అధికారంలో ఉన్నంతకాలం కన్నుమిన్ను కానక అహంకార ధోరణిలో వ్యవహరించిన వారు అధికా రాన్ని కోల్పోయిన తర్వాత ప్రజల ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందనే విషయం చాలా మంది పాలకుల విషయంలో రుజువైంది. ఇలాంటి వారిని ఉద్దేశించి పూర్వకవులు అధికారాంతమునందుచూడవలె అనే పద్యాన్నివెలువరించారు. అలాంటి పాలకుల జాబితా లో ఇప్పుడు కొత్తగా శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్స చేరారు. రాజపక్స సోదరులను దేశం విడిచి వెళ్లొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించడం వారికి ఎంత అవమానం! తిరుగు లేని అధికారాలను చెలాయించిన రాజకుటుంబానికి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదు రైందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. రాజపక్స ప్రధానిగా ఉన్నప్పుడు గొటబాయ రాజపక్స దేశాధ్యక్షునిగా,బసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగానూ వ్యవహరించారు.కేవలం కుటుంబ వ్యవహారంగా పాలననుసాగించిన మహిందా సోద రులు ఎన్నో ఆరోపణలకు గురి అయ్యారు.అంతా సవ్యంగా ఉంటే వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రజలు పట్టించుకునేవారు కారేమో.కానీ, దేశం పరిస్థితి నానాటికీ తీసికట్టు చందంగా తయారయ్యే సరికి రాజపక్స సోదరులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.వారి రాజీనామా కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిం చినప్రజలు దేశాధ్యక్షుని భవనాన్ని ఆక్రమించారు. దాంతో అధ్యక్షుడు గొటబాయ రహస్యంగా దేశాన్నిదాటి మలేసియా జారుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కి వెళ్ళినట్టు తాజా సమాచారం.సింగపూర్‌లో ఆయనకు సొంత ఇల్లు ,ఫ్లాట్ ఉన్నాయనీ,అందుకే సింగపూర్‌ని తన గమ్యంగా ఎంచుకున్నారని కథనం.గొటబాయ రాజీ నామాతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష పదవికి ఈనెల 20వ తేదీన కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోనున్నారు. శ్రీలంకలో పరిస్థితులు సవ్యంగా లేవు.ఆహార ధాన్యాలు, ఆయిల్స్, కూరగాయలు, మత్స్య మాంసాల ధరలు బాగా పెరిగి పోవడంతో ప్రజల్లో తిరుగుబాటు బయలు దేరింది. బియ్యం, పెట్రోల్ వంటివి దొరికినా అన్నింటి రేట్లు భారీ గాఉండటంతో సామాన్యుని జీవనం భారంగా మారింది.దాంతో ప్రజల్లో సహనశక్తి నశించి ప్రధాన మంత్రి, అధ్యక్షులపై తిరుగుబాటుకు ఉపక్రమించారు. ప్రధాని మహిందా రెండు నెలల క్రితం రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గ సభ్యులు కూడా రాజీనామా చేశారు.అధ్యక్షుడు గొట్టబాయ చివరి వరకూ పదవిని పట్టుకుని వేళ్ళాడారు.ప్రజలు అధ్యక్ష భవనంలోకి దూసుకుని రావడంతో విధిలేని పరిస్థితిలో నమ్మ కస్తులఅండతోదేశం విడిచి పారిపోయారు.తన రాజీ నామాని ఈ-మెయిల్లో పంపారు.
శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితులు సమకాలీనంగా ఏ దేశంలోనూ జరగలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.అసలు ఈ పరిస్థితి ఇంతగా క్షీణించడానికి మహిందా రాజపక్స కార ణమని ప్రజలంతా ఆయనవైపు వేలెత్తి చూపుతున్నారు. మహిందా గతంలోదేశాధ్యక్షునిగా కూడా వ్యవహ రించారు.ఆయనను చైనా ఒక పావుగా ఉపయో గించుకుంది.దేశంలోని ప్రభుత్వ ఆస్తులను చైనా కంపెనీలకు అమ్మేశారు.దేశంలోప్రజాస్వామ్య హక్కు లను కాలరాశారు.ముఖ్యంగా మానవ హక్కు లను పూర్తిగా నశింపజేశారు.దీంతో ఆయన పట్ల వ్యతిరే కత పెరిగింది.ఆర్థిక శాఖను ఆయన సోదరుడు బసిల్ రాజపక్స నిర్వహించడం వల్ల మహింద నోట మాట శాసనంగా ఆర్థిక వ్యవహారాలు సాగాయి. ప్రజాస్వామ్య ఉద్యమ కారులుగడిచిన కొన్ని నెలలుగా సాగించిన ఉద్యమంలో ఆస్తినష్టం బాగా జరిగింది. గొట బాయ పరారు అయినతర్వాత తాత్కాలిక అధ్యక్ష బాధ్యతను ప్రధాని విక్రమ సింఘే చేపట్టారు.ఆయన దేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠినంగా వ్యవ హరించేందుకు కనిపిస్తేకాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే,ఆందోళన కారులు దేనికీ వెరవకుండా పోరాటం సాగిస్తున్నప్రజలను అదుపు చేయడానికి సైన్యానికి పూర్తి అధికారాలను రణసింఘే ఇచ్చారు. రణసింఘే ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రజల పట్ల సానుభూతి ధోరణిలో మాట్లాడ ారు.ఇప్పుుడు ఆయన మాటల్లో కూడా కరకుతనం కనిపిస్తోంది.ప్రజల పట్ల ఆగ్రహ ధోరణిలో మాట్లాడటం మానకపోతే ఆయనపై కూడా తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన నివాసానికి ఆందోళనకా రులు నిప్పు పెట్టారు. రాజపక్స ప్రస్తుత పరిస్థితి పూర్తిగా స్వయంకృతం. చైనా చెప్పినట్టు నడుచుకుని ఆయన తన అధికారాన్ని కోల్పోవడమే కాకుండా దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటానికి కారకులయ్యారు.నేపాల్‌లో కూడాఇదే పరిస్థితులు ఏర్పడి ఉండేవి. అక్కడ కొత్త ప్రధాని ముందే మేల్కొని చైనా ఉచ్చునుంచి బయట పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.