ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐల పేర్లు చాలా కాలం కిందటి వరకూ ఎవరికీ తెలియవు. ఆదాయం పన్ను (ఐటి) సోదాల గురించి మాత్రమే తెలుసు. గడిచి న కొద్ది సంవత్సరాలుగా ఈడీ, సీబీఐ తనిఖీలు,సోదాల గురించిన వార్తలు దాదాపురోజూ వస్తున్నాయి. యూపీ ఏ హయాంలో సీబీఐ దాడులు ఎక్కువగా జరిగేవి. రాజకీయ ప్రత్యర్ధులను వేధించేందుకు సీబీఐని అధికా రంలో ఉన్న వారు తరచూ ఉసిగొల్పుతున్నారని సాక్షా త్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈడీని అదే మాదిరిగా ప్రయోగిస్తున్నారు.ఈవిషయాన్ని బీజేపీయే తర పార్టీలు దాదాపు రోజూ ఆరోపిస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు స్వయంగా ఆ వ్యాఖ్య చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌ని ఆరు మాసాలుగా జైలులో ఉంచడానికి తగిన కారణాలేమిటని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లి లిక్కర్ కేసులో మద్యం సిండికేట్ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణకు గురైన ఆయన వద్ద ఒక్క పైసా కూడా లభించనప్పుుడు ఆరు మాసాలుగా ఆయనను జైలులో ఎలా ఉంచారని… ఈడీ అధికారులను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్న ఆప్ నాయకులకే కాకుండా, దేశంలో ఈడీ దాడుల బాధితు లందరికీ ఊరట కలిగించింది.సర్వోన్నత న్యాయస్థానం తమ బాధలను గమనంలోకి తీసుకుందనీ,ఇక తమకు న్యాయం జరుగుతుందన్న ఆశలు వారిలో మొలకెత్తా యి. ఈడీ దాడులు, కస్టడీ, జైలుకి పంపడం వంటివి తప్ప పత్రికల్లో అసలు వార్తలేవీ లేవన్నంతగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి.
అవినీతిని కూకటి వేళ్ళతో పెకలించాలని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకున్న మాట నిజమే. దానిని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే, ఈ దాడులు ఏకపక్షంగా సాగుతున్నాయన్న ఆరోపణలు అదే సందర్భంలో వస్తున్నాయి. ఢిల్లిలో రామలీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రధానాంశం ఇదే. ఈడీ బాధితులైన రాజకీయ నాయకులంతా కలిసి ఈ ర్యాలీని నిర్వహించా రు. వీరిలో ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రసం గం అందరినీ ఆకర్షించింది. ఆర్‌జేడీ వ్యవస్థాపకుడు లాలూ, ఆయన భార్య రబ్డిదేవి, కుటుంబ సభ్యులంతా ఈడీ, సీబీఐ బాధితులే. రాజకీయ ప్రత్యర్ధులను వేధించ డానికి మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ దాడులను జరిపి స్తోందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉంది. ఆప్‌నాయకులను ప్రత్యేకించి ఈడీ టార్గెట్ చేయ డం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
ఆప్ కన్వీనర్, ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే ఢిల్లి లోనే కాక, పొరుగు రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేసి, బీజేపీకి ప్రత్యామ్నా యంగా పార్టీని పటిష్టం చేశారు. దాంతో ఆప్ ఢిల్లికే పరి మితం కాక పంజాబ్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిం ది. గుజరాత్ అసెంబ్లి ఎన్నికల్లోనూ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం మూడు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బతీయగల స్థాయికి ఆప్ ఎదిగింది. కేజ్రీవాల్‌ని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచడం కోసమే ఆయన రిమాండ్‌ని పొడిగించారని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీలకు ప్రతి రోజూ కీలకమైనదే. ఈ దాడులు, రిమాండ్లు తమ పార్టీల ప్రచార వ్యవధిని దెబ్బతీస్తాయన్న ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉండటం సహజమే. పైగా, లిక్కర్ కుంభకోణం ఇప్పుడే కొత్తగా బయటపడింది కాదు. సంజయ్ సింగ్ అరెస్టునే తీసుకుంటే, గత అక్టోబర్ కన్నా ముందు నుంచి సాగుతున్నదే. కేజ్రీవాల్ అరెస్టు కూడా అనివార్యమనీ, ఏదో ఒక రోజు ఆయనను అరెస్టు చేయవచ్చని అనుకుం టున్నదే. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత ఆయన ను అరెస్టు చేయడం వల్ల ఆప్ నాయకుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. రానున్న కొన్ని రోజుల్లో తనతో సహా నలుగురిని అరెస్టు చేయవచ్చని కేజ్రీవాల్‌కి అధికా ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఢిల్లిd మంత్రి అతిశీ ఆందో ళన వ్యక్తం చేశారు. ఆప్‌ని పూర్తిగా తుడిచి పెట్టడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. అయితే, తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయన షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచు కుని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆప్ నాయకులే కాకుండా, ప్రతిపక్షాలు సైతం కోరుతున్నాయి. సంజయ్ సింగ్‌కి బెయిల్ రావడంతో ఆప్ పార్టీ మరింత ఉత్సా హంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు.