

కాలుష్య వ్యాప్తిలో పొలిథిన్‌ సంచులు, పొలిథిన్‌ వస్తువుల వ్యర్ధాలు ప్రధాన కారణమవుతున్నాయన్న సంగతి అందరికీ తెలుసు. విస్తరిస్తున్న కాలుష్య భూతం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది.అయితే, సులభం గా వస్తువుల రవాణాకు ఉపయోగ పడుతున్నందున, పొలిథిన్‌ వస్తువులను వాడకుండా ఉండలేకపోతున్నాం. ఇందుకు కారణం వాటికి ఉన్న సౌలభ్యత . పండ్లు, కూర గాయల దగ్గర నుంచి నిత్యావసరాలను పొలిథిన్‌ సంచు ల్లో మడత పెట్టి చేతుల్లో తీసుకుని వెళ్ళేందుకు వీలుగా ఉంటుంది. కాగితంలోనో, జనపనార గుడ్డల్లోనో చుట్టి తీసుకుని వెళ్తే దానిని ఎబ్బెట్టుగా, నామోషీగా భావించే వారున్నారు. అనుకరణ వల్ల పొలిథిన్‌లిథిన్‌ సంచులకు జనం అలవాటు పడిపోయారు.ఎక్కువ సేపు పొలిథిన్‌ సంచుల్లో లేదా గుడ్డల్లో మడతపెట్టి ఉంచిన తినుబండా రాల్లో, పండ్లు, కూరగాయల్లో విషం పేరుకుం టుందని పర్యావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఒక సారి మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది. రెండో సారి ఉపయోగించే వీలుండదు. గుళ్ళల్లో ప్రసాదాలను విస్తరాకుల్లో, ఎండిన ఆకులలో పంపిణీ చేసేవారు. ఇప్పుడు పొలిథిన్‌ సంచులు వచ్చాక వాటిల్లోనే సరఫరా చేస్తున్నారు. ప్రసాదాల్లో తడిగా,ముద్దగాఉన్నవి ఈ పొలిథిన్‌ సంచుల్లో ఉంచి సరఫరా చేయడం వల్ల క్రిము లు చేరి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అమెరికాలో 150 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలు రోజూ సముద్రంలో కలుస్తున్నాయి. సగటున నిమిషానికి ఒక ట్రక్కు వ్యర్ధాలు సముద్రంలో కలుస్తున్నాయి.2050 నాటికి సముద్రంలో చేపల కన్నా వ్యర్ధాలే ఎక్కువ ఉంటాయని ఎల్లెన్‌ మ్యాక్‌ ఆర్థర్‌ ఫౌండేషన్‌ అంచనా వేసింది. కృత్రిమ అణు పుంజా లతో తయారు చేసే పదార్ధమే ప్లాస్టిక్‌,ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం మనుషులకే కాకుండా జంతు జాలానికి హానికరమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. అన్నాన్నీ, ఇతర దినుసులనూ, తినుబండారాలను ప్లాస్టిక్‌ సంచుల్లో వేసుకుని విలాసంగా, ఒంటి చేత్తో ఇంటికి తీసుకుని వెళ్ళడం ఆధునిక జీవన విధానంగా మారింది. ఆ సంచులను ద్విచక్రవాహనాలకు తగిలించి బండ్లు నడపడం వల్ల లీక్‌ అయిన పెట్రోల్‌ ఆ పదార్ధాల లో కలిసి పోవడం కూడా సహజ సిద్ధ పరిణామంగా మారింది. ప్లాస్టిక్‌ వస్తువుల్లో కేన్సర్‌ కారకాలు ఉంటాయ ని వై ద్యులు హెచ్చరిస్తున్నారు. కేన్సర్‌ వ్యాధి గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ విస్తరించడానికి ప్లాస్టిక్‌ వస్తువుల వాడకమే కారణమన్న అభిప్రాయం ఉంది. మహాత్మా గాంధీ పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

పర్యావరణానికి హాని చేకూర్చే వస్తువుల విని యోగాన్ని ఆయన ఎన్నడూ ప్రోత్సహించలేదు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రభుత్వం ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జూలై ఒకటవ తేదీ నుంచి ప్లాస్టిక్‌, పొలిథిన్‌ సంచుల వినియోగ నిషేధాన్ని ఖచ్చితం గా అమలు జేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌,పొలిథిన్‌ వస్తువుల వినియోగంపై నిషేధాన్ని తుచ తప్పకుండా అమలు జేయాలన్న ఆదేశాలను పూర్వపు ప్రభుత్వాలు కూడా జారీ చేసినా, చూసీచూడనట్టు ఊరుకుండేవారు. ప్రజల్లో నిర్లిప్తభావం వల్ల ఎవరూ సీరియస్‌గా తీసుకోవ డం లేదు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయాన్ని కనుగొనాలని అధికారంలో ఉన్న పెద్దలు పిలుపు ఇస్తుంటారు.అయితే, పూర్వ కాలం నుంచి మన పెద్దలు జనపనార సంచులు, గుడ్డ సంచుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. జనపనార సంచులు ఇప్పుడు ఎక్కడా కనిపించ డం లేదు. బాదం ఆకుల విస్తరాకుల వినియోగం చాలా వరకూ తగ్గిపోయింది. అరటి ఆకుల్లో భోజనం చేయడం అనేది ఉత్తమ సంప్రదాయం. అయితే, అరటి ఆకు అన్ని చోట్లా లభించదు ఇందుకు బదులుగా ,ప్లేటు ఆకారంలో చేసిన విస్తరాకుల్లోనే సంతర్పణలు చేస్తున్నారు.కిరాణా సామగ్రిని కాగితపు సంచుల్లో అమర్చి విక్రయించే సంప్ర దాయం ఇప్పటికీ చాలా చోట్ల ఉంది.దీని వల్ల వస్తువుల నాణ్యత దెబ్బతినదు. కాగితపు సంచుల తయారీ గృహ పరిశ్రమగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో విరాజి ల్లుతోంది.అయితే, కిరాణా కొట్ల స్థానంలో మాల్స్‌, డిపార్టు మెంటల్‌ స్టోర్సు వెలిశాయి. వీటిల్లో అందంగా అలంకరించడానికి పోలిథిన్‌,ప్లాస్టిక్‌ వస్తువులు కాగితాల ను ఎక్కువగా వాడుతున్నారు.ఆఖరికి ఇళ్ళల్లో ఫ్లవర్‌ వాజుల్లో ఇప్పుడు ప్లాస్టిక్‌ పూలతో డ్రాయింగ్‌ రూమ్‌ల లో అలంకరిస్తున్నారు. ఆవు, గేదె వంటి పాడి పశువుల ను మేపడానికి గతంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు. ఇప్పుడువాటిని వీధుల్లో చెత్తతో పాటుపొలిథిన్‌ కాగితాలను కూడా తినేస్తున్నాయనీ, వీటి వల్ల అవి అనారోగ్యంపాలు కావడమే కాకుండా, పాలు విషపూరి తమవుతున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో పొలిథిన్‌, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement